Konda Surekha once again made sensational allegations against KTR : కేటీఆర్‌కు అసలే పదవీ కాంక్ష ఎక్కువ అని కేసీఆర్  బయటకు కనిపించడం లేదని.. అయన తల పగులకొట్టి చంపేశారేమో అని మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు.  ఫామ్‌హౌస్‌లో  కేసీఆర్‌ ఏం చేస్తున్నారో తెలియదు. గజ్వేల్‌లో కేసీఆర్‌ కనిపించడంలేదని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామన్నారు. కొండా సురేఖ గురువారం గజ్వేల్‌ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌పై ఆరోపణలు చేశారు. కేసీఆర్  బాగుండాలని కోరుకోవాలన్నారు.  గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆరేనని కొండా సురేఖ ఆరోపించారు.   అతనే సీఎం అనుకుని కేటీఆర్ పిచ్చి నిర్ణయాలు తీసుకున్నారంటూ మంత్రి మండిపడ్డారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఒక్కరోజు మాత్రమే అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ మళ్లీ కనిపించలేదన్నారు.     


అధికారం పోయిందని పిచ్చిపట్టినట్లుగాకేటీఆర్ వ్యవహరిస్తున్నారన్న కొండా సురేఖ 


అధికారం కోల్పోయే సరికి కేటీఆర్‌కు మతిభ్రమించింది. ఏదేదో మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.  హైడ్రా, మూసీ అంటూ ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నాడు. మూసీ ప్రక్షాళనకు తెరలేపింది బీఆర్‌ఎస్‌ పార్టీనే. ఇప్పటికైనా బీఆర్‌ఎస్‌ నేతలు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.  ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ ప్రజల్లో​ ప్రలోభాలకు తెరలేపితే ఊపేక్షించేది లేదని మండిపడ్డారు. సిద్దిపేట, గజ్వేల్‌ నియోజకవర్గాల్లో బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య చీకటి ఒప్పందం జరిగింది. కవిత బెయిల్‌ కోసం ప్రధానితో మాట్లాడి ఒప్పందం చేసుకుని.. బీజేపీతో కలిసి బీఆర్‌ఎస్‌ నేతలు పనిచేశారని స్పష్టం చేశారు.


వ్యక్తిత్వంపై అనైతిక దాడే రాజకీయామా? ఎక్కడ మొదలైంది? కారుకులెవరు?


నాగార్జున - కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోని కొండా సురేఖ 


కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని కొండా సురేఖ కొద్ది రోజులుగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ పోస్టులను కేటీఆర్ సమర్థించడంతో కొండా సురేఖ తీవ్ర ఆరోపణలు చేశారు. హీరోయిన్లను వేదించారని సమంత, రకుల్ ప్రీత్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. దీంతో గగ్గోలు రేగింది. ఫిల్మ్ ఇండ్ట్రీ మొత్తం ఈ అంశంపై స్పందించింది. దీంతో కొండా సురేఖ తన మాటల్ని ఉపసంహరించుకున్నారు. కేవలం సమంతపై చేసిన వ్యాఖ్యల్ని మాత్రమే ఉపసంహరించుకుంటున్నారు. నాగార్జునతో పాటు కేటీఆర్ పై చేసిన ఆరోపణల్ని ఉపసంహరించుకోలేదు. కేటీఆర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెబుతున్నారు. 


దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట... కొండా సురేఖ వ్యాఖ్యలపై ఎన్టీఆర్, నాని తీవ్ర ఆగ్రహం


పరువు నష్టం పిటిషన్ దాఖలు చేసిన నాగార్జున                              


కొండా సురేఖ వ్యాఖ్యలను  వెనక్కి తీసుకున్నందున ఇక వివాదాన్ని ముగించాలని కాంగ్రెస్ పార్టీ సినీ పెద్దలను కోరింది.అయితే నాగార్జున పై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోకపోవడంతో  నాగార్జున కోర్టులో పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరగాల్సి ఉంది.