Trinayani Serial Actress Pavithra Jayaram Died: సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బుల్లితెర నటి. త్రినయని సీరియల్ ఫేం పవిత్ర జయరాం దుర్మరణం చెందారు. ఈ రోజు తెల్లవారు జామున మహబూబ్‌నగర జిల్లా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందినట్టు సమాచారం. కర్ణాటకలోని తన సొంత గ్రామానికి వెళ్లిన ఆమె నేడు తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. షూటింగ్ నిమిత్తం నేడు(ఆదివారం) తెల్లవారుజామున కర్ణాటక నుంచి హైదరాబాద్‌కు తన ప్రియుడు చంద్రకాంత్, ఇతరు నటులతో కలిసి కారులో వస్తున్నారు.
నెగిటివ్ పాత్రతో ఫేమస్
ఈ క్రమంలో మహబూబ్ నగర్ భత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శెరిపల్లి గ్రామం జాతీయ రహదారి సమీపంలో వారి కారు అదుపుతప్పింది. దీంతో డివైర్ ఢీకొన్న కారు హైదరాబాద్ నుంచి వనపర్తి వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో పవిత్ర జయరాం అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె ప్రియుడు చంద్రకాంత్, డ్రైవర్, బంధువు ఆపేక్షకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. కాగా పవిత్ర జయరాం 'త్రినయని' సీరియల్‌తో పాపులారిటి సంపాదించుకున్నారు. ఇందులో తిలోత్తమగా నెగిటివ్ షేడ్స్‌తో అలరిస్తున్నారు. పవిత్ర మృతితో బుల్లితెర ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె హఠాన్మరణంతో బుల్లితెర నటీనటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ప్రియుడి భావోద్వేగం
ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ సంతాపం తెలుపుతున్నారు. ఇక పవిత్ర మరణంపై ఆమె ప్రియుడు చంద్రకాంత్ అయితే ఎమోషనల్ అయ్యాడు. ప్లీజ్ తిరిగి రా.. ఇలా నన్ను మధ్యలో విడిచి వెళ్లిపోయావంటూ కన్నీటిపర్యంతరం అవుతున్నట్టు సన్నిహిత వర్గాలు అంటున్నాయి. కాగా పవిత్ర జయరాం 'త్రినయని' సీరియల్‌తో పాపులారిటి సంపాదించుకున్నారు. ఇందులో తిలోత్తమగా నెగిటివ్ షేడ్స్‌తో అలరిస్తున్నారు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన పవిత్ర జయరాం నిన్నే పెళ్లాడతా అనే సీరియల్‍తో తెలుగులోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారం అవుతున్న త్రినయని సీరియల్‌లో నటిస్తున్నారు.
జీ తెలుగు నివాళి
పవిత్ర జయరాం మృతి జీ కుటుంబానికి తీరని లోటు అంటూ సదరు సంస్థ సోషల్ మీడియా వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. "తిలోత్తమగా ఇంకెవరినీ ఊహించుకోలేం. పవిత్ర జయరాం మరణం జీ తెలుగు కుటుంబానికి తీరని లోటు" అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేసింది జీ తెలుగు. ఈ సందర్భంగా ఆమె మరణానికి నివాళులు అర్పించింది జీ తెలుగు.
జీ తెలుగులో టాప్ రేటింగ్‌తో దూసుకుపోతున్న ఈ సీరియల్లో ఆమె తిలోత్తమగా మెయిన్ విలన్ రోల్ పోషిస్తున్నారు. తనదైన నటనతో బుల్లితెర ఆడియెన్స్‌ని ఆకట్టుకున్నారు. నెగిటివ్ షేడ్స్‌లో తిలోత్తమ పాత్రకు పూర్తి న్యాయం చేస్తున్న ఆమె బుల్లితెరపై ఫుల్ ఫేమస్ అయ్యారు.కర్ణాకటలో మండ్యా ప్రాంతానికి చెందిన పవిత్ర జయరాం కన్నడ టీవీ సీరియల్స్‌తో ఇండస్ట్రీలో తెరంగేట్రం చేశారు. జోకలి అనే సీరియల్‍తో నటిగా మారిన ఆమె రోబో ఫ్యామిలీ, విద్యావినాయక, గాలిపటా, రాధారామన్ వంటి పలు సీరియల్స్‌లో నటించారు. ఆ తర్వాత తెలుగులో నిన్నే పెళ్లడతా సీరియల్‌తో ఎంట్రీ ఇచ్చారు.