Telugu TV Movies Today (4.1.2025) - Saturday Films in TV Channels: వీకెండ్ వచ్చేసింది. ఇంట్లో ఉండే టీవీల ముందు అతుక్కుపోయే డే ఇది. థియేటర్లలో ఎన్నో సినిమాలు ఆడుతున్నా, ఓటీటీలో ఎన్నో సినిమాలు, సిరీస్‌లు కొత్తగా వచ్చినా.. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలపై మాత్రం ప్రేక్షకుడు ఓ కన్నేసి ఉంచుతాడనే విషయం తెలియంది కాదు. సగటు మానవుడిని అత్యధికంగా ఎంటర్‌టైన్ చేసేది ఈ టీవీ ఛానల్సే. నచ్చిన సినిమా లేదా సీరియల్, లేదా ఏదో ఒక ప్రోగ్రామ్ వస్తుంటే.. ఇప్పటికీ అలా నిలబడి చూసే వారు చాలా మందే ఉన్నారు. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ శనివారం (జనవరి 5) చాలా సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి రిమోట్‌కు పని చెప్పే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇక్కడ ఇస్తున్నాం. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. ఇందులో మీకు నచ్చిన సినిమా ఉండొచ్చు.. లేదంటే మీరు ఇంతకు ముందు చూడని సినిమా ఉండొచ్చు. మరెందుకు ఆలస్యం షెడ్యూల్ చూసేయండి.

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘బందోబస్త్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘శుభలగ్నం’


స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘ఇస్మార్ట్ జోడి’ (షో)


ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘ఓం నమో వెంకటేశాయ’


జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘ప్రేయసి రావే’
రాత్రి 11 గంటలకు- ‘ముగ్గురు’


స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘మారన్’
ఉదయం 9 గంటలకు- ‘యమదొంగ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘విరూపాక్ష’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘సింగమ్ 3’
సాయంత్రం 6 గంటలకు- ‘ఆర్ఆర్ఆర్’ 
రాత్రి 10 గంటలకు- ‘జులాయి’


Also Readటీఆర్పీలో మళ్లీ కార్తీక దీపం రికార్డ్ - టాప్ 6లో అన్నీ 'స్టార్ మా' సీరియళ్ళే - ఏ ఛానల్‌లో ఏది టాప్‌లో ఉందో తెల్సా?


స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్’
ఉదయం 8 గంటలకు- ‘ఏబీసీడీ ఎనీ బడీ కెన్ డ్యాన్స్’
ఉదయం 11 గంటలకు- ‘అన్నాబెల్లె సేతుపతి’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘నిన్నే పెళ్లాడతా’
సాయంత్రం 5 గంటలకు- ‘మంచిరోజులొచ్చాయి’
రాత్రి 8 గంటలకు- ‘వీడొక్కడే’
రాత్రి 11 గంటలకు- ‘ఏబీసీడీ ఎనీ బడీ కెన్ డ్యాన్స్’


జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘ఏకవీర’


జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘అతనొక్కడే’
ఉదయం 10 గంటలకు- ‘డిస్కోరాజా’
మధ్యాహ్నం 1 గంటకు- ‘పంతం’
సాయంత్రం 4 గంటలకు- ‘అస్త్రం’
సాయంత్రం 7 గంటలకు- ‘సీమసింహం’
రాత్రి 10 గంటలకు- ‘మలుపు’


ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘అమ్మో ఒకటో తారీఖు’
రాత్రి 10 గంటలకు- ‘అల్లరి ప్రేమికుడు’


ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘అయ్యప్ప స్వామి మహత్యం’
ఉదయం 10 గంటలకు- ‘శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ముద్దుల మామయ్య’
సాయంత్రం 4 గంటలకు- ‘వేట’
సాయంత్రం 7 గంటలకు- ‘అదృష్టవంతులు’


జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘రిపబ్లిక్’
ఉదయం 9 గంటలకు- ‘తడాఖా’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘శివాజీ ది బాస్’ (సూపర్ స్టార్ రజినీకాంత్, శ్రియా శరణ్ కాంబోలో వచ్చిన శంకర్ చిత్రం)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘రఘు తాత’
సాయంత్రం 6 గంటలకు- ‘కెజియఫ్ చాప్టర్ 2’ (రాకింగ్ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ ఎంటర్‌టైనర్)
రాత్రి 9 గంటలకు- ‘దొర’


Also Readఅమెరికాలో కన్ను మూసిన టాలీవుడ్ డైరెక్టర్... ఆవిడ తీసిన సినిమాలు ఏమిటో తెలుసా?