Ammayi garu Serial Today Episode విజయాంబిక సూర్యప్రతాప్‌తో మన రూప రాజుని ఇంకా మర్చిపోలేదని కానీ రాజు మాత్రం మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని చెప్తుంది. బస్తీలో పుట్టి పెరిగిన వాడికే అంత ఉంటే సీఎం కూతురికి ఇంకెంత ఉండాలి మనం కూడా రూపకి ఇంకో పెళ్లి చేద్దామని విజయాంబిక అంటుంది. అందరూ షాక్ అయిపోతారు. రూప రోహిణి మెడలో తాళి లేకపోవడం గుర్తు చేసుకొని రాజు మరో పెళ్లి చేసుకోడని చెప్తుంది. ఇంకా నీకు వాడి మీద నమ్మకం ఉందా అని అడుగుతుంది విజయాంబిక.
రోహిణిని చనువుగా కొట్టాడని తను కూడా తన తల్లిదండ్రులను అత్తామామ అని పిలుస్తుందని విజయాంబిక చెప్తుంది. ఇక ముత్యాలు వాళ్లు రోహిణికి తమతో ఉంటే నీకే ప్రాబ్లమ్ వస్తుందని బంటి గురించి తెలియని వాళ్లు నిన్ను అమ్మగా అనుకుంటారని, నువ్వు అత్తామామ అని పిలిస్తే నిన్ను రాజు భార్య అనుకుంటారని చెప్తారు. రోహిణి మనసులో రాజు భార్య అవ్వాలనే ఇలా చేస్తున్నానని అనుకుంటుంది. రాజు కూడా రోహిణిని జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. తనే బంటి అమ్మ అని ఎవరికీ చెప్పొద్దని అంటాడు. ఇక సూర్యప్రతాప్ ఇంట్లో వాళ్లతో అత్తామామ అని పిలిస్తే కోడలు అయిపోదని ఆమె మెడలో తాళి లేదు కాళ్లకు మెట్టలు లేవు పెళ్లి అయిండదు అని అంటాడు.
రాజుకి పెళ్లి కాలేదని రూప సంతోషపడుతుంది. ఇక రేపు మందారం వర్ధంతి అని దీపుతో ఆబ్దికం చేయిద్దామని రూప చెప్తుంది. రాజు వాళ్లు కూడా అదే కార్యక్రమాన్ని చేయాలని అనుకుంటారు. ఇరు కుటుంబాలు ఎవరికీ వారుగా మందారం ఫొటో పట్టుకొని చెరువు దగ్గరకు వెళ్తుంటారు. ఇక విరూపాక్షి తన జీవితంలానే తన కూతురి జీవితం కూడా అయిపోయిందని బాధ పడుతుంది. రెండు కుటుంబాలు ఎదురవుతాయి. రాజు రూపలు ఒకర్ని ఒకరు చూసి నవ్వుకుంటారు. ఇంతలోనే రాజు మందారాన్ని గుర్తు చేసుకొని రూప వైపు చూడకుండా కోపంగా ముఖం తిప్పేస్తాడు.
రాజు: మందారాన్ని చంపిన వాళ్లే ఆబ్దికం చేయడం ఏంటో.
రూప: ఏంటి రాజు ఇంకా నా మీద కోపం పోలేదా మందారం విషయంలో జరిగిన పొరపాటుని ఇంకా క్షమించలేకపోతున్నావా. రాజు అసలు ఆరోజు.
రాజు: నీ మీద కోపం పోవడానికి నువ్వు చేసింది తప్పు కాదు క్షమించరాని నేరం. పోయిన మందారం తిరిగి రాదు అన్నది ఎంత నిజమో నిన్ను క్షమించడం అనేది కూడా అంతే నిజం.
దీపక్: రూప అయినా వాడు నిన్ను క్షమించడం ఏంటి మందారం చనిపోవడంలో నీ తప్పు ఎంత ఉందో రాజు తప్పు అంతే ఉంది. మందారానికి ప్రమాదం ఉందని తెలిసి కూడా ఓ అమ్మాయికి అప్పగించి వెళ్లడం రాజు తప్పు.
ముత్యాలు: నాన్న వాళ్లతో మనకు ఎందుకు వెళ్దాం పద.
రాజు: వెళ్దాం కానీ వీళ్లు మందారానికి ఆబ్దికం చేయడానికి వీల్లేదు.
సూర్య: మందారానికి మీరు ఎంత మేం అంతే మందారానికి అబ్దికం మీరు చేయడం ఎంత ముఖ్యమే మేం చేయడం అంతే ముఖ్యం.
రెండు కుటుంబాల మధ్య ఆబ్దికం విషయంలో మాటా మాటా పెరుగుతుంది. ఇన్నేళ్లు ఏం చేయలేదు ఇప్పుడేంటి కొత్తగా అని విరూపాక్షి రూపని అడుగుతుంది. వీళ్లతో మనకు ఎందుకు మందారం కొడుకుతో ఆబ్దికం చేయించాలి అనుకున్నాం చేయిద్దామని అంటాడు. మందారం కొడుకు మణిదీప్‌ని పిలుస్తారు. అందరూ మందారం కొడుకు వస్తున్నాడు అనడంతో సంతోషపడతారు. బంటి ఫ్రెండ్ మణిదీప్ అనుకొని సంతోషపడతారు. ఓ వైపు రాజు వాళ్లు మరోవైపు రూప వాళ్లు కార్యక్రమం చేస్తారు. రాజు చూసినప్పుడు రూప చూడదు రూప చూసినప్పుడు రాజు చూడదు. మందారం కొడుకుని అమ్మాయిగారు బాగా చూసుకుంటున్నారని అమ్మాయి గొప్పదని మందారం కొడుకు ఆ ఇంటి వారసుడిగా పెరుగుతున్నాడని సంతోష పడతారు. రాజుతో ఆ విసయం చెప్తారు. ఇక విరూపాక్షి మనసులో నిజంగానే రూప రాజు బిడ్డని పేద రక్తం అని అనుకుంటే మందారం బిడ్డని ఎందుకు అలా పెంచుకుంటుందని అనుకుంటుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: మందారం బతికే ఉందా.. మరి రాజు తీసుకొచ్చిన శవం ఎవరిది? అసలేంటీ ట్విస్ట్!?