Morning Top News:
ఏపీ చేనేత కార్మికులకు సంక్రాంతి కానుక
ఆంధ్రప్రదేశ్‌లో చేనేత కార్మికులకు కేంద్రం సంక్రాతి కానుక ఇచ్చింది. పది క్లస్టర్లు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, అనంతపురం, శ్రీసత్యసాయి, శ్రీపొట్టి శ్రీరాముల నెల్లూరు, కాకినాడ, తూర్పుగోదావరి, తిరుపతి జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఈ క్లస్టర్ల కారణంగా చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
సాగర తీరంలో అట్టహాసంగా 'నేవీ డే
విశాఖ సాగర తీరంలో నేవీ డే విన్యాసాలు అబ్బురపరిచాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరై నౌకాదళ విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు. విన్యాసాల్లో భాగంగా భారత నౌకాదళ పాటవం, పరాక్రమం ప్రదర్శించారు. దాదాపు 8 వేల అడుగుల ఎత్తు నుంచి పారాచ్యూట్ సాయంతో జాతీయ జెండా, నేవీ జెండాను ఎగురవేసి ఆహుతులను మంత్రుముగ్ధులను చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
గంటల వ్యవధిలో మాట నిలబెట్టుకున్న ఏపీ మంత్రి
ఏపీ మంత్రి నారా లోకేష్ చెప్పిన గంటల వ్యవధిలో మాట నిలబెట్టుకున్నారు. కాలేజీ బయట రాత్రి పూట తమకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఒక విద్యార్థిని మంత్రి లోకేష్ ను కోరింది. వెంటనే స్పందించిన మంత్రి లోకేష్ ఆ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దాంతో గంటల వ్యవధిలో పాయకాపురం జూనియర్ కాలేజీ ఎదుట సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
బకనచర్ల ప్రాజెక్టుపై రేవంత్ అభ్యంతరం
ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ప్రాజెక్టులపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు. ఈ సందర్భంగా వరద జలాల ఆధారంగా బనకచర్ల నిర్మిస్తున్నట్టుగా ఏపీ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన విషయాన్ని అధికారులు రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని అధికారులు వివరించారు. దీంతో సీఎం రేవంత్ తక్షణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలంగాణ అభ్యంతరాన్ని తెలియజేయాలని ఆదేశించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ప్రజలకు 'హైడ్రా' కమిషనర్ కీలక సూచన
తెలంగాణ రాష్ట్రానికి గేమ్ ఛేంజర్‌గా మారనున్న రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియ శరవేగంగా సాగుతున్నాయి. . సుమారు 343 కిలోమీటర్లతో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వేపై దృష్టి సారించింది. ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరచడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
సికింద్రాబాద్‌లో తీవ్ర విషాదం
సికింద్రాబాద్ లాలాగూడలో తీవ్ర విషాదం వెలుగుచూసింది. ఇంట్లోని గదిలో తల్లీకొడుకుల మృతదేహాలు శనివారం వెలుగుచూశాయి. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూడగా తల్లీకొడుకులు విగతజీవులుగా కనిపించారు. అనారోగ్యంతో తల్లి లక్ష్మి మృతి చెందగా.. ఆమె మృతిని తట్టుకోలేక కుమారుడు అభినయ్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
చైనావైరస్ పై తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక సూచనలు
చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్యారోగ్య శాఖ సూచించింది. ఇప్పటివరకూ రాష్ట్రంలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదు కాలేదని తెలిపింది. జలుబు, దగ్గు లక్షణాలు ఉన్న వారు సమూహాలకు దూరంగా ఉండాలని సూచించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మహా కుంభమేళా కోసం ప్రత్యేక రైళ్లు
ప్రయాగ్ రాజ్ లోని మహా కుంభమేళాకు భారత రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు నడపనుంది. కుంభమేళాకు భక్తుల రద్దీ దృష్టింలో ఉంచుకుని 3000 ప్రత్యేక రైళ్లు నడుపుతామని ప్రకటించింది. రెగ్యూలర్ రైలు సర్వీసులు మరో 10 వేలు రైళ్లు అందుబాటులో ఉంటాయని.. ప్రయాణికులు రైలు సేవల్ని వినియోగించాలని రైల్వే శాఖ చెబుతోంది. రైల్వే శాఖ మొత్తం 50 రోజులపాటు 13 వేల రైలు సర్వీసులు నడపనుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
బీజీటీని కైవసం చేసుకున్న ఆసీస్
బీజీటీని ఆసీస్ కైవసం చేసుకుంది. దీంతో గత 4 సిరీస్ ల్లో ఓటమికి తన దైన శైలిలో బదులు తీర్చుకుంది. 2015 తర్వాత తొలిసారి సొంతగడ్డపై భారత్ పై టెస్టు సిరీస్ సాధించింది. భారత్ నిర్దేశించిన 162 పరుగుల టార్గెట్ ను 27 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 162/4తో ఛేదించింది.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ఆసీస్ గడ్డపై సరికొత్తగా పంత్ రికార్డు
ధనాధన్ ఆటతీరుతో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న పంత్ ఖాతాలో తాజాగా మరో రికార్డు చేరింది. 148 ఏళ్ల చరిత్రలో ఏ విదేశీ ప్లేయర్ చేయని ఘనతను పంత్ ఇట్టే చేసి చూపించాడు. అంతకుముందు ఈ ఆసీస్ గడ్డపై ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన రికార్డు ఇంగ్లాండ్ కు చెందిన జాన్ బ్రౌన్ , రాయ్ ఫ్రెడరిక్స్ పేరిట సంయుక్తంగా ఉండేది. తాజా ఇన్నింగ్స్ తో దాదాపు నాలుగు బంతుల తేడాతో ఈ రికార్డును పంత్ తుడిచేశాడు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..