Arundhati Child Artist Divya Nagesh Latest Look: అనుష్క శెట్టిని స్టార్‌ని చేసిన సినిమా, టాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఆ మూవీ ఓ సంచలనం. అదే 'అరుంధతి' మూవీ. అప్పటి వరకు గ్లామర్‌ పాత్రలతో ఆకట్టుకున్న అనుష్క ఈ సినిమాతో ఇండస్ట్రీ 'జేజమ్మ' అయిపోయింది. 2009లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. ఇందులో జేజమ్మగా అనుష్క తన నటనతో విపరీతంగా ఆకట్టుకుంది. అప్పటి వరకు హీరో సరసన గ్లామరస్‌గా కనిపించిన అనుష్క 'అరుంధతి'లో విశ్వరూపం చూపించింది.


అన్ని వర్గాల ఆడియెన్స్‌ని ఆకట్టుకున్న ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌ కొట్టింది. ఇందులో అనుష్క చిన్ననాటి పాత్ర పోషించిన అమ్మాయి అయితే కళ్లతోనే నటించింది. ఈడ్చి పాడేయండి విన్నీ అంటూ సీరియస్‌గా చెప్పిన డైలాగ్‌ అయితే ఆడియెన్స్‌కి గూస్‌బంప్స్‌ తెప్పించింది. చిన్నారి అనుష్కగా నటించిన ఆ అమ్మాయి ఒక్క సినిమాతో ఎంతో పాపులర్‌ అయ్యింది. కేవలం కళ్లతోనే హావభావాలు పలికించిన ఈ చిన్నారి పేరు దివ్య నగేష్‌. తమిళనాడు చెందిన ఈమే విక్రమ్‌ 'అపరిచితుడు' సినిమాతో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించి గుర్తింపు పొందింది. ఇదే సినిమాతో తెలుగు ఆడియెన్స్‌కి కూడా పరిచయం అయ్యింది. ఆ తర్వాత అరుంధతిలో అనుష్క చిన్నప్పటి పాత్రలో కనిపించి మెప్పించింది.






నిజంగా అనుష్క చిన్నప్పుడు ఇలానే ఉండేదేమో అనేంతగా తనదైన నటనతో ఆకట్టుకుంటుంది. తన యాక్టింగ్స్‌ స్కిల్స్‌తో అందరి చేత ప్రశంసలు అందుకుంది. ఈ ఒక్క సినిమాతో ఒవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయింది. ఈ దెబ్బతో ఆమెకు ఇండస్ట్రీలో స్టార్‌ అయిపోవడం పక్కా అనుకున్నారు. కానీ ఈ సినిమాతో దివ్వ నగేష్‌ మళ్లీ ఏ సినిమాలో  కనిపించలేదు. కానీ అప్పుడప్పుడు సోషల మీడియాలో మాత్రం మెరుస్తుంది. తరచూ తన ఫోటోలు షేర్‌ చేస్తూ అలరిస్తుంది. దీంతో సోషల్‌ మీడియోలో ఆమె ఫోటోలు వైరల్‌ కావడం తెలుగు ఆడియన్స్‌ కంటపడింది. దీంతో ఈమే ఎవరో గుర్తుపట్టారా? అంటూ నెట్టింట దివ్య నగేష్‌ ఫోటోలు దర్శనం ఇస్తున్నాయి.  






దీంతో ప్రస్తుతం ఆమె లుక్‌ చూసి నెటిజన్లంతా షాక్‌ అవుతున్నారు. అరుంధతిలోని ఈ చిన్నారి దివ్య నగేష్‌ ఇప్పుడు ఇంతలా మారిపోయిందా? అంటూ సర్‌ప్రైజ్‌ అవుతున్నారు. హీరోయిన్లను మించిన అందంతో ఆశ్చర్యపరుస్తుందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా అరుంధతి తర్వాత హయ్యర్‌ స్టడిస్‌పై ఫోకస్‌ పెట్టిన ఈమే ఇప్పుడు అవకాశం వస్తే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అంటుంది. తమిళం, మలయాళంలో ఆడపదడపా సినిమాలు చేస్తున్న దివ్య తెలుగులో చాన్స్‌ వస్తే మళ్లీ రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానంటూ రీసెంట్‌గా ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో ఒపెన్‌ అయ్యింది. ప్రస్తుతం 'అరుంధతి' చిన్నారి జేజమ్మ లుక్‌ సోషల్‌ మీడియలో వైరల్‌ అవుతుంది.