Morning Top News:
రేపు విజయవాడలో హైందవ శంఖారావం
ఎప్పటినుంచో హిందూ దేవాలయాల పరిరక్షణ, నిర్వహణ హిందువుల చేతిలోనే ఉండాలంటూ డిమాండ్ చేస్తున్న విశ్వ హిందూ పరిషత్ విజయవాడలో ఆదివారం నాడు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తోంది. " హైందవ శంఖారావం " పేరుతో విజయవాడ సమీపంలోని కేసరపల్లిలోని 30 ఎకరాల మైదానంలో సభ జరగనుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ఏపీలో ఇక ప్రభుత్వ జీవోలన్నీ తెలుగులోనే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు భాషను మరింత విస్తృతంగా ఉపయోగించాలని నిర్ణయించుకుంది. ప్రభుత్వ ఆదేశాల ఉత్తర్వులు అన్నీ తెలుగులోనే ఇవ్వాలని అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. దీని వల్ల పాలనపై ప్రజల్లో అవగాహన పెరిగే అవకాశం కూడా ఉంటుందని భావిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం
జీడిమెట్ల దూలపల్లి పారిశ్రామిక వాడలోని కెమికల్ గోదాంలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో భారీగా మంటలు ఎగిసిపడగా స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది 2 ఫైరింజన్లతో అక్కడకు చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలు అదుపు చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
భాగ్యనగరంలో నుమాయిష్ సందడి
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నుమాయిష్ సందడి ప్రారంభమైంది. మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ లో దాదాపు 2,400కు పైగా స్టాల్స్ ఒకే దగ్గర ఉండనున్నాయి. 1938లో నిజాం కాలం నుంచి మొదలైన నుమాయిష్‌కు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి సందర్శకులు వస్తారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ఒలింపిక్ విజేతకు మెగా ప్రోత్సాహం
చిరంజీవి తనది మెగా మనసు అని మరోసారి చాటి చెప్పారు ... ఒలింపిక్ విజేతకు మూడు లక్షల రూపాయల చెక్ అందించారు. దీప్తి చిరంజీవి అభిమాని అని చెప్పాగానే ఆయనే అకాడమీకి వచ్చి కలుస్తాను అన్నారని, మాట నిలబెట్టుకున్నారని అన్నారు. చిరు స్పందన తమకు ఎంతో సంతోషాన్ని, కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని పుల్లెల గోపీచంద్ వాయిస్ నోట్ విడుదల చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
ప్రాంతీయ రింగ్ రోడ్డు నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డుకు సాధ్యమైనంత త్వరగా భూ సేకరణ చేయాలని, రైతులకు వీలైనంత ఎక్కువ పరిహారం వచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆర్బిట్రేటర్లుగా ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లు రైతులకు వీలైనంత ఎక్కువ మొత్తం పరిహారం వచ్చేలా చూడాలన్నారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ఇన్‌స్టాలో లవ్, కుటుంబాల మధ్య ఘర్షణ
ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలంలో శుక్రవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది.ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాల మధ్య ఘర్షణకు దారి తీసింది. తమ అమ్మాయిని తీసుకెళ్లారంటూ యువకుడి ఇంటివద్ద యువతి బంధువులు ఆందోళనకు దిగారు. దాంతో యువతి బంధువులపై యువకుడి బంధువులు, సన్నిహితులు దాడికి పాల్పడ్డారు. ఇరు వర్గాల పరస్పర దాడుల్లో 4 కార్ల అద్దాలు ధ్వంసం కాగా, ఇద్దరికి గాయాలయ్యాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
చైనా వైరస్ విషయంలో ఆందోళన వద్దన్న భారత్ హెల్త్ ఏజెన్సీ
చైనాలో మెటానిమోవైరస్ వ్యాప్తి పట్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని భారత హెల్త్ ఏజెన్సీ డీజీహెచ్ఎస్ తాజాగా ప్రకటించింది. అయితే శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకునేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పుడున్న పరిస్థితుల గురించి మాత్రం భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
రిటైర్మెంట్‌పై రోహిత్ స్పందన
సిడ్నీ టెస్టు ఆడకపోవడంపై టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఫాం కారణంగా డ్రెస్సింగ్ రూముకు పరిమితం కావాలనుకున్నట్లు తెలిపాడు. తాను ఫామ్‌లో లేని కారణంగా జట్టు ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశాడు. తాను ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదని, ఏ నిర్ణయం తీసుకోలేదన్నాడు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
జస్ప్రిత్ బుమ్రా ఖాతాలో అరుదైన ఘనత
ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5వ టెస్టులో జస్ప్రిత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. 5 లేక అంతకంటే ఎక్కువ టెస్టుల సిరీస్ లో ఆసీస్ గడ్డమీద అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు బుమ్రా. భారత స్పిన్ దిగ్గజం బిషన్ సింగ్ బేడీ పేరిట ఉన్న రికార్డును బద్ధలుకొట్టాడు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..