మాచర్ల పోలింగ్ దాడులు లెక్కలేనన్ని


ఆంధ్రప్రదేశ్ లోని మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అక్కడ పోలింగ్ రోజు జరిగిన  ఘర్షణలు.. ఆ తర్వాత వరుసగా మూడు రోజుల పాటు అల్లర్లు చెలరేగడం.. అదే సమయంలో ఆలస్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో వెలుగులోకి రావడంతో  మాచర్ల పరిస్థితి హైవోల్టేజ్ కు చేరుకుంది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రెండు పార్టీల నేతలు వీడియోలు విడుదల చేస్తున్నారు. మీరు రిగ్గింగ్ చేశారంటే.. మీరు రిగ్గింగ్ చేశారని ఆరోపణలు చేస్తున్నారు. ఇంకా చదవండి


టీడీపీ 'చలో మాచర్ల' పిలుపుతో ఉద్రిక్తత


టీడీపీ 'చలో మాచర్ల' (Chalo Macharla) పిలుపుతో మాచర్లలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నెల 13న పోలింగ్ సందర్భంగా జరిగిన దాడుల్లో బాధితులను పరామర్శించేందుకు టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. అయితే, ఈ కార్యక్రమానికి అనుమతి లేదని స్పష్టం చేసిన జిల్లా ఎస్పీ మల్లికాగార్గ్.. ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. టీడీపీ నేతలను మాచర్ల వెళ్లకుండా అడ్డుకున్నారు. గుంటూరులో నక్కా ఆనంద్, కనపర్తి శ్రీనివాస్ ఇళ్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అటు, గొల్లపూడిలో దేవినేని ఉమ, విజయవాడలో వర్ల రామయ్యను సైతం హౌస్ అరెస్ట్ చేశారు. పోలింగ్ మరుసటి రోజు నుంచే మాచర్ల టీడీపీ ఇంఛార్జీ జూలంకటి బ్రహ్మరెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచారు. ఇంకా చదవండి


జూన్ 4 తర్వతా బీఆర్ఎస్ ఉండదు - కోమటిరెడ్డి


పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్  భూ స్తాపితం అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు. హైదరాబాద ్లో మీడియాతో మాట్లాడిన ఆయన  కవిత జైలు కు వెళ్లిందని , తమ ప్రభుత్వం పోయిందనే ఫ్రస్టేషన్ లో కేటీఆర్ ఉన్నారని విమర్శించారు.  సీఎం రేవంత్ రెడ్డి పై కేటీఆర్ మాటలు అసహ్యం గా ఉన్నాయని..  మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించినందుకు,30 వేల ఉధ్యోగ నియామకాలు చేపట్టినందుకా రేవంత్ రెడ్డి ని కేటీఆర్ తిడుతున్నాడా అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. ఇంకా చదవండి


 


జూన్ 2న కేసీఆర్‌కు తెలంగాణ సర్కార్ సన్మానం


మాజీ సీఎం కేసీఆర్ ను ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సన్మానిస్తే ఎలా ఉంటుంది ?. ఉహించుకోవడానికి బాగానే ఉంటుంది కానీ అది సాధ్యమా అంటే.. కేసీఆర్ అంగీకరిస్తే సాధ్యమయ్యే అవకాశాలు ఉంటాయి. తెలంగాణ సాధనలో అత్యంత కీలక వ్యక్తిగా కేసీఆర్ ను గుర్తించి సన్మానించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉంది. రాష్ట్రం ఏర్పడిన పదేండ్లకు కాంగ్రెస్ పార్టీకి అవకాశం రావడంతో తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ఘనంగా సన్మానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంకా చదవండి


వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఎక్కడ?


ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. బుధవారం ఆయన్ను తెలంగాణలో అరెస్ట్ చేసినట్లు వార్తలు రాగా.. సంగారెడ్డి ఎస్పీ అవి అవాస్తవమని ఖండించారు. ఈవీఎం ధ్వంసం తర్వాత ఆయన పక్కా ప్లాన్‌తోనే పరారైనట్లు పోలీసులు నిర్థారణకు వచ్చినట్లు తెలుస్తోంది. పోలింగ్ రోజు తన నియోజకవర్గంలోని పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన పిన్నెల్లి.. ఆ తర్వాత తన సోదరుడితో కలిసి హైదరాబాద్ చేరుకున్నట్లు సమాచారం. ఇంకా చదవండి