Netflix ceo Ted Sarandos met Chiranjeevi and Ram Charan in hyderabad, see pics: మెగాస్టార్ ఇంటికి ఈ రోజు (డిసెంబర్ 7, గురువారం) విశిష్ఠ అతిథి విచ్చేశారు. చిరంజీవితో పాటు ఆయన తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఇతర మెగా హీరోలను కలిశారు. పూర్తి వివరాల్లోకి వెళితే... 


హైదరాబాద్ వచ్చిన నెట్‌ఫ్లిక్స్ సీఈవో!
ప్రముఖ ఓటీటీ వేదిక, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వీక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరాండోస్ గురువారం హైదరాబాద్ వచ్చారు. ఎయిర్ పోర్టులో దిగిన వెంటనే సరాసరి చిరు, రామ్ చరణ్ ఇంటికి వెళ్లారు. మెగా ఫ్యామిలీ హీరోలు ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఆ తర్వాత వాళ్ళందరూ కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారు.


Also Readఫ్లాప్స్ ఎఫెక్ట్ లేదుగా... నితిన్ సినిమాకు 'ఎక్స్ట్రాడినరీ' బిజినెస్ - లాస్ట్ ఐదు సినిమాల బిజినెస్ ఎలా జరిగిందంటే?






టెడ్ సరాండోస్ వచ్చిన సమయంలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, ఆయన తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్, అలాగే ప్రముఖ నిర్మాత శోభు యార్లగడ్డతో పాటు చరణ్ మిత్రుడు, నిర్మాత విక్రమ్ సైతం ఉన్నారు. టెడ్ వెంట నెట్‌ఫ్లిక్స్ ప్రతినిథులు వచ్చారు. మీటింగ్ తర్వాత అందరూ సెల్ఫీలు దిగారు. 


Also Readహాయ్ నాన్న సినిమా రివ్యూ: నాని, మృణాల్ నటించిన రొమాంటిక్ & ఎమోషనల్ డ్రామా ఎలా ఉంది?










యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ హీరోలుగా నటించిన 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమా (RRR movie) ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంది. థియేటర్లలో వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసిన ఆ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికలో విడుదలైన తర్వాత పలువురు హాలీవుడ్ ప్రముఖులు చూశారు. సోషల్ మీడియా వేదికగా తమ స్పందన తెలియజేశారు. 'ఆర్ఆర్ఆర్' చిత్రానికి అపూర్వ ఆదరణ లభించిన తర్వాత దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి నెట్‌ఫ్లిక్స్ సీఈవో ఫోన్ చేసి మాట్లాడారు. ఇప్పుడు ఆయన హైదరాబాద్ వచ్చారు.