Top 10 Headlines Today:


యశోదలో కేసీఆర్‌కు చికిత్స


మాజీ సీఎం కేసీఆర్‌ బాత్‌రూమ్‌లో కాలు జారిపడిపోయారు. దీని కారణంగా ఆయన నడుము భాగాన లైట్ క్రాక్ వచ్చినట్టు వైద్యులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


రేపటి నుంచి ఉచిత బస్ ప్రయాణం


తెలంగాణ కేబినెట్ సమావేశంలో (Telangana Cabinet Desicions) తీసుకున్న నిర్ణయాలు, చర్చించిన అంశాల గురించి రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) వివరించారు. తాము ఎన్నికలకు ముందు ప్రకటించిన 6 గ్యారంటీలను అమలు చేయడం కోసం ఈ మొదటి కేబినెట్ సమావేశంలో చర్చించామని వివరించారు. అమలు చేసే ప్రక్రియలో భాగంగా ప్రతి గ్యారంటీ విషయంలో సుదీర్ఘంగా చర్చించామని అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఈ మొదటి కేబినెట్‌లో రెండు గ్యారంటీలను అమలు చేయాలని నిర్ణయించామని చెప్పారు. రేపు మళ్లీ ఈ రెండు గ్యారంటీలపై సుదీర్ఘంగా ఆయా విభాగాల ఉన్నతాధికారులతో చర్చించి డిసెంబరు 9న వాటిని మొదలు పెడతామని (Minister Sridhar Babu Press Meet) అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


తప్పు చేయను- పవన్ కీ కామెంట్స్ 


యువతరం కోసమే తన ఆలోచన అని జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ అన్నారు. విశాఖలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్ర తనకు ఓనమాలు నేర్పిందన్నారు. ఈ ప్రాంతం అందరినీ అక్కున చేర్చుకుందన్నారు. తాను ఇక్కడకు ఓటమి పాలయినా భయపడేది లేదన్నారు. బాధపడేది ఉండదన్నారు. ఇక్కడి వారు వలసలు పోతున్నారని, అవి ఆగాలంటే కొత్త ప్రభుత్వం రావాలని పవన్ కల్యాణ్ కోరారు. అధికారం కోసం తాను ఓట్లు అడగనని, మార్పు కోసమే తాను ఓట్లు అడుగుతున్నానని ఆయన చెప్పారు. గాజువాకలో ఓడిపోతే తాను పెద్దగా ఫీల్ కాలేదన్నారు. కానీ విశాఖ వచ్చిన రోజు రెండు లక్షల మంది వచ్చారని, ఆ ప్రేమ తనకు కన్నీళ్లు తెప్పించిందన్నారు. తాను జనసేనను ఏ పార్టీలో కలపను, బతికినా, మరణించినా పార్టీ ఎక్కడకూ వెళ్లదన్నారు. అభిమానం, ప్రేమ ఓట్ల రూపంలో బదిలీ కాకుంటే మీరిచ్చే నినాదాలు సాధ్యం కాదన్నారు. ముఖ్యమంత్రి ఎవరన్నది తాను, చంద్రబాబు కలసి కూర్చుని నిర్ణయించుకుంటామని చెప్పారు. తాను తెలుగుదేశం పార్టీ వెనక నడవటం లేదని, కలసి నడుస్తున్నామని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


మైండ్‌ గేమ్ మొదలు


తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త సెక్రటేరియట్ లో మంత్రివర్గం సమావేశం (Telangana Cabinet Meeting )నిర్వహించారు. సోనియాగాంధీ ( Sonia Gandhi ) పుట్టినరోజు సందర్భంగా డిసెంబరు 9 నుంచి రెండు గ్యారంటీలను అమలు చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరక ముందే విపక్ష నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు ప్రభుత్వంపై కామెంట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదని, ఆరు నెలల్లోనే కూలిపోతుందని జోస్యం చెబుతున్నారు. ఏడాది ఓపిక పట్టాలని కడియం శ్రీహరి అంటే, కాంగ్రెస్ నేతల నుంచి ఫోన్లు వస్తున్నాయంటూ మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అయితే ఆరు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందని అన్నారు.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


గ్రూప్‌ 2 నోటిఫికేషన్


ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువతీయువకులకు ప్రభుత్వ గుడ్ న్యూస్ వినిపించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 897 గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ డిసెంబరు 7న నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల్లో 331 ఎగ్జిక్యూటివ్, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ, ఆపై విద్యార్హత కలిగిన వారు గ్రూప్-2 ఉద్యోగాలకు అర్హులు. ఈ పోస్టుల భర్తీకి డిసెంబరు 21 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అభ్యర్థులు జనవరి 10 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల ఆధారంగా ఎంపికలు చేపట్టనున్నారు.పోస్టులవారీగా విద్యార్హతల వివరాలు, వయోపరిమితి, జీతభత్యాల వివరాలను డిసెంబరు 21లోగా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


ఎంఐఎం వర్సెస్‌ ఎంబీటీ


తెలంగాణ ఎన్నికల పలితాల తర్వాత రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకోవడం కనిపిస్తోంది. బీఆర్ఎస్  ( BRS ) ఓటు బ్యాంక్ తగ్గడం, ఆ ఓటు బ్యాంక్ బీజేపీకి మళ్లడంపై భవిష్యత్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న ఆసక్తి ఏర్పడుతోంది. అదే సమయంలో  పాతబస్తీలో పాతుకుపోయిన మజ్లిస్ కూ గండం పొంచి ఉందని ఫలితాలను బట్టి స్పష్టమైంది. కంచు కోటల్లాంటి నియోజకవర్గాల్లో మజ్లిస్ ( Majilis )  గట్టి పోటీ ఎదుర్కొంది. ఎవరూ పోటీ లేకపోయినా.. ఇలాంటి పరిస్థితి ఉంటే.. తమకు పోటీగా మరో పార్టీ వస్తే.. మజ్లిస్ కు వచ్చే ఫలితాల గురించి చెప్పాల్సిన పని లేదు. అందుకే ఇప్పుడు మజ్లిస్ ఏం చేయబోతోంది ? మజ్లిస్ ను టార్గెట్ చేసుకుని కాంగ్రెస్ ఏం చేయబోతోందన్న ఆసక్తి ఏర్పడుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


ఏ కులానికి మంత్రిపదవులు


తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఎల్బీ స్టేడియం(LB stadium)లో ప్రజాప్రభుత్వం పేరుతో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. సీఎం, మంత్రుల చేత గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్ (Tamilsye Soundararajan) ప్రమాణస్వీకారం చేయించారు. అశేష జనవాహిని మధ్య ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి(Revanth reddy), ఆ తర్వాత డిప్యూటీ సీఎం(Deputy Cm )గా మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhattivikramarka ) ప్రమాణస్వీకారం చేశారు. మంత్రులుగా ఉత్తమ్ కుమార్‌ రెడ్డి, దామోదర రాజనర్సింహా, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావులు వరుసగా ప్రమాణస్వీకారం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


నవంబర్‌లో దూసుకుపోయిన కార్ల అమ్మకాలు - టాప్ 5 లిస్ట్ ఇదే!


2023 నవంబర్‌లో భారత ఆటోమోటివ్ మార్కెట్ దాదాపు 3.34 లక్షల ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది ఇది 2022 నవంబర్‌లో నమోదైన అమ్మకాల గణాంకాల కంటే నాలుగు శాతం ఎక్కువ. అయితే ఈ విక్రయం 2023 అక్టోబర్ కంటే కూడా 14.3 శాతం తక్కువ. దేశంలోని అతిపెద్ద ప్యాసింజర్ వాహనాల తయారీ సంస్థ మారుతీ సుజుకి కంపెనీ మార్కెట్ వాటాలో ఒక్క శాతం క్షీణించినప్పటికీ గతేడాదితో పోలిస్తే 1.3 శాతం వృద్ధిని నమోదు చేసింది. హ్యుందాయ్ మోటార్ ఇండియా ఏడాది ప్రాతిపదికన 3 శాతం వృద్ధిని సాధించగా నెలవారీ విక్రయాలలో 10 శాతం క్షీణతను నమోదు చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ఎలా ఉంది


'భీష్మ' తర్వాత నితిన్ కెరీర్‌లో సరైన హిట్ పడలేదు. 'చెక్' అంటూ ప్రయోగం చేశారు. అది విజయాన్ని ఇవ్వలేదు. తర్వాత రంగ్ దే' చేశారు. కొంత మందిని మాత్రమే మెప్పించింది. హిందీలో మంచి హిట్ అయిన 'అంధాధూన్' రీమేక్‌గా తెరకెక్కిన 'మేస్ట్రో' ఓటీటీలో విడుదల కావడంతో థియేటర్లలో ఆ సినిమా విడుదల అయితే... ఫలితం ఎలా ఉండేదో చెప్పలేం. 'మాచర్ల నియోజకవర్గం' ఫ్లాప్ అయ్యింది. నాలుగు పరాజయాల తర్వాత నితిన్ నటించిన సినిమా 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్'. ఇవాళ థియేటర్లలోకి వచ్చింది.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


మెగాస్టార్ ఇంటికి నెట్‌ఫ్లిక్స్ అతిథులు


మెగాస్టార్ ఇంటికి ఈ రోజు (డిసెంబర్ 7, గురువారం) విశిష్ఠ అతిథి విచ్చేశారు. చిరంజీవితో పాటు ఆయన తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఇతర మెగా హీరోలను కలిశారు. పూర్తి వివరాల్లోకి వెళితే... పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి