Car Sales Report November 2023: 2023 నవంబర్‌లో భారత ఆటోమోటివ్ మార్కెట్ దాదాపు 3.34 లక్షల ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది ఇది 2022 నవంబర్‌లో నమోదైన అమ్మకాల గణాంకాల కంటే నాలుగు శాతం ఎక్కువ. అయితే ఈ విక్రయం 2023 అక్టోబర్ కంటే కూడా 14.3 శాతం తక్కువ. దేశంలోని అతిపెద్ద ప్యాసింజర్ వాహనాల తయారీ సంస్థ మారుతీ సుజుకి కంపెనీ మార్కెట్ వాటాలో ఒక్క శాతం క్షీణించినప్పటికీ గతేడాదితో పోలిస్తే 1.3 శాతం వృద్ధిని నమోదు చేసింది. హ్యుందాయ్ మోటార్ ఇండియా ఏడాది ప్రాతిపదికన 3 శాతం వృద్ధిని సాధించగా నెలవారీ విక్రయాలలో 10 శాతం క్షీణతను నమోదు చేసింది.
నెక్సాన్, పంచ్ అమ్మకాలు పెరిగాయి
2023 నవంబర్‌లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్లు మారుతి సుజుకి వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్, డిజైర్ కాంపాక్ట్ సెడాన్, స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్. ఇవి వరుసగా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ ర్యాంకింగ్‌లో తర్వాతి రెండు స్థానాలను టాటా నెక్సాన్ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ, పంచ్ మైక్రో ఎస్‌యూవీలు ఆక్రమించాయి. టాటా నెక్సాన్ 14,916 యూనిట్లు, టాటా పంచ్ 14,383 యూనిట్లను విక్రయించాయి. ఈ రెండు మోడల్స్ గతేడాదితో పోలిస్తే అద్భుతమైన అమ్మకాల వృద్ధిని నమోదు చేశాయి. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన SUVలుగా మారాయి.
టాటా నెక్సాన్
రెండు నెలల క్రితం మిడ్ లైఫ్ అప్‌డేట్ తర్వాత టాటా నెక్సాన్ ఎక్స్ షోరూమ్ ధర ప్రస్తుతం రూ. 8.10 లక్షల నుంచి రూ. 15.50 లక్షల మధ్య ఉంది. కర్వ్ కూపే ఎస్‌యూవీ కాన్సెప్ట్ డిజైన్ నుండి ప్రేరణ పొందిన ఈ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంటీరియర్ లేఅవుట్‌లో చాలా అప్‌డేట్‌లు ఇచ్చారు. దీని టాప్ ఎండ్ వేరియంట్‌లో 10.25 అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, 360 డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వాయిస్ అసిస్టెడ్ సన్‌రూఫ్ ఇంకా మరెన్నో ఉన్నాయి. ఈ ఎస్‌యూవీ 120 బీహెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేసే 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 115 బీహెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేసే 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌ను కలిగి ఉంది.
టాటా పంచ్
టాటా పంచ్ భారతీయ మార్కెట్లో నాలుగు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. ఇందులో 86 బీహెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేసే 1.2L పెట్రోల్ ఇంజన్ రెండు గేర్‌బాక్స్‌ల ఆప్షన్‌తో అందుబాటులో ఉంది. ప్రస్తుతం దీని ఎక్స్ షోరూమ్ ధరలు రూ. ఆరు లక్షల నుంచి రూ.10.10 లక్షల వరకు ఉన్నాయి. టాప్ క్రియేటివ్ ట్రిమ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 7.0 అంగుళాల సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రియర్ వైపర్, వాషర్, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు, ఆటోమేటిక్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, 16 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లతో వస్తుంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: సూపర్ హిట్ టయోటా కామ్రీ అప్‌డేటెడ్ వెర్షన్ త్వరలో - ఈసారి హైబ్రిడ్ ఇంజిన్‌తో!
Also Read: లాంచ్‌కు రెడీ అవుతున్న కొత్త స్విఫ్ట్ - సరికొత్త ఇంజిన్, సూపర్ లుక్‌తో!