Navratri 2024 IRCTC Tour Package: అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి జమ్ముకశ్మీర్​ కాట్రాకు సమీపంలో ఉన్న వైష్ణోదేవి ఆలయం. వేదకాలంనాటిది అని భావించే ఈ ఆలయం సముద్ర మట్టం నుంచి 5,300 అడుగుల ఎత్తు ఉన్న త్రికూట పర్వత శ్రేణులపై మంచుకొండ‌ల మధ్య ఉంది.


పురాణాల ప్రకారం మహాభారత యుద్ధానికి ముందు  పాండవులను ఈ ఆలయాన్ని దర్శించుకున్నారని..అందుకే విజయం సాధించారని చెబుతారు. స్థలపురాణం ప్రకారం పాండవులే మొదటగా ఇక్కడ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. ఇందుకు నిదర్శనంగా ఆ పక్కనే ఉన్న ఐదు రాతికట్టడాలను పాండవులకు ప్రతీకగా భావిస్తారు.


ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ వైష్ణోదేవిని దర్శించుకోలేం అంటారు. ఎందుకంటే ఈ యాత్ర చేయడం చాలా కష్టం..అమ్మవారి దర్శనానికి ఎక్కువ దూరం గుహల్లోనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అత్యంత మహిమాన్వితమైన ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు ఏటా 80 లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా. తిరుమల తిరుపతి ఆలయం తర్వాత ఆ స్థాయిలో భక్తులు దర్శించుకునే ఆలయం వైష్ణోదేవి.. 


Also Read: దేవీనవరాత్రులు ప్రారంభం , కలశ స్థాపన - ఈ తొమ్మిది రోజులు తప్పనిసరిగా చదువుకోవాల్సిన స్తోత్రం ఇది!


శరన్నవరాత్రులు ప్రారంభం కావడంతో వైష్ణోదేవి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఎప్పటిలానే జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఈ ఏడాది కూడా శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధం చేసింది. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసింది.


మాతా వైష్ణో దేవి మందిరం బోర్డ్ కూడా అమ్మవారిని శీఘ్రంగా దర్శించుకునేందుకు ఆన్ లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులకు ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తోంది. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న భక్తులకు లైన్‌లో నిలబడకుండా మినహాయింపు ఉంటుంది. పుణ్యక్షేత్రం బోర్డు కత్రా రైల్వే స్టేషన్‌లో స్వీయ-నమోదు బూత్‌లు ఏర్పాటు చేసింది. 


మరోవైపు భారతీయ రైల్వే వైష్ణోదేవి యాత్ర సహా నార్త్ ఇండియా టూర్ ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించింది.  ఇండియన్​ ర్వైల్వే క్యాటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్​.. ఈ ప్యాకేజీలో భాగంగా ఉత్తర భారత దేశంలో  పలు ఆలయాలను, పర్యాటక  ప్రదేశాలను సందర్శించవచ్చు.  


మాత వైష్ణో దేవీ విత్​ హరిద్వార్​ రిషికేశ్​ యాత్ర పేరుతో ప్యాకేజీ ఆపరేట్​ చేస్తోంది...ఇది మొత్తం 9 రాత్రులు, 10 పగళ్లు అందుబాటులో ఉంటుంది. ఆగ్రా, మథుర, శ్రీ మాత వైష్ణో దేవి, హరిద్వార్​, రిషికేశ్​ ప్రదేశాలు సందర్శించవచ్చు. విజయవాడ రైల్వే స్టేషన్​ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు భారత్​ గౌరవ్​ టూరిస్ట్​ ట్రైన్ మొదలవుతుంది..గుంటూరు, మిర్యాలగూడ, నల్లగొండ, సికింద్రాబాద్​, బోనగిరి, జనగాం, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్​ కాగజ్​నగర్​, బల్హర్షా, వార్ధా, నాగ్​పూర్​ మీదుగా మూడో రోజు ఉదయం ఆగ్రా చేరుకుంటారు. నాలుగో రోజు మధుర, ఐదో రోజు వైష్ణోదేవి ఆలయం, ఆరో రోజు  కత్రా రైల్వే స్టేషన్​ నుంచి హరిద్వార్​, ఏడో రోజు మానసాదేవి ఆలయం, ఎనిమిదో రోజు గంగాహారతి ...ఆ తర్వాత రోడ్డు మార్గంలో రిషికేశ్ రైల్వేస్టేషన్ కి చేరుకుని తిరుగుప్రయాణం అవుతారు...విజయవాడకు రాత్రి 11.45 కి చేరుకుంటారు.  


పెద్దలకు రూ.17,940 కాగా, 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు  రూ.16,820
3AC అయిచే పెద్దలకు రూ.29,380 - పిల్లలకు రూ.28,070
2AC అయితే పెద్దలకు రూ.38,770 -  చిన్నారులకు రూ.37,200 


ప్యాకేజీలో భాగంగా ట్రైన్ టికెట్లతో పాటూ...హోటల్​ అకామిడేషన్​, లోకల్​ ట్రాన్స్​పోర్ట్​ , ట్రావెల్​ ఇన్సూరెన్స్​, టీ - బ్రేక ఫాస్ట-లంచ్-డిన్నర్ ఉంటాయి.


Also Read: దసరా నవరాత్రులు సులువుగా చేసుకునే విధానం...పాటించాల్సిన నియమాలు