High Court Sends Leagal Notice to Kareena Kapoor: బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ (Kareena Kapoor) చట్టపరమైన వివాదంలో చిక్కున్నారు. తన గర్బం గురించిన పుస్తకం టైటిల్‌కు ఆ పదం వాడినందుకు తాజాగా ఆమెకు మధ్యప్రదేశ్‌ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం కరీనా నటిగా రాణిస్తూనే మరోవైపు యునిసెఫ్ (యునైటెడ్ నేష‌న్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ చిల్డ్ర‌న్స్ ఎమర్జెన్సీ ఫండ్‌)జాతీయ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నారు. ఈ క్రమంలో తరచూ ప్రెగ్నెన్నీ ఉమెన్స్‌, పిల్లలు, తల్లుల గురించిన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు.


తల్లిదండ్రులు పిల్లలతో ఎలా ఉండాలి, ప్రెగ్నెన్సీ ఉమెన్‌ ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి వాటిపై సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అంతేకాదు నిపుణులతో చర్చిస్తూ అవగాహన కార్యక్రమాలు వంటి చేస్తున్నారు. ఈ క్రమంలో తన గర్బం సమయంలో ఆమెకు ఎదురైన అనభవాలపై కరీనా పుస్తకం రూపంలో పంచుకున్న సంగతి తెలిసిందే. 2021లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన కరీనా దానికి 'కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్: ది అల్టిమేట్ మాన్యువల్ ఫర్ మామ్స్-టు-బీ' అని టైటిల్‌ పెట్టారు. అయితే ఇప్పుడు ఇదే ఆమెను చిక్కుల్లో పడేసింది. ఈ పుస్తకం టైటిల్‌ క్రైస్తవుల మనోభవాలు దెబ్బతీసేలా ఉందంటూ అడ్వకెట్‌ క్రిస్టోఫర్‌ ఆంథోనీ మధ్యప్రదేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు.


Kareena Received Notice From High Court: పాపులారిటీ కోసం బైబిల్‌ అనే పదాన్ని ఉపయోగించడం సరికాదని, తన గర్భాన్ని పవిత్ర గ్రంథమైన 'బైబిల్‌'తో పోల్చడం అభ్యంతరకరమంటూ ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా 2021లోనే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జబల్‌పూర్ వాసి, లాయర్‌ ఆంథోని తొలుత స్థానిక పోలీస్ స్టేషన్‌లో కరీనాపై ఫిర్యాదు చేశారు. క్రైస్తవుల పవిత్ర గ్రంథమైనటువంటి బైబిల్‌ను నటి తన గర్భంతో పోల్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఆమె పుస్తకం టైటిల్ క్రైస్తవ సమాజం మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఫిర్యాదులో ఆరోపించారు. ఈ కేసులో కరీనాపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అయితే పోలీసులు కేసు నమోదు చేసేందుకు నిరాకరించారు. దీంతో అతడు మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించాడు.


Also Read: ఏడాది తర్వాత ఓటీటీకి సూపర్‌ హిట్‌ మూవీ 'జర హట్కే జర బచ్కే' - తెలుగులోనూ స్ట్రీమింగ్‌, ఎప్పుడంటే!


అయితే 'బైబిల్' అనే పదాన్ని ఉపయోగించడం వల్ల క్రైస్తవుల మనోభావాలను ఎలా దెబ్బతీస్తుందో నిరూపించడంలో ఆంథోని విఫలమైనందున  మేజిస్ట్రేట్ కోర్టు అతని పిటిషన్‌ను కొటివేస్తు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత లాయర్‌ ఆంథోని అదనపు సెషన్స్ కోర్టును సంప్రదించారు. అక్కడ కూడా అతడికి ఎదురెబ్బ తగిలింది. ఈకేసులో అతడికి ఉపశమనం ఇచ్చేందుకు అదనపు సెషన్‌ కోర్టు నిరాకరిచింది. సెషన్‌ కోర్టు తీర్పును సవాలు చేస్తూ అతడు ఇటీవల మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఆశ్రయించారు. అతడి పిటిషన్‌ స్వీకరించిన కోర్టు శుక్రవారం కరినాకు నోటీసులు జారీ చేసింది. జూలై 1న జరిగిన విచారణకు హాజరుకావాల్సిందిగా కరీనాను హైకోర్టు హెచ్చరించింది.