మీకు రీల్స్ చేయడమంటే పిచ్చి ఇష్టం ఉందా. అందులోనూ టైంపాస్ వీడియోలు కాకుండా క్రియేటివిటీకి పదునుపెట్టి రీల్స్ చేసే అలవాటు ఉందా. అయితే ఈ శుభవార్త మీకోసమే. తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు అవకాశం కల్పించింది ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (Andhra Pradesh American Association). టాలెంట్‌ను వెలికితీయాలన్న ఉద్దేశంతో వరల్డ్‌వైడ్ రీల్స్ కాంపిటీషన్ నిర్వహిస్తోంది. తెలుగు భాషలోనే మీ క్రియేటివిటీతో రీల్స్ చేసి లక్షల రూపాయాల ప్రైజ్ మనీ సాధించండి. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) తొలి బహుమతి కింద రూ.10 లక్షలు, రెండో బహుమతి కింద రూ.7 లక్షలు, మూడో బహుమతి కింద రూ4 లక్షలు ఇవ్వనుంది. టాప్ 50లో నిలిచే ఇన్‌ఫ్లూయెన్సర్లకు రూ.10,116 ప్రైజ్ మనీ అందుకోనున్నారు. ఈ కాంపిటీషన్ మరిన్ని వివరాలు, బంపర్ ఆఫర్ తెలియాలంటే ఈ వివరాలు పూర్తిగా చదవండి.
రీల్స్ కాంటెస్ట్ రూల్స్, గైడ్‌లైన్స్ పూర్తి వివరాలిలా..
- AAA నిర్వహిస్తున్న ఈ రీల్స్ కాంటెస్ట్‌కు ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేక ఎంట్రీ ఫీజు లేదు.
- కాంపిటీషన్ థీమ్ ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (Andhrapradesh American Association) లేదా నూతన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించింది అయి ఉండాలి.
- రీల్స్ కాంటెస్ట్ కోసం ఏదైనా స్థలం/ వ్యక్తిగతాలు/ జీవనశైలి/ సంస్కృతి/ చరిత్ర/ సినిమాలు కింది అంశాలలో ఏదో ఒక టాపిక్‌ను థీమ్‌గా ఎంచుకోవాలి.
- లేటెస్ట్ సమాచారం కోసం AAA Facebook, Instagram, X గానీ, YouTube అకౌంట్లను ఫాలో కావాలి.
- మీరు చేసిన రీల్‌ను మీ అధికారిక సోషల్ పేజీలలో, మీ యాక్టివ్ అకౌంట్స్‌లో AAA #AAA, #aaareelscompetition2025ని ట్యాగ్‌లతో పోస్ట్ చేయాలి.
రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఏఏఏ సోషల్ మీడియా అకౌంట్స్ ఫాలో అయితేనే రిజిస్ట్రేషన్ సబ్మిట్ అవుతుంది.
- రీల్స్ ఎంట్రీలు జనవరి 31, 2025 వరకు సమర్పించాలి. జ్యూరీ మెంబర్స్ ఫిబ్రవరి 15న టాప్ 50 రీల్స్ గుర్తిస్తారు. వాటిని ఆడియెన్స్ పోల్ కోసం రిలీజ్ చేస్తారు. టాప్ 50 వీడియోలను ఎలాగూ సెలక్ట్ చేశారు కనుక వాటికి రావాల్సిన క్యాష్ ప్రైజ్ రూ.10 వేల 116 కన్ఫామ్ అవుతుంది. అయితే ఓటింగ్‌లో తొలి 10 స్థానాల్లో నిలిచిన రీల్స్‌లో టాప్ 3ని ఏఏఏ జ్యూరీ డిసైడ్ చేస్తుంది. వారికి పైన చెప్పిన ప్రకారం లక్షల్లో క్యాష్ ప్రైజ్ అందుతుంది. మొదటి ముగ్గురు విజేతల తుది ఎంపిక జాతీయ సదస్సులో ప్రకటిస్తారు
- ఆడియెన్స్ పోల్ డేటా మార్చి 28, 2025న సాయంత్రం 5:00 గంటల EST వరకు లెక్కిస్తారు.
- ఆడియెన్స్ పోల్ అనేది ఎక్కువ సంఖ్యలో లైక్‌లు, వ్యూస్, షేర్‌లు, సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంపై ఆధారపడి ఉంటుంది.
- ప్రైజ్ మనీ: -1వ బెస్ట్ రీల్: రూ. 10,00,116.00/- 2వ బెస్ట్ రీల్: రూ. 7,00,116.00/- 3వ బెస్ట్ రీల్: రూ. 4,00,116.00/-
- రీల్ నిడివి కనీసం 15 సెకన్లు, గరిష్టంగా 90 సెకన్ల వరకు ఉండొచ్చు. రీల్ ప్రధాన భాష ఆంధ్ర తెలుగు అయి ఉండాలి. అన్ని రీల్స్ తప్పనిసరిగా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉండాలి
- రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఒకటి కంటే ఎక్కువ రీల్స్ సైతం పంపవచ్చు. కానీ ఒకసారి ఎంటర్ చేసిన రీల్ విత్ డ్రా చేసుకోలేరు.
- రీల్ అనేది వీడియో రీల్ అయి ఉండాలి. వీడియో క్వాలిటీ కనీసం 1080 మెగా పిక్సెల్ ఉండాలి.
- రీల్ క్రియేటర్స్‌కు వయసు, జెండర్ లాంటి ఏ కండీషన్లు లేవు.
- మీ రీల్స్ సొంత స్క్రిప్ట్/ ఐడియా అయి ఉండాలి. ఏ వ్యక్తి, రాజకీయ పార్టీలు, మతం, దేశం జెండాలు మొదలైన వాటిపై వ్యక్తిగత విమర్శలు చేసేలా ఉండరాదు. కంటెంట్ కాపీరైట్ కు సంబంధించిన బాధ్యత రీల్ క్రియేటర్స్‌దే.
- అప్లై చేసిన వారిని రీల్ క్రియేటర్‌గా భావిస్తారు. ప్రైజ్ మనీ దరఖాస్తుదారులకు ఇస్తారు. టీమ్ లాగ చేసినా ఎలాంటి ఇతర క్లెయిమ్‌లు యాక్సెప్ట్ చేయరు.
- గెలిచిన టీంలోని వ్యక్తిగత సభ్యులకు స్పెషల్ గిఫ్ట్, అవార్డు లాంటివి ఇవ్వరు.
- విజేత బృందానికి అమెరికాలో 2025 AAA నేషనల్ కన్వెన్షన్‌కు హాజరయ్యేందుకు చాన్స్ దొరకొచ్చు.
- AAA నేషనల్ కన్వెన్షన్ 2025 కాంటెస్ట్ కోసం ప్రత్యేకంగా రీల్స్ క్రియేట్ చేయాలి. కాపీరైట్ ఉల్లంఘనకు AAA బాధ్యత వహించదు.
- విజేతల విషయంలో AAA ప్యానెల్ నిర్ణయం ఫైనల్. ఇందులో ఎలాంటి చర్చలు, వాదనలు ఉండవు.
- AAA వెబ్‌సైట్‌లో రూల్స్, రిజిస్ట్రేషన్ లింక్ అందుబాటులో ఉంటుంది.
- టాప్ 50 రీల్స్ కు AAA వారి సర్టిఫికేట్ + AAA ట్రోఫీ + రూ. 10,000/- అందిస్తారు
- టాప్ 50 రీల్స్ పై AAAకు సర్వాధికారులు ఉంటాయి. వాటిని ఏఏఏ ఉపయోగించుకోవచ్చు.
- టాప్ 50 రీల్ క్రియేటర్లలోగానీ, లేక టాప్ 10 నుంచి ఒకరికి AAA దర్శకులలో సినిమాల్లో నటించే అవకాశం లభిస్తుంది.