అమరావతి: ఓ విద్యార్థిని అడిగిన సమస్యపై స్పందించిన ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) గంటల వ్యవధిలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. తన డైనమిక్ పనితీరు ఎలా ఉంటుందో కొన్ని గంటల వ్యవధిలో చూపించారు.
అసలేం జరిగిందంటే..
విజయవాడ పాయికాపురంలో శనివారం ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం (Mid Day Meals) ప్రారంభించారు. అయితే రమ్య అనే ఇంటర్ బైపీసీ విద్యార్థిని తమ సమస్యను మంత్రి మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. గంటల వ్యవధిలోనే మంత్రి నారా లోకేష్ వారి సమస్యకు పరిష్కారం చూపించారు. కాలేజీ బయట రాత్రి పూట తమకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని విద్యార్థిని రమ్య మంత్రి లోకేష్ ను కోరింది. వెంటనే స్పందించిన మంత్రి లోకేష్ ఆ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దాంతో గంటల వ్యవధిలో పాయకాపురం జూనియర్ కాలేజీ ఎదుట సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించాలి
విద్యార్థులకు ఏవైనా సమస్యలు ఉన్నాయేమో కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని విజయవాడ సి పి రాజశేఖర్ బాబును మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. డైనమిక్ మినిస్టర్ పనితీరుకు నిదర్శనం ఇదంటూ టీడీపీ నేతలు చెబుతున్నారు. చెప్పినట్లుగానే గంటల వ్యవధిలోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించడంపై పాయకాపురం జూనియర్ కాలేజీ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.