Land Scam allegations Against Rithu Chowdary | విజయవాడ: వైసీపీ హయాంలో ఏపీలో 600 కోట్లకు పైగా జరిగిన ల్యాండ్ స్కామ్ సంచలనంగా మారింది. గత 12 నెలలుగా ఏసీబీ నుంచి తప్పించుకుని తిరుగుతున్న సబ్ రిజిస్ట్రార్ ధర్మ సింగ్ ను పోలీసుల అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. గతంలో ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రారుగా ధర్మ సింగ్ పనిచేశారు. వందల కోట్ల భూములను చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి పేరు మీదకు బలవంతంగా రిజిస్ట్రేషన్ చేపించారని ధర్మ సింగ్ ఆరోపించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. అయితే ఎవరు బెదిరించి ఆ స్థలాలను శ్రీకాంత్ పేరిట రిజిస్ట్రేషన్ చేపించారన్న కోణంలో ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు.
జగన్, భారతీ రెడ్డి సన్నిహితులు అని ధర్మ సింగ్ ఆరోపణలు
సబ్ రిజిస్ట్రార్ సింగ్ అరెస్టుతో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. వైసీపీ హయాంలో మాజీ సీఎం వైఎస్ జగన్ సోదరుడు వైఎస్ సునిల్, జగన్ పీఏ నాగేశ్వర్ రెడ్డి, చీమకుర్తి శ్రీకాంత్ దందా చేశారని, శ్రీకాంత్ పేరిట ఆయన భార్య రీతూ చౌదరి పేరిట అక్రమ ఆస్తులు ఉన్నాయని సబ్ రిజిస్ట్రార్ ధర్మ సింగ్ ఆరోపించారు. వైసీపీ హయాంలో భారతీరెడ్డి బినామీ అయిన శ్రీకాంత్ అండ్ గ్యాంగ్ రెచ్చిపోయి అక్రమ రిజిస్ట్రేషన్లు చేపించుకున్నారని సంలచన విషయాలు కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.
చంద్రబాబు అంతటి నేతనే కేసుల్లో ఇరికించాం, నువ్వు మాకు ఒక లెక్కా అంటూ తనపై బెదిరింపులకు పాల్పడి అక్రమంగా భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ధర్మ సింగ్ లేఖలో పేర్కొన్నారు. వారు చెప్పిన పనులు చేయకపోవడంతో తాను ఇంట్లో లేని సమయంలో ఏసీబీ అధికారులు ఇళ్ల మీదకు పంపి మానసికంగా వేధించారు. తన కూతురు, అల్లుడు, బంధువుల ఇళ్ల మీదకు అధికారులను పంపి తనిఖీల పేరుతో వేధించారని రిటైర్డ్ అధికారి ఆరోపించారు. పరారీలో ఉన్న ధర్మ సింగ్‌ను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేసి రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారని సమాచారం.
ఎవరీ రీతూ చౌదరి..
బుల్లితెర నటి రీతూ చౌదరి, జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయ్యారు. అంతకుముందు ప్రదీప్ మాచిరాజు పెళ్లిచూపులు కార్యక్రమం ద్వారా ఆమెకు గుర్తింపు వచ్చింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫారిన్ టూర్ల ఫొటోలను షేర్ చేస్తుంటారు. అయితే రూ. 600 కోట్ల ల్యాండ్ స్కాంలో రీతూ చౌదరి ఇరుక్కున్నారు. చీమకుర్తి శ్రీకాంత్ భార్య రీతూ చౌదరి పేరిట సైతం అక్రమ ఆస్తులున్నాయని ఇబ్రహీంపట్నం మాజీ సబ్ రిజిస్ట్రార్ ధర్మ సింగ్ చెబుతున్నారు. ఏపీలో ల్యాండ్ మాఫియాలో రీతూ చౌదరి హస్తం ఉందన్న ఆరోపణలు రావడంతో నటీనటలు షాకవుతున్నారు.
ఇబ్రహీంపట్నం, విజయవాడలలో ల్యాండ్ రిజిస్ట్రేషన్‌లో శ్రీకాంత్, రీతూ చౌదరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కమెడియన్‌గా, బుల్లితెర నటిగా పేరు తెచ్చుకున్న రీతూ చౌదరిపేరు ల్యాండ్ మాఫియా కేసులో రావడం సంచలనంగా మారింది. వీరి వెనుక వైసీపీ ప్రభుత్వ పెద్దలు ఉన్నారని.. ఏసీబీ విచారణలో వాస్తవాలు బయటకు రానున్నాయి.