Game Changer: గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది అందరూ చూసే ఉంటారు. డైరెక్టర్ శంకర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషనలో ఎప్పటి నుంచో అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్న ఈ సినిమా ట్రైలర్‌లో ఫ్యాన్స్‌కి నచ్చే ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి. ట్రైలర్‌లో కనిపించిన కొన్ని టాపిక్స్ గురించి కొంచెం డీటైలింగ్ గా మాట్లాడుకుందాం. 

సీజ్ ది షిప్ కాన్సెప్ట్ :  ట్రైలర్‌లో మొదటి పాయింట్ సీజ్ ది షిప్ కాన్సెప్ట్. కడుపు నిండా వంద మద్దలు తినే ఏనుగు...ఒక్క ముద్ద వదిలి పెడితే దానికి వచ్చే నష్టం ఏం లేదు అని ట్రైలర్‌లో స్టార్టింగ్ సీన్లో చూపించారు. ఇదంతా బియ్యం బస్తాల గురించి సినిమాలో నడిచే సీన్స్ అని ట్రైలర్‌లో షాట్స్ చూస్తేనే అర్థం అవుతోంది. పీడీఎస్ బియ్యాన్ని గోదాముల్లో స్టాక్ చేసుకుని అక్కడి నుంచి వేర్వేరు దేశాలకు స్మగుల్ చేసే గ్యాంగ్స్ ఆటకట్టిస్తాడు అనుకుంటా కలెక్టర్‌గా రామ్ చరణ్. అదే విషయాన్ని బియ్యం స్మగ్లర్లకు కూడా వార్నింగ్ ఇస్తున్నట్లు చూపించారు ట్రైలర్‌లో. అచ్చం ఇలానే కాకినాడ కలెక్టర్ షన్మోహన్ కూడా రీసెంట్‌గా పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేశారు. తర్వాత సీన్‌లోకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఎంటర్ అయ్యి స్టెల్లా అనే విదేశీ నౌకను సీజ్ ది షిప్ అనటం ఎంత హాట్ టాపిక్ అయ్యిందో గుర్తుంది కదా. ఆ సీన్ కి రిలేటెడ్‌గా ఉండాలనే ట్రైలర్‌లో ఈ బియ్యం బస్తాల సీజ్ సీన్ పెట్టి ఫ్యాన్స్‌కి సీజ్ ది షిప్ సీన్‌ని గుర్తు చేసేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు అర్థం అవుతోంది. ట్రైలర్ ఇసుకు మాఫియా ఆటకట్టించే సీన్లు కూడా ఉన్నాయి.

ఈవీఎంల ధ్వంసం :ట్రైలర్‌లో రెండో పాయింట్ ఈవీఎంల ధ్వంసం. మొన్న ఏపీ ఎలక్షన్స్ టైమ్‌లో అప్పటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసి హల్ చల్ చేశారు. అందుకు కేసులో కూడా ఇరుక్కున్నారు. సేమ్ అలానే సినిమాలో ముఖ్యమంత్రిగా గెలిచిన బొబ్బిలి మోపిదేవి ఓ సందర్భంలో సుత్తి తీసుకుని ఈవీఎంలను ధ్వంసం చేస్తున్నట్లు చూపించారు. ఈ సీన్ కూడా ఏపీ పాలిటిక్స్ గుర్తు తెచ్చేలానే ఉంది. 

ఆసక్తికరంగా బొబ్బిలి మోపిదేవి పేరు :ఈ ట్రైలర్‌లో ఆసక్తికరంగా కనిపిస్తున్న మూడో పాయింట్. సీఎం బొబ్బిలి మోపిదేవి అనే పేరు. ఎస్జే సూర్య క్యారెక్టర్‌కు ఈ పేరు పెట్టారు డైరెక్టర్ శంకర్. ఏపీ పొలిటీషియన్స్‌లో బొబ్బిలి ఇంటిపేరున్న వారున్నారు. మోపిదేవి ఇంటిపేరున్న పొలిటిషియన్స్ కూడా ఉన్నారు. సో అలా వాళ్ల పేరు గుర్తుకు వచ్చేలా ఉంది ఈ బొబ్బిలి మోపిదేవి అనే పేరు. చూస్తుంటే విలన్ రోల్ పోషించినట్లు కనిపిస్తున్న బొబ్బిలి మోపిదేవి క్యారెక్టర్‌కి ఇలా కొంతమంది ఏపీ నాయకుల ఇంటి పేర్లు ఎందుకు పెట్టారో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 

రామ్ చరణ్ IAS లేదా IPS.?నాలుగో విషయం ఏంటంటే ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ చేశారని...ఒకటి వింటేజ్ రోల్‌లో రామ్ చరణ్..ఆయన అభ్యుదయం పార్టీ పెట్టినట్లుగా చూపించారు. మనమంతా పల్లెటూరి మనిషి గెటప్‌లో చరణ్‌ను చూశాం కదా. రెండోది కలెక్టర్ రోల్. కానీ ట్రైలర్‌లో ఐపీఎస్ ఆఫీసర్ గానూ కనిపించారు రామ్ చరణ్. సో ముందు చరణ్ ఐపీఎస్ ఆఫీసర్. గోడౌన్స్ సీజ్ చేయటం లాంటివి చాలా చేసి ఉంటారు. తర్వాత తనకున్న పవర్స్ చాలకనో లేదా ఇంకా ఎక్కువ సర్వీస్ చేయాలనో...ఈసారి ఐఏఎస్ క్రాక్ చేసినట్లు ఉన్నారు. హెలికాఫ్టర్‌లో చరణ్ సూట్ బూట్‌లో కనిపించే ఎంట్రీ షాట్స్ అప్పుడే కావచ్చు. 

మొత్తంగా ఓ పొలిటికల్ డ్రామాలా గేమ్ ఛేంజర్ సినిమాను తీర్చిదిద్దినట్లై అర్థమవుతోంది. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఇదే హింట్ ఇచ్చారు. శంకర్ నాలుగేళ్ల క్రితం రాసుకున్న కథ సీన్లు చాలా ఏపీ పాలిటిక్స్‌లో జరిగాయని..వాటిని మీరు తెరమీద చూస్తున్నట్లు ఉంటుందని ముందే చెప్పేశారు. జనసేన కార్యకర్తలంతా రెడీగా ఉండాలని కూడా హింట్ ఇచ్చారు. మరోవైపు ఈవెంట్‌లో డైరెక్టర్ శంకర్ రివీల్ చేసినట్లు ఓ పొలిటీషయన్‌కి, ఓ పబ్లిక్ సర్వెంట్‌కి జరిగే డ్రామాలో మళ్లీ చరణ్‌దే ఇంకో బ్యాక్ స్టోరీ ఉండటం. అది ఈ జరుగుతున్న స్టోరీకి లింక్ కావటం లాంటివి మాంచి పొలిటికల్ యాక్షన్ డ్రామాకు వేదికను సిద్ధం చేశాయి. సో ఏపీ పాలిటిక్స్‌ను టచ్ చేస్తున్న ఈ గేమ్ ఛేంజర్‌తో సంక్రాంతికి మెగా ఫ్యాన్స్ అయితే పండుగను ముందే మొదలు పెట్టేయనున్నారనైతే అర్థం అవుతోంది.

Also Read: 'గేమ్ చేంజర్' ట్రైలర్‌ వచ్చిందోచ్... ఇదీ ఫ్యాన్స్‌కు కావాల్సిన బ్లాస్ట్ - మెగా మాస్ అంతే