టీఆర్పీ రేటింగుల్లో సీరియళ్ల విషయానికి వస్తే... 'స్టార్ మా'లో వచ్చే 'కార్తీక దీపం 2' రారాజు అని చెప్పాలి. ఈ వారం టీఆర్పీల్లోనూ అది టాప్ ప్లేసులో నిలిచింది. అది ఒక్కటే కాదు... లాస్ట్ వీక్ టాప్ 10 సీరియల్ రేటింగ్స్ చూస్తే? మొదటి ఆరు స్థానాల్లో 'స్టార్ మా' సీరియళ్లు ఉన్నాయి. 'జీ తెలుగు' సీరియల్స్ ఉన్నట్టుండి టీఆర్పీల్లో ఎందుకు డౌన్ అయ్యాయి? అనేది అర్థం కావడం లేదు వీక్షకులకు. గత వారం వివిధ ఛానళ్లలో టాప్ 10లో ఉన్న సీరియళ్లు ఏమిటి? ఎందులో ఏది టాప్ ప్లేసులో ఉంది? అనేది చూడండి.


10 ప్లస్ టీఆర్పీతో 'కార్తీక దీపం 2' రికార్డు... నెక్స్ట్ ప్లేస్ దేనిది?
'స్టార్ మా' ఛానల్‌కు ఇయర్ ఎండ్ ధమాకా మామూలుగా లేదు. 'కార్తీక దీపం 2' సీరియల్ 52వ వారంలో 10.54 టీఆర్పీ రేటింగ్ సాధించింది. కొత్తగా ప్రారంభమైన 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్ దాని తర్వాత స్థానంలో నిలిచింది. 9.31 టీఆర్పీ రేటింగుతో అదరగొట్టింది. ఆ తర్వాత 9.00 టీఆర్పీతో 'గుండె నిండా గుడి గంటలు' నిలిచింది. 


టాప్ 3తో పాటు ఆ తర్వాత మూడు స్థానాల్లోనూ 'స్టార్ మా' సీరియళ్లు ఉన్నాయి. ఓ చిన్నారి ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'చిన్ని' 8.77 టీఆర్పీతో, 'ఇంటింటి రామాయణం' 8.43 టీఆర్పీతో, 'మగువ ఓ మగువ' 8.14 టీఆర్పీతో మంచి రేటింగ్స్ సాధించాయి. 'నువ్వుంటే నా జతగా‌'కు 6.19 టీఆర్పీ, 'బ్రహ్మముడి'కి 6.12 రేటింగ్ వచ్చాయి.


జీ తెలుగులో ఒక్క సీరియల్ కూడా 8 ప్లస్ టీఆర్పీ సాధించలేదేంటి?
'స్టార్ మా' సీరియల్స్ పరంగా 'జీ తెలుగు' స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇస్తోంది. అయితే, లాస్ట్ వీక్ ఆ ఛానల్ నుంచి ఒక్క సీరియల్ కూడా 8 ప్లస్ టీఆర్పీ సాధించలేదు. 51వ వారంలో 8.45 టీఆర్పీ సాధించిన 'మేఘ సందేశం' సీరియల్ ఈ వారం 7.83 టీఆర్పీతో సరిపెట్టుకుంది.


Also Read: గేమ్ చేంజర్ ట్రైలర్ లాంచ్ హైలైట్స్... రామ్‌ చరణ్‌కు రాజమౌళి కండిషన్ - తొడ కొట్టాలని ఉందన్న దిల్ రాజు, SSMB29 విడుదలపై చరణ్ హంగామా


జీ తెలుగులో 'మేఘ సందేశం' టాప్ స్థానంలో ఉంది. దాని తర్వాత 7.05 టీఆర్పీతో 'జగధాత్రి', 7.03 టీఆర్పీతో 'పడమటి సంధ్యారాగం, 6.92 టీఆర్పీతో 'నిండు నూరేళ్ల సావాసం', 6.43 టీఆర్పీతో 'త్రినయని', 6.23 టీఆర్పీతో 'అమ్మాయి గారు' ఆ ఛానల్ టాప్ 5లో నిలిచాయి. ఇంతకు ముందు (51వ వారం) 6.24 టీఆర్పీ సాధించిన 'మా అన్నయ్య' సీరియల్ ఈ వారం (52వ వారం)లో 5.23 టీఆర్పీతో సరిపెట్టుకుంది. 


మళ్లీ టీఆర్పీలో మూడు దాటని ఈటీవీ
ఈటీవీకి లాయల్ ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ... ఆ ఛానల్ సీరియళ్లకు పెద్దగా టీఆర్పీ రావడం లేదు. ఒక్క సీరియల్ కూడా 3 ప్లస్ రేటింగ్ సాధించడం లేదు. ఈటీవీలో టాప్ రేటింగ్ వచ్చే సీరియల్ 'రంగుల రాట్నం'. ఈ వారం దానికి 2.28 రేటింగ్ వచ్చింది. తర్వాత స్థానంలో 2.14 టీఆర్పీతో 'మనసంతా నువ్వే' నిలిచింది.‌‌ మిగతా సీరియళ్ల టీఆర్పీ రేటింగ్స్ రెండు లోపలే ఉన్నాయి. 'భైరవి' సీరియల్ (టీఆర్పీ 1.08) తప్ప ఒక్క రేటింగ్ దాటిన సీరియల్ జెమినీ టీవీలో మరొకటి లేదు.


Also Read‘గేమ్ చేంజర్’లో సెన్సార్ కట్ చేయమన్న పదాలు, సీన్లు ఇవే... రామ్ చరణ్ సినిమా నిడివి ఎంతంటే?