Allu Arjun Pushpa 2 on OTT | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, హీరో సిద్ధార్థ్ (Siddharth) మధ్య ఇప్పుడప్పుడే ఫైట్ ముగిసేటట్లు కనిపించడం లేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎక్కడ? సిద్ధార్థ్ ఎక్కడ? వారిద్దరి మధ్య వార్ ఏంటి? అని అనుకుంటున్నారా? వారిద్దరి మధ్య వార్ ఏం లేదు కానీ.. తాజాగా వారిద్దరూ నటించిన లేటెస్ట్ చిత్రాల మధ్య మాత్రం వార్ జరిగిన విషయం తెలిసిందే. ఈ వార్‌లో అల్లు అర్జున్ తన సినిమాతో సమాధానం చెబితే.. సిద్ధార్థ్ మాత్రం తన నోటికి బాగా పని కల్పించి.. వార్తలలో నిలిచాడు. విషయంలోకి వస్తే.. 


‘పుష్ప 2: ది రూల్’ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. అయితే ఈ సినిమా విడుదలకు వారం ముందు సిద్ధార్థ్ నటించిన ‘మిస్ యూ’ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. చివరి నిమిషంలో వాయిదా వేశారు. అందుకు కారణం తమిళనాడులో సంభవించిన తుఫాన్ కారణం అని చెప్పినా.. అసలు విషయం మాత్రం అది కాదని అందరికీ తెలుసు. ‘మిస్ యూ’ సినిమా ‘పుష్ప 2’కి ముందు విడుదలై ఉంటే.. ‘పుష్ప 2’ వచ్చే సమయానికి.. ఆ సినిమాకున్న క్రేజ్ దృష్ట్యా ‘మిస్ యూ’ని థియేటర్లలో నుండి తీసేస్తామని డిస్ట్రిబ్యూటర్స్ అంతా ముందే చెప్పేయడంతో చేసేది లేక.. వారం ముందు విడుదల కావాల్సిన ‘మిస్ యూ’ సినిమా, ‘పుష్ప 2’ విడుదలైన వారం తర్వాత థియేటర్లలోకి వచ్చింది. ‘పుష్ప 2’ విడుదలైన వారం తర్వాత థియేటర్లలోకి వచ్చినా.. ఆ సినిమా ప్రభంజనం ముందు ‘మిస్ యూ’.. ప్రేక్షకుల కంట పడకుండా మిస్సయింది.


Also Read: 'గేమ్ చేంజర్' ట్రైలర్‌ వచ్చిందోచ్... ఇదీ ఫ్యాన్స్‌కు కావాల్సిన బ్లాస్ట్ - మెగా మాస్ అంతే


ఈ క్రమంలో హీరో సిద్ధార్థ్ తన ఫ్రస్ట్రేషన్ మొత్తం బయటపెట్టేశాడు. ‘మిస్ యూ’ సినిమా ప్రమోషన్స్‌లో అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమాను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన విషయం తెలిసిందే. పాట్నాలో జరిగిన ‘పుష్ప 2’ వేడుకపై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆ తర్వాత కూడా ‘పుష్ప 2’ సినిమాను ఉద్దేశిస్తూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఆయన ఎన్ని వ్యాఖ్యలు చేసినా.. ఎంతగా పోటీపడాలని చూసినా ‘పుష్ప రాజ్’ తాండవానికి తట్టుకోలేక చతికిలపడ్డాడు. తన సినిమాని వార్తలలో ఉంచే నిమిత్తం సిద్ధార్థ్ నోరుకి పని కల్పిస్తే.. ‘పుష్ప రాజ్’ మాత్రం తన సినిమా కలెక్షన్లతో సమాధానమిస్తూ వచ్చాడు. ఈ ఫైట్ థియేటర్ వరకే పరిమితం అని అంతా అనుకున్నారు.. కానీ, హీరో సిద్ధార్థ్‌‌ని ఇప్పుడప్పుడే అల్లు అర్జున్ వదిలేలా లేడనేలా.. ఇప్పుడొక వార్త అల్లు ఫ్యాన్స్‌లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..


సిద్ధార్థ్ మరియు ఆషికా రంగనాథ్ జంటగా నటించిన ‘మిస్ యూ’ చిత్రం థియేటర్లలో మెప్పించలేకపోయినా.. ఓటీటీలో మాత్రం ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని యూనిట్ అంతా భావిస్తూ.. జనవరి 26న ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కి రెడీ చేస్తున్నారు. అయితే ఈ రోమ్ కామ్ చిత్రానికి ఓటీటీలోనూ ‘పుష్ప రాజ్’ దెబ్బేయబోతున్నాడు. అవును.. సంక్రాంతికి కొత్త సినిమాలు దిగుతుండటంతో.. థియేటర్లలో ‘పుష్ప రాజ్’ హవా మ్యాగ్జిమమ్ తగ్గిపోయే అవకాశం ఉంది.



థియేటర్లు కూడా కొత్త సినిమాలకు కేటాయిస్తారు కాబట్టి.. ‘పుష్ప 2’ని కూడా ఈ మంత్ ఎండింగ్‌కే ఓటీటీలోకి తీసుకురావాలని నెట్‌ఫ్లిక్స్ సంస్థ చూస్తున్నట్లుగా తెలుస్తోంది. జనవరి 29న ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. నిజంగా, ఇదే జరిగితే.. సిద్దార్థ్‌‌పై మరోసారి ‘పుష్ప’ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఎటు చూసినా, సిద్ధార్థ్‌ని అల్లు అర్జున్ మిస్ అవ్వనంటూ వెంటాడుతున్నట్టే కనబడుతోంది. చూద్దాం.. మరి ఏం జరుగుతుందో..


Also Read: ‘గేమ్ చేంజర్’లో సెన్సార్ కట్ చేయమన్న పదాలు, సీన్లు ఇవే... రామ్ చరణ్ సినిమా నిడివి ఎంతంటే?