Seethe Ramudi Katnam Serial Today Episode జనార్థన్ ఆఫీస్‌కి వెళ్తాడు. ఆఫీస్‌లో ఇద్దరు యువకులు జనార్థన్ గురించి ఒక భార్య పోతే ఇంకో భార్య వస్తుంది ఆయన పనే బాగుంది. ముందు పెళ్లాం పోతే మహాలక్ష్మీ గారిని పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఇప్పుడు విద్యాదేవి వచ్చింది. మహాలక్ష్మీ ఉండగానే ఇద్దరికీ ఎఫైర్ నడించింది వీళ్లిద్దరే మహాలక్ష్మీని చంపేసుంటారని అంటారు. ఆ మాటలు విన్న జనార్థన్ ఇద్దరిని కొడతాడు. రామ్, సీత, విద్యాదేవి అక్కడికి వస్తారు. వాళ్లని పని నుంచి తీసేయమని జనా, రామ్ అంటారు. దాంతో సీత అందరినీ కూల్ చేసి మామయ్యతో మాట్లాడుతా అని తీసుకెళ్తుంది.
జనార్థన్ ఆవేశంతో విద్యాదేవి గారి వల్ల మహాలక్ష్మీ చనిపోయింది అంటున్నారని వాళ్లని చంపేయాలి అని అంటాడు. దానికి సీత ఈ రోజు మీరు విని ఇంత బాధపడ్డారు కానీ టీచర్ ఇలాంటి మాటలు రోజు వింటున్నారు. రోజు బాధ పడుతున్నారు. మన ఇంటి చుట్టే అలా అంటున్నారు అని అంటుంది. ఇలాంటప్పుడే సరైన నిర్ణయం తీసుకోమని సీత అంటుంది. రామ్ కూడా వచ్చి సీత మాటలు అర్థం కాలేదు అంటాడు. మన వల్ల ఒకరు నష్టపోతే వాళ్లకి న్యాయం చేయాలని అంటుంది. మామయ్య కోసం టీచర్ చాలా త్యాగాలే చేశారని, రిజిస్టర్ ఆఫీస్‌లో వ్రతంలో చాలా చేసిందని అంటుంది. రామ్ కూడా టీచర్‌కి ఏమైనా సాయం చేయాలి అని మీరు తనని ఏం సాయం చేసినా ఏం అనను ఆవిడకు న్యాయం చేయమని రామ్ అంటాడు. సీత కూడా మామతో టీచర్‌కి న్యాయం చేయమని మీకు ఓ మంచి తోడు కావాలని మీరు చేయాల్సిన న్యాయం ఆ తోడులోనే ఉందని మీకు తోడు ఆవిడకు న్యాయం రెండు జరగాలి అని మనసు పెట్టి ఆలోచించమని చెప్తుంది.
జనార్థన్ ఆలోచనలో పడతాడు. జనార్థన్, టీచర్ తప్పా అందరూ హాల్‌లో కూర్చొని ఉంటారు. వాచ్ మెన్ సాంబ పరుగున వచ్చి ఓ సినిమా చూశానని మన ఇంటి ముందే జరుగుతుందని వచ్చి చూడమంటాడు. అందరూ గుమ్మం వైపు చూస్తారు. జనార్థన్, విద్యాదేవిలు దండలతో ఇంటికి చేరుకుంటారు. సీత తన ప్లాన్ సక్సెస్ అయిందని సంతోషపడుతుంది. మిగతా అందరూ షాక్ అయిపోతారు. ఇద్దరు పెళ్లి చేసుకొని అందరి ముందు నిలబడతారు. ఇద్దరం గుడిలో పెళ్లి చేసుకొని వచ్చాం అని జనార్థన్ అంటాడు. ఫ్లాష్‌బ్యాక్‌లో ఇద్దరూ గుడిలో పెళ్లి చేసుకోవడం చూపిస్తారు. చలపతి చాలా మంచి పని చేశారని కంగ్రాట్స్ చెప్తారు. అర్చన గిరిధర్‌లు ఇలా ఎలా పెళ్లి చేసుకుంటారని అడుగుతారు.
దాంతో జనార్థన్ ఇప్పుడు నా కోసం పెళ్లి చేసుకున్నానని చెప్తాడు. తనకు తోడు కావాలని అందుకే పెళ్లి చేసుకున్నానని అంటాడు. మా పెళ్లిని ఎవరు ఏమన్నా ఊరుకోనని మహాకి ఇచ్చినట్లే ఈ విద్యాదేవికి గౌరవ మర్యాదలు ఇవ్వాలని ఎవరు ఏమైనా అంటే ఊరుకోనని అంటాడు. రామ్ మాత్రం పిన్ని స్థానంలో ఈవిడను ఊహించుకోనని కానీ తనని మీ మాటకు కాదు అని ఏం అడ్డు చెప్పనని అంటాడు. పిన్ని లేని లోటు ఎవరూ తీర్చలేరని అంటాడు. ఇక జనార్థన్, విద్యాదేవిలకు సీత హారతి ఇచ్చి లోపలకు ఆహ్వానిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్: వైకుంఠాన్ని కొట్టిన నయని.. త్రినేత్రిని బతికించమని వేడుకున్న బామ్మ.. నేత్రికి ఏమైంది?