Zara Hatke Zara Bachke OTT Release and Streaming Details: ఎట్టకేలకు బ్లాక్‌బస్టర్‌ చిత్రం'జర హట్కే జర బచ్కే' ఓటీటీ రిలీజ్‌ సిద్ధమైంది. దాదాపు ఏడాది తర్వాత ఈ సినిమా డిజిటల్‌ వేదికపైకి రానుండటంతో ఆడియన్స్‌ ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్‌, సారా అలీ ఖాన్‌ జంటగా నటించిన చిత్రం 'జర హట్కే జర బచ్కే'(Zara Hatke Zara Bachke). రొమాంటిక్‌ అండ్‌ కామెడీ డ్రామా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టింది.


గతేడాది జూన్‌ 2న విడుదలైన ఈ చిత్రం రూ. 100 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లు. ఇందులోని 'తేరే వాస్తే ఫలక్ సే మై చాంద్ లావూంగా' సాంగ్‌ ఎంతటి సెన్సేషన్ క్రియేట్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మ్యూజిక్‌ పరంగా మంచి విజయం సాధించిన ఈ సినిమా బాక్సాఫీసు మంచి విజయం సాధించింది.  అయితే ఈ మూవీ వచ్చి దాదాపు ఏడాది అవుతున్న ఇప్పటి వరకు ఓటీటీలో రిలీజ్‌ కాలేదు. ఈ దీంతో మూవీ లవర్స్‌ అంతా ఆ సినిమా డిజిటల్‌ ప్రీమియర్‌కి సిద్ధమైంది. ఈ క్రమంలో తాజాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ను ఫిక్స్‌ చేసుకుంది. దాదాపు ఏడాది తర్వాత ఈ సినిమా స్ట్రీమింగ్‌ వస్తుండటంతో డిజిటల్ ప్రియులంతా ఫుల్‌ ఖుష్‌ అవుతున్నాయి.






అయితే ఓటీటీలో ఈ చిత్రం పాన్‌ ఇండియాగా రిలీజ్‌ అవుతుంది. ఒక్క హిందీలోనే కాదు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాళి, మరాఠీ భాషలో స్ట్రీమింగ్‌ కానుంది. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ జీయో సినిమా ఫ్యాన్సీ డీల్‌కు సొంతం చేసుకున్నట్టు సమాచారం. దీంతో ఇప్పుడు ఈ సినిమాను డిజిటల్‌ ప్రీమియర్‌కి ఇవ్వబోతుంది. మే 17వ తేదీ నుంచి ఈ సినిమా జియో సినిమాలో అందుబాటులోకి రానుంది. థియేటర్లో విడుదలైన  11 నెలల తర్వాత ఇప్పుడు ఈ సినిమా డిజిటల్‌ ప్లాట్‌ఫాంకి రానుండటంతో ఆడియన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


సుమారు రూ. 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకున్న వసూళ్లు విజయం సర్‌ప్రైజ్‌ చేసింది. థియేట్రికల్‌ రన్‌లో దాదాపు రూ. 115 కోట్ల గ్రాస్‌ వసూళ్లు చేసింది. బాలీవుడ్‌ డైరెక్టర్‌ లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మాడ్‍డాక్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్ పతాకాలపై జ్యోతీ దేశ్‍పాండే, దినేశ్ విజన్ నిర్మించారు. విక్కీ కౌశల్‌, సారా అలీ ఖాన్‌ హీరోయిన్లుగా నటించగా సుష్మిత ముఖర్జీ, ఇనాముల్‍ హక్, ఆకాశ్ ఖురానా, నీరజ్ సూద్, రాకేశ్ బేడీ, షారిబ్ హష్మి,  కీలక పాత్రలు పోషించారు. మైత్రే బాజ్‍పేయి, రమీజ్ ఇలాం ఖాన్ కథ అందించిన ఈ సినిమాకు చిన్ - జిగార్ సంగీతం అందించారు. సందీప్ శిరోద్కర్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు.