First year Inter exams have not been cancelled:   ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుందని సంస్కరణల్లో భాగంగా ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ తొలగించిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇంటర్ బోర్డు క్లారిటీ ఇచ్చింది. అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదని స్పష్టం చేసింది. ఇంటర్మిడియట్ బోర్డులో తీసుకు రావాల్సిన సంస్కరణల గురించి సూచనలు సూలహాలు ఇంటర్మిడియట్ బోర్డుకు ఇరవై ఆరో తేదీలోపు పంపవచ్చని సూచించింది.


 


ఇంటర్  బోర్డు కార్యదర్శి వ్యాఖ్యలతో నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం                  


అసలు ఈ ప్రచారం ఎక్కడి నుంచి ప్రారంభమయిందంటే..  ఇంటర్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా మీడియాతో మాట్లాడుతూ చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల ఇలాంటి ప్రచారం జరిగింది. ఇంటర్ విద్యలో సంస్కరణలు చేపడుతున్నామని. ఇంటర్ విద్యలో చాలా ఏళ్లుగా సంస్కరణలు జరగలేదన్నారు. ఈ క్రమంలో ఏపీలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేయాలని భావిస్తున్నామని చెప్పారు.  రెండో సంవత్సరం ఇంటర్ విద్యార్థులకు మాత్రమే బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహించే ఆలోచన ఉందన్నారు.             


ఇంకా సూచనలు సలహాలు తీసుకునే దశలోనే ఇంటర్ బోర్డు             


జాతీయ కరికులం చట్టాన్ని అనుసరించి ఇంటర్మీడియెట్ విద్యలో సంస్కరణలు చేపడతామని తెలిపారు. 2024-25 నుంచి పదోతరగతిలో ఎన్సీఈఆర్టీ టెక్ట్స్ బుక్స్ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.  విద్యావేత్తల నుంచి, ఇంటర్ విద్యార్ధుల తల్లిదండ్రుల నుంచి విలువైన సలహాలు, సూచనలను ఆహ్వానిస్తున్నాం. సైన్స్, ఆర్ట్స్, ల్యాంగ్వేజ్ సబ్జెక్టుల్లో సంస్కరణలు అమలు చేస్తామని కృతికా శుక్లా వెల్లడించారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకే ఫస్టియర్ ఎగ్జామ్స్  తొలగించాలనుకుంటున్నట్లుగా చెప్పారు. అయితే ఇంత వరకూ నిర్ణయం తీసుకోలేదు. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు అందరి సూచనలు ఆహ్వానిస్తున్నారు. ఇరవై ఆరో తేదీ వరకూ ఆహ్వానించి వచ్చిన సూచనలను బట్టి నిర్ణయం తీసుకుంటారు. అయితే  కృతికా శుక్లా చేసిన వ్యాఖ్యల వల్ల ముందుగానే మొదటి ఏడాది పరీక్షలు రద్దయిపోయినట్లుగా ప్రచారం అవుతోంది. 


26 వరకూ ఎవరైనా అభిప్రాయాలను పంపవచ్చు !                            


 ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిలబస్ ఇకపై తెలుగుతో పాటు ఇంగ్లీషులో ఉంటుంది. ఇంటర్ లో ప్రతి సబ్జెక్టుకు ఇక నుంచి 20 ఇంటర్నల్ మార్కులుంటాయి. ఈ నెల 26 వరకు  వెబ్ సైట్ లో తల్లిదండ్రులు, విద్యావేత్తలు, ఇతర నిపుణులు ఎవరైనా తమ  అభిప్రాయం  చెప్పచ్చు. సంస్కరణలకు  సంబంధించి మేం ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నామని.. సబ్జెక్టు ఎక్స్పర్ట్  కమిటి సిలబస్ పై లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ఇంటర్ విద్యార్దులను ప్రపంచ స్థాయి పోటీ తట్టుకునే విధంగా తయారు చేయాలన్నదే తమ లక్ష్యం అని స్పష్టం చేశారు.  


Also Read: Sankranthi Holidays: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఈసారి ఎన్నిరోజులంటే?