Aishwarya Rai Cannes 2024: ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టిల్స్ లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఓ ప్రత్యేకత ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ తారలు, మోడళ్లు, డిజైనర్లు ఈ వేడుకలో పాల్గొంటారు. రెడ్ కార్పెట్ పై హొయలు పోతుంటారు. భారత్ నుంచి కూడా పలువురు నటీనటులు పాల్గొన్నారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా బాలీవుడ్ స్టార్  హీరోయిన్ ఐశ్వర్య రాయ్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్నది. ట్రెండీ కాస్ట్యూమ్స్‌ తో ఈ వేడుకకు కొత్త కళ తెచ్చింది. రెడ్ కార్పెట్ మీద ఈ అందాల తార నడుస్తుంటే అందరి కళ్లు ఆమె మీదే ఫోకస్ అయ్యాయి.


చేతికి కట్టుతో రెడ్‌ కార్పెట్‌పై ఐశ్వర్య


కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ మీద నడుస్తూ ఐశ్వర్య కనువిందు చేసింది. ఫోటోలకు పోజులిచ్చింది. అయితే, ఆమె చేతికి కట్టు ఉండటం చూసి అందరూ షాక్ అయ్యారు. ఆమెకు ఏమైందోనని ఆందోళన చెందారు. ఆమె చేతికి ఎందుకు గాయం అయ్యిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు నెటిజన్లు. మరికొంత మంది గాయం అయినప్పుడు ఈ వేడుకలో పాల్గొనడం అవసరమా? అనే కామెంట్స్ కూడా చేశారు. కానీ, ఎవరి మాటలు పట్టించుకోకుండా ఆమె ఫ్రాన్స్ లో జరిగిన క్రేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్నది.


గాయం అయినా ఫిల్మ్ ఫెస్టివల్ లో ఎందుకు పాల్గొన్నదంటే?


ఫ్రాన్స్ లో ప్రతి ఏటా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుంది. ఈ ఏడాది గాయం అయినా, ఆమె ఈ వేడుకల్లో పాల్గొనడానికి ఓ కారణం ఉంది. మాజీ విశ్వసుందరి అయిన ఐశ్వర్య రాయ్.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ శాశ్వత సభ్యురాలిగా కొనసాగుతోంది. 2022లో తొలిసారి ఐశ్వర్యను కేన్స్ చలన చిత్రోత్సవాలకు ఇన్వైట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేన్స్ రెడ్ కార్పెట్ మీద సందడి చేసింది. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ గాయం ఉన్నప్పటికీ ఈ వేడుకలో పాల్గొన్నది. ట్రెండీ డ్రెస్ లో రెడ్ కార్పెట్ మీద నడుస్తూ అందరికీ ఆకట్టుకుంది. తన కూతురు ఆరాధ్య బచ్చన్ తో కలిసి ఆమె ఈ వేడుకలో పాల్గొన్నది.






ఇంతకీ ఆమె చేతికి గాయం ఎందుకు అయ్యిందంటే?


కొద్ది రోజుల క్రితం ఐశ్వర్య ముంబైలోని తన నివాసంలో కిందపడింది. ఈ నేపథ్యంలో ఆమె మణికట్టుకు గాయం అయ్యింది. డాక్టర్లు ఆపరేషన్ చేయాలని భావించారు. అయితే, చేతివాపు తగ్గిన తర్వాత శస్త్రచికిత్స చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఫిజియోథెరపీ చేయించుకుంటుంది. సుమారు నెల రోజులుగా ఆమె ట్రీట్మెంట్ తీసుకుటుంది. ఇక ఐశ్వర్య సినిమాల విషయానికి వస్తే, ఆమె చివరగా ‘పొన్నియిన్ సెల్వన్ 2‘లో కనిపించింది. మణిరత్నం ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఐశ్వర్యతో పాటు మరో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ పాల్గొన్నది.


Read Also: డబ్బు కోసం దొంగతనం చేశా, వెళ్లి అద్దంలో ముఖం చూసుకోమని హేళన చేశారు, కష్టాలు తలచుకొని కంటతడి పెట్టిన బిగ్ బాస్ కీర్తి భట్