Morning Top News:


ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్


ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ తరువాత లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. గృహనిర్మాణ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి  గురువారం తన ఛాంబర్‌లో అంతర్గత సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల యాప్‌ సర్వే 74 శాతం పూర్తయిందన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


'మహిళా ఉపాధ్యాయ దినోత్సవం'గా పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సావిత్రిబాయి ఫూలే జయంతి అయిన జనవరి 3ను మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. సావిత్రి బాయి పూలే ఆశయాల సాధనకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఫూలే దంపతుల సేవలు, త్యాగాలను గుర్తు చేసుకున్నారు. భారత సమాజంలో చారిత్రాత్మకమైన మార్పుకు సావిత్రీబాయి ఫూలే పునాది వేశారని కొనియాడారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

రూ. కోటి అడిగినా ఇస్తా కానీ.. పుస్తకం ఇవ్వను: పవన్

తాను ఎవరికైనా రూ.కోటి ఇచ్చేందుకు వెనుకాడనని.. కానీ తన వద్ద ఉన్న పుస్తకం ఇచ్చేందుకు మాత్రం ఆలోచిస్తానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఇందిరాగాంధీ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన 35వ పుస్తక మహోత్సవాన్ని ఆయన ప్రారంభించారు. తనకు జీవితంలో నిలబడే ధైర్యం ఇచ్చింది. పుస్తకాలేనని పవన్ అన్నారు. పుస్తక పఠనం లేకుంటే తాను జీవితంలో ఏమయ్యేవాడినో అనిపిస్తుందని అన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

ప్రతి రైతుకు "రైతు భరోసా" 

తెలంగాణ రైతులకు రేవంత్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పంట సాగు చేసే ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై గురువారం కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. ఈ నెల 4న జరిగే కేబినెట్ భేటీలో ఈ పథకం అమలు, మార్గదర్శకాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. జనవరి 5 నుంచి 7 వరకూ దరఖాస్తులు తీసుకునే అవకాశం ఉంది. సంక్రాంతి తర్వాత రైతు భరోసా చెల్లించే అవకాశం ఉంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

బోరుగడ్డ ను క్షమించగలమా..?

హైకోర్టులో వైసీపీ సోషల్ మీడియా నేత, రౌడీషీటర్‌ బోరుగడ్డ అనిల్‌‌కు షాక్ తగిలింది. ఆయన బెయిల్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. నిందితుడు సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా? అని వ్యాఖ్యానించింది. ఇలాంటి వారిని క్షమించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ కుటుంబంపై అసభ్యకర పోస్టులు చేసిన బోరుగడ్డ అనిల్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

ప్రేమంటూ పాక్ కు వెళ్లి జైలు పాలయ్యాడు

ఫేస్ బుక్ పరిచయం ప్రేమగా మారింది. అక్రమంగా పాక్‌లోకి ప్రవేశించిన భారత యువకున్ని కష్టాల్లోకి నెట్టింది. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లా ఖిత్కారి గ్రామానికి చెందిన బాదల్ బాబు అనే యువకుడికి ఫేస్‌బుక్‌లో పాక్ కు  చెందిన సనారాణితో పరిచయం ఏర్పడింది. ఆమెను పెళ్లి చేసుకునేందుకు పాక్ వెళ్లాడు. కానీ పెళ్లికి ఆమె నిరాకరించింది. మరోవైపు బాదల్ బాబుని  డిసెంబర్ 28న  అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 


మనిషి ప్రాణాలు కాపాడిన స్పీడ్ బ్రేకర్

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఓ స్పీడ్ బ్రేకర్ వృద్ధుడి ప్రాణాలు కాపాడింది. 65 ఏళ్ల వ్యక్తికి గుండెపోటు రాగా ఆస్పత్రికి తీసుకెళ్తే మరణించాడని వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని అంబులెన్సులో తీసుకొస్తుండగా స్పీడ్ బ్రేకర్ వల్ల వాహనం ఓ చోట కుదుపునకు గురి కాగా.. అతని శరీరంలో కదలికలు వచ్చి మళ్లీ బతికాడు. దీంతో స్పీడ్ బ్రేకర్ వల్ల పాండురంగ్ ప్రాణాలతో బయటపడ్డాడు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

 

చైనాలో కరోనా.. ప్రపంచంలో ఆందోళన

ప్రపంచ దేశాలను వణికించిన కరోనా మహమ్మారి.. మళ్లీ పంజా విసురుతుందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. చైనాలో హ్యూమన్ మెటాప్‌న్యూమో వైరస్ ఇన్‌ఫెక్షన్లు పెరుగుతుండడం.. దేశాలను ఆందోళన పరుస్తోంది. 14 ఏళ్లలోపు వారిలో ఈ వైరస్ వ్యాప్తిని గుర్తించారు. శీతాకాలంలో సాధారణంగానే శ్వాసకోశ వ్యాధులు గణనీయంగా పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో వైరస్ వ్యాప్తి వేరే దేశాలకు పాకుతుందన్న ఆందోళన పెరుగుతోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

రామ్‌చరణ్‌కు రాజమౌళి కండిషన్

తాను రామ్ చరణ్ హీరోగా 'మగధీర' సినిమా చేశానని... అప్పటికీ, ఇప్పటికీ అతని నటనలో ఎంతో పరిణితి కనిపించిందని దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అన్నారు.హెలికాప్టర్ నుంచి కత్తి పట్టుకుని లుంగీలో దిగే సన్నివేశానికి థియేటర్లలో విజిల్స్ పెడతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు.  ''చరణ్, నెక్స్ట్ నుంచి నువ్వు హార్స్ రైడింగ్ సీన్స్ చేసేటప్పుడు నా పర్మిషన్ తీసుకో. అవి నా విజువల్స్. నాకు రైట్స్ రాసి ఇచ్చేయ్. అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.‌ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


 

పతకం వచ్చిన 52 ఏళ్ల తర్వాత అర్జున అవార్డు

భారత పారా అథ్లెట్ మరళికాంత్ రాజారాం పెట్కార్ కు ఎట్టకేలకు తన ప్రతిభకు తగిన గుర్తింపు లభించింది. 1972 జర్మనీలో జరిగిన పారాలింపిక్స్ లో బంగారు పతకం గెలుపొందిన దాదాపు 52 సంవత్సరాల తర్వాత రాజారాంకు  అర్జున అవార్డు (లైఫ్ టైం ఎచీవ్మెంట్)ను ప్రకటించారు. ఇండియన్ ఆర్మీలో పని చేసిన మురళీ కాంత్..1965 పాకిస్థాన్  యుద్ధంలో తీవ్రంగా గాయపడి, ఆర్మీ నుంచి రిటైర్ అయి పారా అథ్లెట్ గా మారారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..