Extra Ordinary Man review Telugu: 'భీష్మ' తర్వాత నితిన్ కెరీర్‌లో సరైన హిట్ పడలేదు. 'చెక్' అంటూ ప్రయోగం చేశారు. అది విజయాన్ని ఇవ్వలేదు. తర్వాత రంగ్ దే' చేశారు. కొంత మందిని మాత్రమే మెప్పించింది. హిందీలో మంచి హిట్ అయిన 'అంధాధూన్' రీమేక్‌గా తెరకెక్కిన 'మేస్ట్రో' ఓటీటీలో విడుదల కావడంతో థియేటర్లలో ఆ సినిమా విడుదల అయితే... ఫలితం ఎలా ఉండేదో చెప్పలేం. 'మాచర్ల నియోజకవర్గం' ఫ్లాప్ అయ్యింది. నాలుగు పరాజయాల తర్వాత నితిన్ నటించిన సినిమా 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్'. ఇవాళ థియేటర్లలోకి వచ్చింది. 


'ఎక్స్‌ట్రా' గురించి ఆడియన్స్ ఏమంటున్నారంటే?
Extra Ordinary Man premiere show reports: ఆల్రెడీ అమెరికాలో 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ప్రీమియర్ షోలు పడ్డాయి. యుఎస్ఎ నుంచి సినిమాకు సూపర్ పాజిటివ్ టాక్ లభించింది. నితిన్ కడుపుబ్బా నవ్వించారని చెబుతున్నారు. ఫస్టాఫ్ అయ్యే సరికి కొన్ని కామెడీ సీన్లు హిలేరియస్ గా వర్కవుట్ అయ్యాయని చెబుతున్నారు.


Also Read: వధువు రివ్యూ: అవికా గోర్‌ కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ? డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో కొత్త సిరీస్ ఎలా ఉందంటే?






తమిళ స్టార్ విజయ్ హీరోగా 'దిల్' రాజు 'వారసుడు' నిర్మించారు. చెన్నైలో జరిగిన ఆ సినిమా ఆడియో వేడుకలో 'డ్యాన్స్ వేణుమా' అంటూ ఇచ్చిన స్పీచ్ ను కూడా 'ఎక్స్‌ట్రా'లో వాడేశారు. రాజశేఖర్ సీన్లు సైతం బాగా నవ్వించాయని టాక్. 










అతిథిలా శ్రీ లీల క్యారెక్టర్... ఎక్కువ లేదు!
ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమాలో హీరోయిన్ శ్రీ లీల క్యారెక్టర్ అతిథి పాత్రలా ఉందని కొందరు కామెంట్ చేస్తున్నారు. అందుకు కారణం ఆమెకు స్క్రీన్ స్పేస్ తక్కువ ఉండటమే. విడుదలకు ముందు ''కమర్షియల్ సినిమా హీరోయిన్ తరహా పాత్ర ఆమెది'' అని నితిన్ చెప్పారు. సో... కంప్లైంట్ చేయడానికి ఏమీ లేదు. 


Also Readఫ్లాప్స్ ఎఫెక్ట్ లేదుగా... నితిన్ సినిమాకు 'ఎక్స్ట్రాడినరీ' బిజినెస్ - లాస్ట్ ఐదు సినిమాల బిజినెస్ ఎలా జరిగిందంటే?


 


ఫస్టాఫ్ నవ్వించిన నితిన్ & దర్శకుడు వక్కంతం వంశీ... సెకండాఫ్ కథపై కాన్సంట్రేట్ చేశారట. దాంతో ఇంటర్వెల్ తర్వాత కామెడీ డోస్ కొంచెం తగ్గిందని ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో సినిమా గురించి జనాలు ఏమంటున్నారో ఒక్కసారి కింద ట్వీట్స్ చూస్తే మీకే అర్థం అవుతుంది. కొంతమంది సినిమాకు 3 స్టార్స్ ఇస్తుంటే... ఇంకొంతమంది మాత్రం అసలు బాలేదని పోస్టలు చేస్తున్నారు.