Top 10  News :

 

1. జనసేన పార్టీ విస్తరణకు పవన్ వ్యూహాలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన పార్టీని విస్తరించేందుకు పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నట్లు తెలిసిపోతుంది. శ్రీవారి లడ్డూ కల్తీ వివాదంతో పవన్ ఆవేశం అంతా జగన్ మీదనో.. కల్తి నెయ్యి వివాదం మీదో అని భావించారు. కానీ ఆయన తన పార్టీని విస్తృతపరిచే దిశగా అడుగులు వేస్తున్న సంగతి స్పష్టమైంది. ఫక్తు ద్రవిడ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే తమిళనాడులో ఆల్టర్నేటివ్ పొలిటికల్ థాట్‌ను బిల్డ్ చేసే పనిలో పవన్ ఉన్నట్టు తెలిసిపోతుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

2. తిరుపతి సభలో పవన్ సంచలన వ్యాఖ్యలు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. వైసీపీపై విరుచుకుపడ్డారు. తిరుపతిలో వారాహి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 'నాపై వ్యక్తిగతంగా విమర్శలు చేసినా స్పందించలేదు. కానీ కలియుగ వైకుంఠ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారికి అపచారం జరిగితే స్పందించకుండా ఉంటామా. అన్నీ రాజకీయాల కోసమే చేయలేం. నాకు అన్యాయం జరిగిందని బయటకు రాలేదు అని పేర్కొన్నారు అంతే కాదు.  ముస్లిం లను చూసి హిందువులు నేర్చుకోవాల్సిన అంశాలు కూడా ఉన్నాయన్నారు.  పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

3. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఎదురుదెబ్బ

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మరోసారి హైకోర్టులో షాక్ తగిలింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్ళిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుల అనర్హతపై హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు డివిజన్‌ బెంచ్‌ నిరాకరించింది. ఈనెల 24న వాదనలు వింటామని ధర్మాసనం పేర్కొంది. ఎమ్మెల్యేల అనర్హతపై 20 రోజుల క్రితం సింగిల్‌ బెంచ్‌ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

4. మరోసారి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ మంత్రి కొండా సురేఖ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌కు అసలే పదవీ కాంక్ష ఎక్కువని... కేసీఆర్ బయటకు కనిపించడం లేదని.. అయన తల పగులకొట్టి చంపేశారేమో అని మంత్రి కొండా సురేఖ అనుమానం వ్యక్తం చేశారు. ఫామ్‌హౌస్‌లో  కేసీఆర్‌ ఏం చేస్తున్నారో తెలియదన్నారు.  పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

5. కొండా సురేఖపై పరువునష్టం దావా వేసిన నాగార్జున

అక్కినేని కుటుంబంపై, హీరోయిన్ సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ దూమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కొండా సురేఖపై హీరో అక్కినేని నాగార్జున పరువునష్టం దావా వేశారు. తమ కుటుంబ సభ్యుల గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆమె వ్యాఖ్యలు చేశారంటూ నాంపల్లి కోర్టును నాగార్జున ఆశ్రయించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

6 . సురేఖ వ్యాఖ్యలపై కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలు

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో తెలంగాణ కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇప్పటికే సురేఖకు నోటీసు ఇచ్చిన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్.. సురేఖపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కూడా గమనించాలని కోరారు. సురేఖ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారని గుర్తు చేశారు. ఏది ఏమైనా సురేఖ వ్యాఖ్యలు మాత్రం బీఆర్ఎస్ కు అనుకూలంగా మారగా.. కాంగ్రెస్ ను ఆత్మరక్షణలోకి నెట్టేశాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

7. క్లారిటీ లేక కొంప ముంచుతున్న మూసి ప్రక్షాళన ప్రాజెక్టు 

 

తెలంగాణ రాజకీయాల్లో మూసి ప్రక్షాళన ప్రాజెక్టు పార్టీలకు తలనొప్పిగా మారింది. ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి మూసి ప్రాజెక్టు విషయంలో ప్రత్యేకమైన శ్రద్ద చూపిస్తుండగా  ఆక్రమణలు తొలగించే పనిలో  హైడ్రా కూల్చివేతలు సంచనలం రేపాయి.  అయితే రేవంత్ వ్యూహాత్మకమైన అడుగుల దెబ్బకి  కూల్చి వేతల వ్యతికిరేకిస్తున్న పార్టీలు తాము కూల్చి వేతలకు మాత్రమే వ్యతిరేకం అని,  మూసి ప్రక్షాళన  కాదని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

8. లడ్డూ వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో నేడువిచారణ జరగనుంది. కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణపై అభిప్రాయం చెప్పేందుకు సొలిసిటర్ జనరల్ మరింత సమయం కోరారు. ఉదయం పదిన్నర గంటలకు జరిగే విచారణలో కేంద్రం చెప్పే అభిప్రాయాన్ని బట్టి సుప్రీంకోర్టు లడ్డూ కల్తీ అంశాన్ని ఏ దర్యాప్తు సంస్థ విచారణ చేయాలన్నది  ఖరారు చేస్తారు. గత విచారణలో సీఎం చంద్రబాబు వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

9. గాయత్రి దేవిగా అమ్మవారి దర్శనం

దసరా నవరాత్రులలో రెండో రోజు దుర్గమ్మ గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిస్తోంది. అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. నవరాత్రుల్లో అమ్మవారికి రోజుకొక రకమైన పూలను సమర్పించడం వల్ల భక్తుల కోరికలన్నీ దుర్గాదేవి తీరుస్తుందని నమ్మకం. రెండో రోజు అమ్మవారి బ్రహ్మచారిణి స్వరూపానికి అంకితం చేస్తారు. కమలం, మల్లెలు మొదలైన తెల్లని రంగుల పువ్వులంటే వీరికి చాలా ఇష్టం. నవరాత్రి రెండో రోజు మీరు బ్రహ్మచారిణి దేవిని ప్రసన్నం చేసుకోవడానికి తామర లేదా మల్లెపూలను సమర్పించవచ్చు.  పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

10. ప్రముఖ నటుడు కన్నుమూత

సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు మోహన్‌ రాజ్(72) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు సాయంత్రం తుదిశ్వాస విడిచారు. విలన్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న మోహన్ రాజ్ తెలుగు, తమిళం, మలయాళం భాషలలో 300 కంటే ఎక్కువ చిత్రాలలో నటించారు. మోహన్ రాజ్‌కు భార్య ఉష, జైష్మా, కావ్య అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..