''రాజకీయాలలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఏం చేస్తున్నారో... ఐఏఎస్ అధికారిగా రామ్ చరణ్ (Ram Charan) ఈ సినిమాలో అదే చేశారు'' - ముంబైలో శనివారం ఉదయం జరిగిన 'గేమ్ చేంజర్' మీడియా మీట్ లో నటుడు ఎస్.జే. సూర్య చెప్పిన మాట. అంతే కాదు... రాజమండ్రిలో జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆయన వస్తున్నారని కూడా చెప్పారు. పవన్ ఒక్కరే వస్తున్నారా? ఇంకొకరు ఎవరైనా ఉన్నారా? సోషల్ మీడియాలో చాలా డిస్కషన్ జరుగుతోంది. అసలు విషయం ఏమిటంటే? 


పవన్ కళ్యాణ్ ఒక్కడే 'గేమ్ చేంజర్'!
రాజమండ్రిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ (Game Changer Pre Release Event) స్టేజ్ మీద కనిపించే ఒకే ఒక్కడు, ఏకైక ముఖ్య అతిథి పవన్ కళ్యాణ్. ఆయన ఒక్కరే 'గేమ్ చేంజర్'. ఆయనతో పాటు స్టేజి మీద మరొక ముఖ్య అతిథి ఉండరు. ఇప్పుడు రాజకీయాల్లో 'గేమ్ చేంజర్' అంటే పవన్ పేరు  వినబడుతోంది. ఆయన్ను తప్ప మరొకరిని ముఖ్య అతిథిగా 'గేమ్ చేంజర్' యూనిట్ కూడా అనుకోలేదని తెలిసింది.  


ఏపీ ఎన్నికలలో జనసేన ఘన విజయం తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల కోసం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో కలిసి వేదికను పంచుకున్నారు. పార్టీ కార్యక్రమాలు కొన్నిటిలోనూ పాల్గొన్నారు. అయితే... ఇప్పటి వరకు ఒక్క సినిమా వేడుకలోనూ పవన్ పాల్గొనలేదు. రాజకీయాల్లో విజయం సాధించాక ఆయన వస్తున్న మొదటి ప్రోగ్రాం 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కావడం విశేషం.


Also Read: 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కియారా అద్వానీ డుమ్మా... ఆస్పత్రిలో ఉందా? అసలు కారణం ఏమిటంటే?


ఏపీలో అధికారం చేపట్టిన తర్వాత సినిమా ఫంక్షన్స్ వంటి వాటికి పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్నారు.‌ తన అన్నయ్య కుమారుడు రామ్ చరణ్ కోసం ఇవాళ రాజమండ్రి వస్తున్నారు. ఆయన మాత్రమే ముఖ్య అతిథి అని, మరొకరు ఉండరు అని చిత్ర యూనిట్స్ సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి.


తమిళ హీరోలను ఎవరు ఆహ్వానించలేదు!
'గేమ్ చేంజర్'కు శంకర్ డైరెక్టర్. ఇది ఆయనకు తెలుగులో తొలి సినిమా. స్ట్రయిట్ టాలీవుడ్ సినిమా కనుక ఇంతకు ముందు తమిళంలో తనతో పని చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్ దళపతి విజయ్ వంటి హీరోలను ఆహ్వానించినట్లు ప్రచారం జరిగింది. ఆ ఇద్దరు హీరోలు శంకర్ కోసం వస్తున్నారని సోషల్ మీడియాలో కొంత మంది కోడే కూస్తున్నారు. ఆ మాటల్లో నిజం లేదని తెలిసింది.‌ తమిళ హీరోలను ఎవరు ఆహ్వానించలేదని సమాచారం. మెగా ఫ్యామిలీ నుంచి యంగ్ హీరోలు కొందరు వెళ్లే అవకాశం ఉంది.‌ ఆ లిస్టులో అల్లు అర్జున్ పేరు లేదని టాక్. పవన్ కళ్యాణ్ 'ఓజీ' దర్శకుడు సుజీత్ కూడా ఈవెంట్‌లో సందడి చేయనున్నారు.


Also Read‘గేమ్ చేంజర్’లో సెన్సార్ కట్ చేయమన్న పదాలు, సీన్లు ఇవే... రామ్ చరణ్ సినిమా నిడివి ఎంతంటే?