జనవరి 09 రాశిఫలాలు
మేష రాశి
ఈ రోజు మీరు కొత్త టెక్నాలజీ గురించి తెలుసుకుంటారు. కార్యాలయంలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. ఓ శుభవార్త వింటారు. వైవాహిక జీవితంలో ప్రేమ భావన పెరుగుతుంది. మీరు వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారు:
వృషభ రాశి
ఈ రోజు మీ పనిని అనుకున్న సమయానికి పూర్తిచేయండి లేదంటే ఒత్తిడి పెరుగుతుంది. ఈరోజు శారీరక బలహీనత ఉంటుంది. కొత్త ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఉండండి. పనికిరాని విషయాల్లో సమయాన్ని వృథా చేయవద్దు. స్వార్థంగా వ్యవహరించవద్దు.
మిథున రాశి
ఈ రోజు మీరు ఏమనుకున్నా నెరవేరుతుంది. డబ్బుకి సంబంధించిన విషయాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. బంధువులతో సత్సంబంధాలు ఉంటాయి. మీ మాటతీరుతో మెప్పిస్తారు. వ్యాపార ప్రణాళిక విజయవంతమవుతుంది
Also Read: వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఈ శ్లోకాలతో తెలియజేయండి!
కర్కాటక రాశి
ఈ రోజు కార్యాలయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. మీరు ఆర్థిక లాభాల కోసం అద్భుతమైన అవకాశాలను పొందుతారు. మీ పిల్లల విజయాన్ని చూసి గర్వపడతారు. కుటుంబ సభ్యులందరూ మీతో సంతోషంగా ఉంటారు.
సింహ రాశి
ఈ రోజు మీలో ఏకాగ్రత లోపిస్తుంది. దీనివల్ల సమస్యలు తలెత్తవచ్చు. ఉన్నత అధికారులు మీ పనితీరు అసూయ పడతారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. ప్రయాణాలకు అవకాశం ఉంది. మీ పని నాణ్యత పెరుగుతుంది
కన్యా రాశి
ఈ రోజు మీరు చేయాలి అనుకున్న పని పూర్తికాదు. కుటుంబ సంబంధాలలో ఎమోషనల్ గా ఉండకూడదు. సంగీతాన్ని ఆస్వాదిస్తారు. కోర్టు వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. తప్పుడు స్వభావం గల వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవద్దు.
తులా రాశి
ఉద్యోగం కోసం చూస్తున్నవారి ఎదురుచూపులు ఈ రోజు ఫలిస్తాయి. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. సామాజిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. షేర్ మార్కెట్ నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. తీర్థయాత్రను ప్లాన్ చేసుకోవచ్చు
వృశ్చిక రాశి
ఈ రాశివారు ఈ రోజు వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలను పొందుతారు. పిల్లల పట్ల మీ ప్రవర్తనను చక్కగా ఉంచుకోండి. మీ సలహాతో మీ స్నేహితులు ప్రయోజనం పొందుతారు. జీవిత భాగస్వామికి సమయం కేటాయిస్తారు. పెండింగ్ లో ఉన్న డబ్బు తిరిగి పొందుతారు.
ధనుస్సు రాశి
ఈ రోజు కార్యాలయంలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. మీ ఆలోచనలను ఇతరులపై రుద్దకండి. మీకు ఆసక్తి ఉండే విషయాలకు ఎక్కువ సమయం కేటాయించేందుకు ప్లాన్ చేసుకోండి. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. కుటుంబ సభ్యులతో వాగ్వాదాలు ఉండవచ్చు.
మకర రాశి
ఈ రోజంతా మీరు బిజీగా ఉంటారు. వివాహితుల మధ్య మధురానుభూతి ఉంటుంది. ఉద్యోగులు ఓ అధికారి నుంచి వ్యతిరేకతను ఎదుర్కోవలసి రావచ్చు. విద్యార్థులు కొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. స్నేహితుల సహాయంతో మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి.
Also Read: దశావతారాల్లో ఏడు అవతార ఆలయాలు ఏపీలోనే ఉన్నాయ్.. ఎక్కడున్నాయ్ , మీరెన్ని దర్శించుకున్నారు!
కుంభ రాశి
ఈ రోజు మీలో సానుకూల శక్తితో నిండి ఉంటుంది. రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు ఉన్నత పదవులు పొందగలరు. శుభ కార్యాలలో ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే మంచి సమయం. కుటుంబ సభ్యులకు మీ సహాయం అవసరం ఉంటుంది. న్యాయపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు.
మీన రాశి
ఈ రోజు మొత్తం టెన్షన్‌తో ఉంటుంది. కానీ మీరు ప్రతి సమస్యను సమర్ధవంతంగా పరిష్కరిస్తారు. మీరు మీ కెరీర్ గురించి గందరగోళంగా ఉండవచ్చు. పెద్ద వాగ్దానాలు చేయవద్దు. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
Also Read: భోగి, సంక్రాంతి సహా జనవరి 2025 లో పండుగలు, సెలవులు..పెద్ద లిస్టే ఇది!