Telangana Formation Day News : మాజీ సీఎం కేసీఆర్ ను ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సన్మానిస్తే ఎలా ఉంటుంది ?. ఉహించుకోవడానికి బాగానే ఉంటుంది కానీ అది సాధ్యమా అంటే.. కేసీఆర్ అంగీకరిస్తే సాధ్యమయ్యే అవకాశాలు ఉంటాయి. తెలంగాణ సాధనలో అత్యంత కీలక వ్యక్తిగా కేసీఆర్ ను గుర్తించి సన్మానించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉంది. రాష్ట్రం ఏర్పడిన పదేండ్లకు కాంగ్రెస్ పార్టీకి అవకాశం రావడంతో తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ఘనంగా సన్మానించాలని ప్రభుత్వం నిర్ణంచింది. వేలాదిమంది ఉద్యమించినా, ప్రధాన ఉద్యమకారుడిగా, తెలంగాణ తెచ్చిన గొప్ప నాయకుడిగా, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్  కాబట్టి   సోనియాతోపాటు కేసీఆర్ ను కూడా ఘనంగా సన్మానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు  ఆయనకు ఆహ్వానం పంపాలని నిర్ణియంచుకున్నట్లుగా తెలుస్తోంది.  


జూన్ 2న భారీ వేడుకలు నిర్వహిస్తున్న ప్రభుత్వం         


జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం రేవంత్ సర్కారుకు ప్రభుత్వపరంగా తొలి వేడుక నిర్వహించనున్నారు.  ధూమ్ ధామ్ గా  వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అవతరణ దినోత్సవాన్ని పరేడ్ గ్రౌండ్ లో పదివేలమందితో ఘనంటా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లుచేయనుంది. జయ జయహే గీతాన్ని కూడా అదే రోజున ఆవిష్కరించనుంది. తెలంగాణ ఉద్యమకారుల్ని గౌరవించేందుకు రేవంత్ సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ ఇచ్చింది సోనియానే అన్న భావన కల్పించేందుకు కాంగ్రెస్ సర్కార్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తోంది. 


సన్మానానికి కేసీఆర్ అంగీకరిస్తారా ?                       


బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించారు. తొలి రెండు, మూడేళ్లు అత్యంత ఘనంగా నిర్వహించారు. తర్వాత సాధారణంగా నిర్వహించారు. ప్రతీ సారి తెలంగాణ అమరవీరుల్ని గౌరవించుకోవడం కామన్ గా వస్తోంది. తెలంగాణ ఇచ్చింది తామేనని చెబుతున్న కాంగ్రెస్ కు వేడుకలు నిర్వహించే అవకాశం తొలి సారి వచ్చింది. అందుకే భారీగా నిర్వహిస్తోంది. అయితే కేసీఆర్ ను బీఆర్ఎస్ నేతలు తెలంగాణ బాపుగా అభివర్ణిస్తారు. అలాంటిది ఆయన కూడా ఓ కారణం అన్నట్లుగా చూపి సన్మానం చేస్తానంటే అంగీకరించే పరిస్థితి ఉండదని.. అలా చేయడం కేసీఆర్ ను అవమానించడమే అన్న అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంది. 


అధికారికంగా కేసీఆర్‌కు ఆహ్వానం పంపనున్న  ప్రభుత్వం                                         


తెలంగాణ ప్రభుత్వం నుంచి కేసీఆర్ కు అధికారికంగా ఆహ్వానం పంపిన తర్వాత .. బీఆర్ఎస్ నేతల స్పందన ఏమిటో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.   ప్రభుత్వ పరంగా నన్మానం చేసినా అది కేసీఆర్ ను అవమానమేనని భావిస్తే ఆయన హాజరయ్యే అవకాశాలు ఉండవు. రేవంత్ మానసికంగా కేసీఆర్ ను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తన్నారని ఆరోపణలు చేసే అవకాశం ఉంది.