Vaikunta Ekadasi Wishes Telugu 2025
'వ్యక్తిర్ ముక్తిర్ మవాప్నోతి ఉత్తర ద్వార దర్శనాత్ '
ముక్తి పొందాలంటే వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని అర్థం
వైకుంఠ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొంటాడని..వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని భక్తుల విశ్వాసం. ఈ రోజు స్వామివారిని దర్శించుకుంటే సకలశుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ముక్తి కావాలని అనుకునే వ్యక్తి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని చెబుతారు పండితులు.ఏటా పుష్యమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని, ఉత్తర ద్వార దర్శన ఏకాదశి అని, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈరోజు వైష్ణవఆలయాల్లో ఉత్తర వైపు ద్వారాన్ని తెరిచి ప్రవేశం కల్పిస్తారు. వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకునేవారికి మరుజన్మ ఉండదని విశ్వసిస్తారు. అందుకే ఈ ఏకాదశిని మోక్షద ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు ఉపవాస నియమాలు పాటించి శ్రీ మహావిష్ణువుని,శ్రీ మహాలక్ష్మిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని చెపుతారు.
Also Read: తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందడి మొదలు.. భారీగా పెరిగిన రద్దీ, భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం!
వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువును ఆరాధించే వారికి ఈ శ్లోకాలతో శుభాకాంక్షలు తెలియజేయండి
మీకు, మీ కుటుంబ సభ్యులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వ లోకైకనాథం
ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు
ఓం నమోః భగవతే వాసుదేవాయ
మీకు, మీ కుటుంబ సభ్యులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు
ఓం నారాయణ విద్మహే వాసుదేవాయా ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్
ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు
వనమాలీ గదీ శాంగీ శంఖీ చక్రీ చ నందకీ
శ్రీమన్నారాయణో విష్ణుః వాసుదేవో భిరక్షతు
ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు
శ్రీ కృష్ణ గోవింద హరే మురారే
హే నాథ్ నారాయణ్ వాసుదేవ
మీకు, మీ కుటుంబ సభ్యులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు
వేద్యో వైద్య స్సదాయోగీ వీరహా మాధవో మధుః
అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః
ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు
మహాబుధ్ధి ర్మహావీర్యో మహాశక్తి ర్మహాద్యుతిః
అనిర్దేశ్య వపుః శ్రీమా నమేయాత్మా మహాద్రిధృక్
ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు
Also Read: వైకుంఠ ఏకాదశికి సిద్ధమవుతోన్న దక్షిణ అయోధ్య.. భద్రాద్రిలో ఉత్తర ద్వార దర్శన ఏర్పాట్లు!
భూతభవ్య భవన్నాధః పవనః పావనో2నలః
కామహా కామక్రుత్కాన్తః కామః కామప్రదః ప్రభుః
మీకు, మీ కుటుంబ సభ్యులకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు
సర్వగ సర్వవిద్భాను ర్విష్వక్సేనో జనార్దనః
వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః
వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు
భ్రాజిష్ణు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగదాదిజః
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః
వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు
వ్యవసాయో వ్యవస్థానః సంస్థాన స్స్థానదో ధ్రువః
పరర్థిః పరమ స్పష్ట: స్తుష్ట: పుష్ట శ్శుభేక్షణః
వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు
వైకుంఠ: పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః ప్రుథుః
హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయు రథోక్షజః
వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు
విస్తారః స్థావర స్స్తాణుః ప్రమాణం బీజ మవ్యయం
ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు
Also Read: వైకుంఠ ఏకాదశికి తిరుమల వెళ్లలేనివారు.. హైదరాబాద్ ఈ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం చేసుకోండి!