Revanth vs Chandrababu: చంద్రబాబు బకనచర్ల ప్రజెంటేషన్‌పై రేవంత్ అభ్యంతరం - వెంటనే ఏపీ సీఎస్‌కు లేఖ రాయాలని ఆదేశం

Telangana: చంద్రబాబు ప్రకటించిన బనకచర్ల ప్రాజెక్టుపై రేవంత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ అభ్యంతరాలను తెలుపుతూ ఏపీ సీఎస్‌కు లేఖ రాయాలని ఆదేశించారు.

Continues below advertisement

Revanth objected to the Banakacharla project announced by Chandrababu: ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ప్రాజెక్టులపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు. ఈ సందర్భంగా వరద జలాల ఆధారంగా బనకచర్ల నిర్మిస్తున్నట్టుగా ఏపీ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన విషయాన్ని అధికారులు రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని అధికారులు వివరించారు.  దీంతో సీఎం రేవంత్ తక్షణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలంగాణ అభ్యంతరాలను తెలియజేయాలని ఆదేశించారు. 

Continues below advertisement

అదొక్కటే కాదు పోలవరం విషయంలోనూ రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా తెలంగాణ రాష్ట్రంపై పడే ప్రభావాన్ని హైదరాబాద్ ఐఐటీకి చెందిన బృందంతో అధ్యయనం చేయించాలని    ఆదేశించారు. ఐఐటీ బృందంతో సమన్వయం కోసం ప్రత్యేక అధికారిని నియమించి నెల రోజుల్లో సమగ్ర అధ్యయన నివేదిక తయారు చేయించాలన్నారు. పోలవరం నిర్మాణంతో భద్రాచలం  సీతారామచంద్ర స్వామి దేవాలయానికి ఏర్ప‌డే ముప్పుపై సమగ్ర అధ్యయనం చేయాలని ర..  2022లో 27 లక్షల క్యూసెక్‌ల వరద నీరు వచ్చినప్పుడు భద్రాచలం ముంపునకు గురైందని అధికారులుతెలిపారు.  ఈ విషయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు,  కేంద్ర జల్‌ శక్తి మంత్రిత్వ శాఖకు లేఖలు రాయాలని  రేవంత్ ఆదేశించారు.  

ఏమిటి ఈ బనకచర్ల ప్రాజెక్టు ?

గోదావరి నుంచి సముద్రంలోకి వృధాగా పోయే 3 వేల టీఎంసీల నీటిలో 300 టీఎంసీల నీటిని ఒడిసిపట్టడమే బనకచర్ల ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ఈ విషయంపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.  ప్రాజెక్టు పూర్తైతే 80 లక్షల మందికి తాగునీరు, 7.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుంది. మూడు దశల్లో బనకచర్ల ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు చెప్పారు. పోలవరం నుంచి కృష్ణా నదికి నీరు మళ్లించడం మొదటి దశ కాగా, రెండోదశలో బొల్లాపల్లి జలాశయం నిర్మించి నీళ్లు తరలిస్తామన్నారు. మూడోదశలో బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి బనకచర్లకు నీటిని మళ్లిస్తాము. గోదావరి నీటిని కృష్ణా నదికి దాని నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్‌కు అక్కడి నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్‌కు తరలిస్తాము. ఈ ప్రాజెక్టు పూర్తైతే రాయలసీమ రతనాలసీమగా మారుతుంది. పెన్నా నది ద్వారా నెల్లూరుకు నీరు ఇవ్వొచ్చు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రకాశం జిల్లాలో కరవును అరికట్టవచ్చన్నారు. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. 

Also Read'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం పవన్ కళ్యాణ్‌ను కాకుండా తమిళ హీరోలను ఇన్వైట్ చేశారా? అసలు నిజం ఏమిటి?

Continues below advertisement
Sponsored Links by Taboola