Morning Top News:
తిరుమలలో తొక్కిసలాట..ఆరుగురు మృతి,
తిరుపతిలో వైకుంఠద్వార సర్వ దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు కన్నుమూశారు. 30మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. తొక్కిసలాటలో స్పృహ తప్పిపడిపోయిన వారిని బతికించేందుకు బంధువులు చేసిన ప్రయత్నాలు కంటతడి పెట్టించాయి కోట్లాది మంది తమ జీవిత కాలంలో ఒక్క అవకాశం కోసం ఆరాట పడే వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ ప్రకటనతో భక్తులు తిరుపతికి పోటెత్తడంతో ఈ తొక్కిసలాట జరిగింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
తిరుపతి ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి
తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆరుగురు భక్తుల మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందన్న చంద్రబాబు.. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. ఈ దుర్ఘటనలో 48 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. టోకెన్ల కోసం భక్తులు అధిక సంఖ్యలో వస్తారని తెలిసినా.. తగిన ఏర్పాట్లు ఎందుకు చేయలేదని అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
తిరుపతి భక్తుల మృతిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన
తిరుపతి తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. భగవంతుని దర్శనానికి వచ్చి ఆరుగురు భక్తులు మృతి చెందడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.క్షతగాత్రులకు సత్వరమే మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య శాఖకు సూచించారు.తిరుపతి నగరంలోని టికెట్ కౌంటర్ల దగ్గర క్యూలైన్ల నిర్వహణలో అధికారులు, పోలీస్ సిబ్బందికి జనసేన నాయకులతో పాటు జనసైనికులు తోడ్పాటు అందించాలని సూచించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
తిరుమల బాధితులను పరామర్శించిన టీటీడీ ఛైర్మన్
తిరుమల తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందడం వెనుక ఓ పోలీసు అధికారి చర్యలే కారణమని తెలుస్తోంది. టోకెన్ల కోసం బైరాగిపట్టెడ వద్ద పద్మావతి పార్కులో భక్తులను ఉంచారు. అయితే, టోకెన్ల జారీ కేంద్రంలో సిబ్బంది ఒకరు అస్వస్థత గురికావడంతో ఆసుపత్రికి తరలించేందుకు ఆ పోలీసు అధికారి క్యూలైన్ తెరిచారు. టోకెన్లు జారీ చేసేందుకు తెరిచారని భావించిన భక్తులు ఒక్కసారిగా ముందుకు దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ఆస్పత్రుల్లో క్షతగాత్రులను పరామర్శించిన ఆయన.. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందని అన్నారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
తిరుపతి విషాదంపై విచారణ చేయాలన్న బీజేపీ
తిరుపతి తొక్కిసలాట ఘటనలో భక్తుల మృతిపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయాలైన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. తిరుమల తిరుపతి చరిత్రలో ఇటువంటి దుర్ఘటన ఎప్పుడూ జరగలేదన్నారు. ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అందరిపైనా పాలక మండలి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మోదీ శంకుస్థాపనలు చేసిన ప్రాజెక్టులు ఇవే
విశాఖ వేదికగా జరిగిన భారీ బహిరంగ సభలో కీలక ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. విశాఖ రైల్వేజోన్ ప్రధాన కేంద్రానికి మోదీ మొదట శంకుస్థాపన చేశారు. గ్రీన్ హైడ్రోజన్ హబ్.. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్‌కు శిలాఫలకం వేశారు. కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోడ్, గుంటూరు-బీబీనగర్ లైన్ల డబ్లింగ్ పనులను కూడా విశాఖ వేదిక నుంచి ప్రారంభించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ప్రజలు మనసు గెలిచిన నేత మోదీ: పవన్
ఎన్డీయే ప్రభుత్వం రావాలని ప్రజలు బలంగా కోరుకున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. బలమైన భారత్ కోసం మోదీ కృషి చేస్తున్నారని ప్రజల మనసు గెలుచుకున్న నాయకుడు మోదీ అని కొనియాడారు. అభివృద్ధి అంటే ఆంధ్ర అని కొనియాడారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకంతో 2 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చామని పేర్కొన్నారు. మోదీ రాకతో 7.5 లక్షల ఉపాధి అవకాశాలు వస్తున్నాయన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్స్
తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోన్న అభ్యర్ధులకు టీజీపీఎస్సీ శుభవార్త అందించింది. మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. దాంతో పాటు మార్చి 31లోగా ఉద్యోగ ఖాళీల వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని చెప్పింది. త్వరలోనే గ్రూప్ - 1,2,3 ఫలితాలు కూడా విడుదల చేస్తామని చెప్పింది.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
'గేమ్ ఛేంజర్'కి తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్
‘గేమ్ ఛేంజర్’ మూవీకి తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉదయం 4 గంటల షోతో పాటు ఆరు ఆటలకు అనుమతిస్తూ.. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.150 చొప్పున పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఈనెల 11 నుంచి 19వ తేదీ వరకు 5 షోలకు అనుమతిస్తూ సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50, మల్టీప్లెక్స్‌లో రూ.100 చొప్పున పెంచుకోవచ్చని పేర్కొంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
తెలంగాణకు కింగ్ ఫిషర్ బీర్లు బంద్!
మందుబాబులకు ఇది షాకింగ్ వార్త.. తెలంగాణకు కింగ్ ఫిషర్ బీర్ల సరాఫరా నిలిచిపోనుంది. తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ బకాయిలు చెల్లించకపోవడంతో బీర్ల సరఫరాను నిలిపివేస్తున్నట్లు యునైటెడ్ బ్రేవరీస్ ప్రకటించింది. 2019 నుంచి రేట్లను పెంచకపోవడంతో భారీ నష్టాలు వస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీనిపై అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరగనుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..