Telangana Health Deparment Key Alert On HMPV Virus: చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ (HMPV) వ్యాప్తి తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్యారోగ్య శాఖ సూచించింది. ఇప్పటివరకూ రాష్ట్రంలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదు కాలేదని తెలిపింది. జలుబు, దగ్గు లక్షణాలు ఉన్న వారు సమూహాలకు దూరంగా ఉండాలని సూచించింది. ఇప్పటివరకూ రాష్ట్రంలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదు కాలేదని వైద్యారోగ్య శాఖ తెలిపింది. జలుబు, దగ్గు లక్షణాలు ఉన్న వారు సమూహాలకు దూరంగా ఉండాలని సూచించింది.


హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు కూడా ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు వెల్లడించారు. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కలిగిస్తాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న వారిలో బ్రాంకైటిస్, నిమోనియాకు దారితీయవచ్చు. వ్యాధి లక్షణాలు బయటకు కనిపించడానికి 3 నుంచి 6 రోజులు పడుతుంది. అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. చిన్నారులు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగిన వ్యక్తులు దీని బారిన పడే అవకాశాలు ఎక్కువ.


ఈ జాగ్రత్తలు తప్పనిసరి..



  • దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు చేతితో కవర్ చేసుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో ముఖాన్ని కవర్ చేసుకోవాలి.

  • చేతులను తరచూ సోప్, శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. 

  • ఎక్కువగా సమూహం ఉన్న ప్రాంతాల్లో ఉండకూడదు. మంచి ఫుడ్ తీసుకుని.. ఎక్కువగా నీరు తీసుకోవాలి.


భారత హెల్త్ ఏజెన్సీ స్పందన


కాగా, చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి కథనాలతో ప్రపంచదేశాల్లో ఆందోళన నెలకొంది. చైనా ఉత్తర ప్రాంతంలో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుండగా.. దీన్ని 2001లోనే గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ వైరస్ సంబంధిత లక్షణాలతో అక్కడి ప్రజలు ఆస్పత్రులకు క్యూ కట్టారంటూ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సరత్రా ఆందోళన నెలకొంది. ఆసియా దేశాలు కూడా దీనిపై దృష్టి సారించాయి. ఈ క్రమంలో భారత హెల్త్ ఏజెన్సీ డీజీహెచ్ఎస్ (DGHS) తాజాగా దీనిపై స్పందించింది. హ్యూమన్ మెటానిమోవైరస్ (HMPV) వ్యాప్తి పట్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని డీజీహెచ్ఎస్ ఉన్నతాధికారి డాక్టర్ అతుల్ గోయల్ విజ్ఞప్తి చేశారు. శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకునేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పుడున్న పరిస్థితుల గురించి మాత్రం భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.


లక్షణాలివే..



  • హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు (HMPV Virus Sympotms) సైతం ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మారిదిగానే ఉంటాయని వైద్య నిపుణులు తెలిపారు.

  • దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడగా ఉండడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటాయి.

  • వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటే నిమోనియా, బ్రాంకైటిస్‌కు దారితీయవచ్చు. 3 నుంచి 6 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడొచ్చు.

  • చిన్నారులు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉన్న వారు దీని బారిన పడే అవకాశాలు ఎక్కువ.

  • దగ్గు, తుమ్ము వల్ల వెలువడే తుంపర్లు, వైరస్ బారిన పడిన వారితో సన్నిహతంగా మెలిగితే ఇది వ్యాపించవచ్చు.


నివారణ ఇలా..



  • సబ్బుతో 20 సెకన్ల పాటు తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. చేతులతో ముఖాన్ని తాకకుండా చూసుకోవాలి.

  • వైరస్ బారిన పడిన వ్యక్తులకు దూరం పాటించాలి. తరచూ తాకాల్సి వచ్చే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.

  • వైరస్ బారిన పడిన వారు దగ్గు, తుమ్ము వచ్చేటప్పుడు నోరు, ముక్కును కవర్ చేసుకోవాలి. ఆ తర్వాత చేతులు శుభ్రం చేసుకోవాలి.

  • ఆ వ్యక్తులు తమ వస్తువులను ఇతరులతో పంచుకోకుండా చూసుకోవాలి. లక్షణాలు కనిపిస్తున్నప్పుడు నలుగురిలోకి వెళ్లడం కంటే ఇంట్లో రెస్ట్ తీసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. దాని వల్ల వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని చెప్తున్నారు.


Also Read: Crime News: తెలంగాణలో మరో ఘోరం - బాలికల హాస్టల్ బాత్రూంలో కెమెరాల కలకలం, మహబూబ్‌నగర్‌లో విద్యార్థినుల ఆందోళన