Software Engineer Committed Suicide In Hyderabad: హైదరాబాద్ రాజేంద్రనగర్ (Rajendra Nagar) ఠాణా పరిధిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెళ్లైన 21 రోజులకే ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాధాపూర్‌కు చెందిన రాకేష్ గౌడ్ (28)కు తమ సమీప బంధువైన కర్నూలుకు చెందిన యువతితో గతేడాది డిసెంబర్ 14న వివాహం జరిగింది. ఇద్దరూ కలిసి రాజేంద్రనగర్ పరిధిలోని హైదర్‌గూడలో నివాసం ఉంటున్నారు. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం రాకేష్ భార్య విధులకు వెళ్లింది. రాత్రి రాకేష్ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. రాత్రి 8:30 గంటల సమయంలో భర్తతో భార్య ఫోన్‌లో మాట్లాడింది. రాత్రి 11 గంటలకు ఆమె విధుల నుంచి తిరిగి ఇంటికి వచ్చేసరికి రాకేష్ ఇంట్లో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రాకేష్ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని.. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Continues below advertisement


Also Read: KTR : కేటీఆర్‌కు హైకోర్టులో రిలీఫ్ - లాయర్‌ను ఏసీబీ ఆఫీసుకు తీసుకెళ్లేందుకు అనుమతి - కానీ ..