Vizag Modi Tour :  దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నాయకుడు మోదీ అని పవన్ కల్యాణ్ అన్నారు. మోదీ పర్యటనలో భాగంగా విశాఖలో జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు. ధైర్య సాహసాలతో నింపితే అది పటిష్ట భారత్‌గా మారుతుందని.. సదాశయంతో కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు నడిస్తే..అది స్వచ్ఛ భారత్‌ అవుతుందని పవన్ ఆకాంక్షించారు.  తెలుగు ప్రజలను అభివృద్ధి పథంలో.. నడిపిస్తున్న దార్శనికులు చంద్రబాబు అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రావాలని ప్రజలు బలంగా కోరుకున్నారని.. భారత్‌ను గొప్ప దేశంగా మార్చేందుకు మోదీ కృషి చేస్తున్నారని ప్రసంగించారు.  ఎన్డీఏ ప్రభుత్వం రావాలని ప్రజలు బలంగా కోరుకున్నారు... మోదీ రాకతో ఏపీకి రూ.2.1 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయన్నారు. మోదీ రాకతో 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తున్నాయని.. ప్రజల మనసు గెలుచుకున్న నాయకుడు మోదీ అని పవన్ ప్రశంసించారు.  సదుద్దేశం, సదాశయం ఉంటే ఏదైనా సాధ్యమేనన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే మోదీ ఆశయమని..  గత ఐదేళ్లు అవినీతి, అరాచక పాలనతో ఏపీలో అంధకారం నెలకొందన్నారు.  అభివృద్ధి అంటే ఆంధ్రా అనేలా చంద్రబాబు కృషి అని.. రాష్ట్రంలో వెలుగులు నింపుతున్న మోదీకి అండగా ఉంటామని తెలిపారు. 


Also Read:  విశాఖలో ప్రధానమంత్రి మోదీ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు ఇవే- లోకేష్‌ నమో నమః స్పీచ్‌


అవినీతితో కూరుకుపోయి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక విలవిల్లాడుతున్న తరుణంలో మోదీ మా కోసం నిలబడ్డారని..  లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులతో మాకు అండగా నిలుస్తున్నందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు. 24 గంటలు తాగునీరు, మారుమూల గిరిజన గ్రామాలకు రోడ్లు వేయగలుగుతున్నామంటే అందుకు కారణం మోదీ గారు వెన్నుతట్టి మద్దతుగా నిలుస్తున్నారని పవన్ సంతృప్తి వ్యక్తంచేశారు. గత ఐదేళ్ల అవినీతి, అరాచక పాలనతో ఏపీ అంధకారంలో మునిగిపోయినప్పుడు...  ఆంధ్రాకు ఇక ఎలాంటి అవకాశమే లేదు అనుకున్న సమయంలో... ఇటువంటి స్థితి నుంచి అభివృద్ధి అంటే ఆంధ్రానే అనుకునేలా చంద్రబాబు నాయకత్వంతో ప్రధాని మోదీ నిర్దేశకత్వంలో వారి సూచనలు, సలహాలతో మా మంత్రి వర్గం, కార్యకర్తలు అభివృద్ధిలో భాగమవుతామని ప్రకటించారు.                      


ప్రజలు మాపై నమ్మకం పెట్టారు....ఆ నమ్మకం ఫలితమే ఇవాళ రూ.2 లక్షల కోట్లకు పైగా పను లు రాష్ట్రానికి వచ్చాయి. ఈ దేశాన్ని మరింత ప్రగతి పథంలో నడిపించేలా ప్రధాని మోదీకి ఆ లక్ష్మీనరసింహస్వామి దీర్ఘాయుష్షును ఇవ్వాలని కోరుకుంటున్నానన్నారు.  అంతకముందు సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్‌ వరకు రోడ్ షో నిర్వహించారు.  ఓపెన్ టాప్ వాహనం పైనుంచి ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పురందేశ్వరి ప్రజలకు అభివాదం చేసుకుంటూ వెళ్లారు. దారి పొడవునా ప్రజలు పూల వర్షం కురిపించారు. ప్రధాని మోడీ ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు.                 


Also Read:  మొదటి ఏడాది పరీక్షల్ని ఏపీ ఇంటర్ బోర్డు రద్దు చేసిందా ? - ఇదిగో అసలు నిజం