తెలుగు సినిమా ఇండస్ట్రీ 2025 ప్రారంభంలో విషాద వార్త వినాల్సి వచ్చింది. కొత్త ఏడాదిలో ఒక మరణాన్ని చూడాల్సి వచ్చింది. ఈ నెల రెండవ తేదీన ఒక దర్శకురాలు అపర్ణా మల్లాది తుది శ్వాస విడిచారు. ఆవిడ వయసు 54 ఏళ్లు.
అమెరికాలో కన్నుమూసిన అపర్ణా మల్లాది
Aparna Malladi Death News: అపర్ణా మల్లాది... బహుశా ప్రేక్షకులు చాలా మందికి అక్కడ పేరు తెలిసే అవకాశం లేదు. థియేటర్లలో విడుదలైన ప్రతి సినిమా చూసే ప్రేక్షకులు ఎప్పుడో ఒకప్పుడు పేరు వినే ఉంటారు.
Who Is Aparna Malladi? ప్రిన్స్, అనీషా దామా, సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, అర్జున్ కళ్యాణ్, 'బేబీ' ఫేమ్ 'కిరాక్' సీత ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'పెళ్లి కూతురు పార్టీ'. ఆ చిత్రానికి అపర్ణా మల్లాది దర్శకత్వం వహించారు. ఆ సినిమాకు ముందు 'ది అనుశ్రీ ఎక్స్‌పరిమెంట్స్' అని మరొక సినిమా తీశారు. ఆ రెండు చిత్రాలకు దర్శకత్వం వహించడం మాత్రమే కాదు... ఓటీటీలు రాక ముందు యూట్యూబ్ పాపులర్ సిరీస్ 'పోష్ పోరీస్' తీసింది కూడా ఆవిడే. కొన్ని సినిమాలలో ఆవిడను నటించారు కూడా. అలాగే నిర్మించారు.
Also Read: 'బాహుబలి' కట్టప్పతో... ప్రభాస్ దర్శకుడి గైడెన్స్‌లో... 'బార్బరిక్' టీజర్‌లో ఆ యాంకర్‌ను చూశారా?
అపర్ణా మల్లాది కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆవిడ క్యాన్సర్ బారిన పడ్డారు. చికిత్స కోసం రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లారు. అప్పటి నుంచి అక్కడే ఉన్నారు. తొలుత క్యాన్సర్ చికిత్సలో కొంత పురోగతి కనిపించినప్పటికీ... చివరకు ఆమె ప్రాణాలను బలి తీసుకుంది.
అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరంలో జనవరి 2వ తేదీ ఉదయం అపర్ణా మల్లాది తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆవిడ మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమల అనే ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 'పెళ్లి కూతురు పార్టీ' తర్వాత అపర్ణా మల్లాది మరొక సినిమా చేయలేదు.
Also Read: రాజమౌళి సినిమాకు రెమ్యూనరేషన్ వద్దని చెప్పిన మహేష్ బాబు - ఎందుకంటే?