మాస్... మెగా మాస్... ఇదీ మెగా ఫ్యాన్స్, ప్రేక్షకులు అందరికీ కావాల్సిన మాస్... మరీ ముఖ్యంగా సౌత్ ఇండియన్ స్టార్ ఫిల్మ్ మేకర్ శంకర్ నుంచి ఆడియన్స్ అందరూ ఆశించే మాస్... ఒక్క ట్రైలర్ ఎంతో మందిలో ఉన్న సందేహాలకు చెక్ పెట్టింది. బ్లాస్ట్ చేసేలా కనిపించింది.
 
రాజమౌళి విడుదల చేసిన 'గేమ్ చేంజర్' ట్రైలర్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వం వహించిన 'గేమ్ చేంజర్' ట్రైలర్ వచ్చేసింది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. శ్రీకాంత్, అంజలి, రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు.


'గేమ్ చేంజర్' సినిమా ఎలా ఉంటుంది? ఎలా ఉండబోతుంది? అనే ప్రశ్నలకు ఈ ట్రైలర్ సమాధానం ఇచ్చింది. పక్కా మాస్ కమర్షియల్ అంశాలతో రూపొందిన పొలిటికల్ ఫిల్మ్ అని చెప్పకనే చెప్పింది. స్టూడెంట్ రామ్ నందన్ నుంచి ఐఏఎస్ అధికారి వరకు రామ్ చరణ్ జర్నీ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఆలాగే, తండ్రి అప్పన్న పాత్రలోనూ చరణ్ ఎలా ఉంటారో చూపించారు. 'వంద ముద్దలు తినే ఏనుగు... ఒక్క ముద్ద వదిలిపెడితే దానికి వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ, ఆ ఒక్క ముద్దా లక్ష చీమలకు ఆహారం. నేను అడిగేది ఆ ఒక్క ముద్దే' అని రామ్ చరణ్ చెప్పే డైలాగుతో ట్రైలర్ మొదలైంది. కలెక్టర్ కి ఆకలి వేస్తుందని రౌడీ గ్యాంగులో ఒకరు అనడం, ఆ తర్వాత డైలాగ్స్ అండ్ సీన్స్ అదిరిపోయాయి. ''రాకి రా... సార్‌కి సార్'' అని హీరో చెప్పే డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. హెలికాప్టర్ లోనుంచి లుంగీ కట్టుకుని చరణ్ దిగే సీన్ అభిమానులకు విజువల్ ఫీస్ట్ అని చెప్పాలి.


Also Read: ‘గేమ్ చేంజర్’లో సెన్సార్ కట్ చేయమన్న పదాలు, సీన్లు ఇవే... రామ్ చరణ్ సినిమా నిడివి ఎంతంటే?



'రోబో', '2.0' వంటి సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ ఫిలిమ్స్ కాకుండా శంకర్ పక్కా మాస్ మూవీ తీస్తే ఎలా ఉంటుందో మరోసారి 'గేమ్ చేంజర్' ట్రైలర్ గుర్తు చేసింది. కెరీర్ పీక్ టైంలో తీసిన 'ఒకే ఒక్కడు', 'జెంటిల్‌మన్' శంకర్ దర్శకత్వాన్ని గుర్తు చేసింది.


'గేమ్ చేంజర్' సినిమాలో రామ్ చరణ్ జంటగా బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటించిన సంగతి తెలిసిందే. ట్రైలర్‌లో ఆమె పాత్రకు, అలాగే ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే అంజలి పాత్రకూ చోటు కల్పించారు. అదే విధంగా విలన్ రోల్ చేసిన ఎస్.జె. సూర్య, ఇంకా శ్రీకాంత్, మలయాళ స్టార్ హీరో జయరాం తదితరులను సైతం చూపించారు. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన నేపథ్య సంగీతం హీరోయిజాన్ని ఎలివేట్ చేసింది.


Also Read: ‘గేమ్ చేంజర్’‌పై ఎఫెక్ట్‌ చూపించిన సంధ్య థియేటర్ ఘటన... ఆఖరికి ట్రైలర్ విడుదలకూ ఆంక్షలే



సంక్రాంతి బరిలో ముందు దిగుతున్న రామ్ చరణ్
Game Changer Release Date: సంక్రాంతి బరిలో అందరి కంటే ముందుగా రామ్ చరణ్ దిగుతున్నారు. ఈ నెల 10వ తేదీన సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. దర్శకుడు శంకర్, అలాగే సినిమాకు కథ అందించిన కార్తీక్ సుబ్బరాజు తమిళులు కావడంతో తమిళనాడులో కూడా సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. అందులోనూ నటుడుగా ఎస్ఎస్ సూర్య ఇటీవల అదరగొడుతున్నారు. ఆయన ఇమేజ్, ప్రజెంట్ కెరియర్ గ్రాఫ్ కూడా సినిమాకు హెల్ప్ అవుతుంది. హిందీలో 'ఆర్ఆర్ఆర్' తర్వాత రామ్ చరణ్ నటించిన సినిమా కావడంతో అంచనాలు ఉన్నాయి. 


'గేమ్ చేంజర్'  సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జి స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్స్ సంస్థల మీద ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు, ఆయన సోదరుడు శిరీష్ సంయుక్తంగా నిర్మించారు. ట్రైలర్ తర్వాత సినిమా మీద అంచనాలు మరింత పెరుగుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.