ED issues summons Mohammed Azharuddin in money laundering case : హైదరాబాద్ క్రికెట్ అసిసోయేషన్‌కు అజరుద్దీన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అక్రమాలు జరిగాయని నమోదైన అవినీతి కేసుల్లో ఈడీ కూడా విచారణ చేపట్టటిింది. అక్రమ నగదు లావాదేవీలు జరిగాయని కేసు నమోదు చేసి మాజీ హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే ఈడీ ఎదుట హాజరయ్యేందుకు తనకు సమయం కావాలని అజరహద్దీన్ కోరినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్నారు. ఆయన గత ఎన్నికల్లో జూబ్లిహిల్స్ నియోజకవర్గం నుంచి  పోటీ చేసి ఓడిపోయారు. 


నాలుగేల్ల పాటు హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న అజరుద్దీన్                       


మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో చాలా కాలంగాపాటు నిషేధానికి గురైన అజహరుద్దీన్ ..నిషేధ కాలం తర్వాత క్రికెట్ రాజకీయాల్లోకి వచ్చారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేన్ అధ్యక్షుడిగా గెలిచారు. అయితే ఆయన హయాంలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. 2019 నుంచి 2023 వరకు ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ సమయంలో జరిగిన అవకతవలపై అనేక ఆరోపణలువచ్చాయి. సభ్యుల మధ్య కూడా తీవ్ర విబేధాలు రావడంతో న్యాయస్థానం జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిషన్ నియమించింది. 


ఆడపిల్లలంటే ఎందుకు అంత చులకన... తెలంగాణ రాజకీయాలకు సమంత, రకుల్ బలి కావాలా?


అక్రమాలపై ఇప్పటికే తెలంగాణ ఏసీబీ కేసులు                  


హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉప్పల్ స్టేడియంలో వివిధ సామగ్రి కొనుగోళ్లలో కోట్ల రూపాయల గోల్ మాల్ జ‌రిగింద‌ని అజారుద్దీన్‌పై సంఘంలోనితోటి సభ్యులే ఆరోపణలుచేశారు.  హెచ్‌సీఏలో కోట్ల రూపాయల నిధులు గోల్‌మాల్ చేశారని టెండర్ల పేరుతో థర్డ్ పార్టీకి నిధులు కట్టబెట్టారని అజారుద్దీన్‌పై కేసు కూడా నమోదు కావడంతో ఏసీబీ విచారణ చేస్తోంది.  అగ్నిమాపక పరికరాలు, క్రికెట్ బంతులు, బకెట్ కుర్చీలు, జిమ్ సామాగ్రితో సహా అనేక పరికరాల కొనుగోలు వ్యవహారంలో అవకతవకలు జ‌రిగినట్లు  సాక్ష్యాలు వెల్లడి కావడంతో  రాచకొండ పోలీసులు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.


వ్యక్తిత్వంపై అనైతిక దాడే రాజకీయామా? ఎక్కడ మొదలైంది? కారుకులెవరు?


ఈడీ ఎదుట హాజరయ్యేందుకు సమయం కోరుతున్న అజరుద్దీన్     


ఈ కేసుల్లోనే ఈడీ కూడా రంగంలోకి దిగింది. తెలంగాణ ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసుల్లో ఇరవై కోట్ల వరకూ అక్రమ లావాదేవీలు జరిగాయని గుర్తించింది. అయిత అజహరుద్దీన్ ఈడీ ఏదుటకు హాజరయ్యేందుకు తటపటాయిస్తునన్నారు. కాంగ్రెస్ రాజకీయల్లో గతంలో యూపీ నుంచి ఓ సారి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. తర్వాత రాజస్థాన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మరోసారి గెలవలేకపోయారు. ఎమ్మెల్యేగా పోటీ చేసినా విజయం దక్కలేదు.