Mr and Mrs Mahi: 'నువ్వు కొట్టలేదు.. చంపేశావు' - క్రికెటర్‌గా జాన్వీ కపూర్‌, ఆకట్టుకుంటున్న 'మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి' ట్రైలర్‌ 

Mr and Mrs Mahi Trailer:బాలీవుడ్‌ టాలంటెడ్‌ యాక్టర్‌ రాజ్‌కుమార్‌ రావు, జాన్వీ కపూర్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మాహి'. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ బాగా ఆకట్టుకుంటుంది.

Continues below advertisement

Mr and Mrs Mahi movie Trailer Out: బాలీవుడ్‌ టాలంటెడ్‌ యాక్టర్‌ రాజ్‌కుమార్‌ రావు, జాన్వీ కపూర్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మాహి'. స్పోర్ట్స్‌ డ్రామా తెరకెక్కితున్న ఈ సినిమా మే 31న థియేటర్లో రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నేడు మూవీ ట్రైలర్‌ని రిలీజ్‌ చేసింది మూవీ టీం. ఈ సినిమా నిర్మాత కరణ్‌ జోహార్‌ తాజాగా సోషల్‌ మీడియా వేదికగా మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి మూవీ ట్రైలర్‌ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్‌ బాగా ఆకట్టుకుంటుంది. ఈ మూవీ టైటిల్‌ రోల్లో జాన్వీ కపూర్‌ నటిస్తుంది. క్రికెట్‌ ఆడిట అన్నా.. చూడటం అన్న ఇష్టం ఉండే భార్య పాత్రలో జాన్వీ నటించింది. తనకు ఇష్టమైన క్రికెట్ ను తండ్రి వల్ల విడిచిపెట్టిన కొడుకు పాత్రలో రాజ్ కుమార్ రావు నటించారు. 

Continues below advertisement

తండ్రి కోసం క్రికెటర్ అవ్వాలనే తన కలను వదులుకుంటారు. తండ్రి వ్యాపారం చూసుకుంటున్న అతడికి డాక్టర్‌ చదివిన మహికి(జాన్వీ కపూర్‌)తో పెళ్లి.. ఇక క్రికెట్‌ అంటే ఇష్టం ఉన్న ఆమె కూడా, తన తల్లిదండ్రుల కోరిక మేరకు డాక్టర్‌ అవుతుంది. పెళ్లి తర్వాత ఆమె భర్త మహి(రాజ్ కుమార్ రావు) తన ప్రతిభను గుర్తించి ఆమె కలను నిజం చేసుకోమంటాడు. తనకు ఇష్టమైన క్రికెట్‌ ఆడమని ప్రొత్సహిస్తాడు. అంతేకాదు దగ్గరుండి తనకి కోచింగ్ కూడా ఇస్తాడు. అలా భార్యకు సపోర్టు ఇచ్చి ఆమె కలను నిజం చేస్తాడు. ఈ క్రమంలో వారికి ఎదురైన చేదు అనుభవాలు, ఆడపిల్ల క్రికెట్‌ ఆడటం ఏంటని ప్రశ్నించే సమాజం.. ఇలా తమ చూట్టు పరిణామాలు ఎదుర్కొని 'మహి'  క్రికెటర్‌ ఎలా అయ్యిందనే అంశాలతో 'మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి' ట్రైలర్‌ను మలిచారు. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్‌ బాగా ఆకట్టుకుంటుంది. ఇందులో జాన్వీ, రాజ్‌కుమార్‌ పాత్రలు ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ ట్రైలర్‌ మూవీపై ఆసక్తిని పెంచుతుంది. 

Also Read: ఏడాది తర్వాత ఓటీటీకి సూపర్‌ హిట్‌ మూవీ 'జర హట్కే జర బచ్కే' - తెలుగులోనూ స్ట్రీమింగ్‌, ఎప్పుడంటే!

Continues below advertisement