Anchor Ravi About Bigg Boss: బుల్లితెరపై ఉన్న మోస్ట్ వాంటెడ్ మేల్ యాంకర్స్‌లో రవి కూడా ఒకరు. తనకంటూ ఒక సెపరేట్ స్టైల్‌తో బుల్లితెరపై ఒక మార్క్‌ను క్రియేట్ చేసుకున్నాడు రవి. తాజాగా ఒక షోకు గెస్ట్‌గా వెళ్లిన రవి.. అసలు తన కెరీర్ ఎలా ప్రారంభమయ్యింది లాంటి ప్రొఫెషనల్ విషయాలతో పాటు పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకున్నాడు. అంతే కాకుండా తను యాంకర్‌గా ఒక రేంజ్ క్రేజ్‌ను చూసిన తర్వాత బిగ్ బాస్‌లోకి కంటెస్టెంట్‌గా కూడా వెళ్లాడు. ఈ షోలో బిగ్ బాస్ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు రవి.
పదేపదే అడిగారు..
ముందుగా తన బిగ్ బాస్ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు రవి. ‘‘నేనెప్పుడూ బిగ్ బాస్ ఫ్యాన్ కాదు. హిందీలో బిగ్ బాస్ 1,2 సీజన్స్ చూశాను కానీ ఎక్కువగా ఫాలో అయ్యేవాడిని కాదు. మా టీవీలోనే పెరిగాను కాబట్టి వాళ్లెప్పుడూ నన్ను బిగ్ బాస్‌లో చేయొచ్చు కదా బాగుంటుంది అని అడిగేవాళ్లు. సీజన్ 1 నుంచి పోస్ట్‌పోన్ చేస్తూ వచ్చాను. అలా సీజన్ 4 బ్లాక్‌బస్టర్ అయ్యింది. అప్పుడే వాళ్లు నన్ను రమ్మన్నారు. అది టాప్‌లో ఉంది కాబట్టి నీకు హెల్ప్ అవుతుంది, మాకు హెల్ప్ అవుతుంది అన్నారు. మా టీవీలో కొందరిని నేను చాలా గౌరవిస్తాను, వాళ్లు ఏం చెప్పినా బ్లైండ్‌గా ఫాలో అయిపోతాను. అందుకే అప్పుడు సరే అన్నాను’’ అంటూ అసలు బిగ్ బాస్‌కు ఎందుకు ఒప్పుకున్నాడో బయటపెట్టాడు రవి.
బిగ్ బాస్ అంటేనే స్ట్రెస్..
బిగ్ బాస్‌లో ఉన్నప్పుడు తన తోటి కంటెస్టెంట్స్‌తో అయిన గొడవలపై రవి స్పందించాడు. ‘‘బిగ్ బాస్‌లో జరిగింది చూసి ఎవరినీ జడ్జ్ చేయొద్దు. అలాగే చాలామంది జీవితాలు నాశనం అయ్యాయి. బిగ్ బాస్‌లో నీకు ఒక్క స్టోరీ మాత్రమే చూపిస్తాడు. దానివల్ల అందరూ నిన్ను జడ్జ్ చేస్తారు. హౌజ్‌లోకి వెళ్లి 15 రోజుల తర్వాత నా కూతురు మొహం ఎలా ఉంటుందో మర్చిపోయాను. అంత స్ట్రెస్ ఉంటుంది. హౌజ్‌లో ఉన్నప్పుడు నా బర్త్‌డేకు ఇంటి నుంచి వీడియో రాలేదని ఫీల్ అవుతుంటే ప్రియాంక వచ్చి నువ్వు లహరితో క్లోజ్ ఉండడం వల్లే నిత్య ఫీల్ అయ్యిందేమో అని చెప్పగానే నిజమేనేమో అనిపించింది. అందుకే ఇక్కడ చాలామంది సింగిల్ బాయ్స్ ఉన్నారు, నాకు పెళ్లయ్యింది, లహరి నాతో ఎందుకు ఉంటుంది అని తెలియక అనేశాను. అది నామినేషన్స్ సమయంలో ప్రియాంక బయటికి తీయగానే ప్రేక్షకులకు వేరే విధంగా అర్థమయ్యింది’’ అని వివరణ ఇచ్చాడు రవి.
నేను చాలా కమర్షియల్..
రవి ఎప్పుడూ అమ్మాయిలు ఉంటేనే యాంకరింగ్ చేస్తాడంటూ తనపై చాలా విమర్శలు వచ్చాయి. దానిపై తాను స్పందిస్తూ ‘‘కావాలంటే చేయను అని చెప్పేయవచ్చు. కానీ స్క్రీన్ పై గ్లామర్ ఉంటేనే కొందరు చూస్తారు’’ అని బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. తను పక్కా కమర్షియల్ అని, తన టాలెంట్‌ను ఫ్రీగా ఎందుకు చూపించుకోవాలంటూ ప్రశ్నించాడు రవి. ‘సమ్‌థింగ్ స్పెషల్’ షో వల్ల తనకు అంత ఫేమ్ రావడం వల్ల అప్పుడు తనకు పెళ్లయిన విషయాన్ని దాచిపెట్టానని, ఆ విషయం బయటపడితే ప్రేక్షకులు తనను ఆదరించరేమోనని భయపడ్డానని తెలిపాడు రవి. అలా చేసినప్పుడు తన భార్య నిత్య తనను చాలా అర్థం చేసుకుందని సంతోషం వ్యక్తం చేశాడు.
Also Read: హిందీ ప్రేక్షకులను హర్ట్ చేసిన ‘ఆవేశం’ - కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్న డైలాగ్