Pawan Kalyan Varahi Meeting In Tirupati | తిరుపతి: నన్ను అడుగడుగునా అవమానించారు, హేళన చేసినా పట్టించుకోలేదు. కానీ తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని అవహేళ చేస్తే చూస్తూ ఊరుకుంటామా అని జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఇది సినిమాలకు, రాజకీయాలకు సమయం కాదన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడుకుంటే, ఆ ధర్మమే అందర్నీ రక్షిస్తుందన్నారు. తిరుపతిలో నిర్వహించిన వారాహి సభలో పవన్ కళ్యాణ్ పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు.


తిరుపతి వారాహి సభలో పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇదే..


‘ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయింది. ప్రజలకు ఇచ్చిన హామీల అమలపై మా దృష్టి ఉంటుంది. రాష్ట్రంలో నెగ్గిన కూటమి ప్రభుత్వం కేంద్రానికి బాసటగా నిలిచింది. ఎన్నికల్లో కూటమి గెలిస్తే ఎలాంటి పగ, ప్రతీకారాలకు తావు ఉండదని చెప్పాం, అది చేసి చూపిస్తున్నాం అన్నారు. సనాతన ధర్మం అన్ని ధర్మాలను, మతాలను గౌరవిస్తున్నారు. అదే విధంగా ఇస్తాం, క్రైస్తవం, సిక్కిజం, బౌద్ధ, ఇతర మతాల నుంచి మంచిని నేర్చుకుని పాటించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. 


గోవిందా అన్నా హిందువులు ఆగరు..


అల్లా అంటే ముస్లింలు ఆగిపోతారు. కానీ హిందువులు గోవిందా అన్నా ఆగరు. ఇది దేవుడి సభ ఇక్కడ జేజేలు కొట్టడం, ఈలల వేయడం సరికాదు. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామికి జరిగిన అవమానంపై ఓ భక్తుడిగా ప్రశ్నిస్తే అవహేళన చేస్తున్నారు. ప్రాయశ్చిత్త దీక్ష చేపడితే నవ్వారు. భిన్నత్వంలో ఏకత్వం చూపించేది సనాతన ధర్మం. కొందర్ని భగవంతుడు 11 సీట్లకు పరిమితం చేసినా బుద్ధి రాలేదు. జంతువుల కొవ్వుతో తయారుచేసిన లడ్డూలను తిరుమల శ్రీవారి భక్తులకు ఇచ్చారు. ఇవే లడ్డూలను అయోధ్యలో రాముడు కొలువుతీరిన సమయంలో అక్కడికి సైతం పంపించి అపచారం చేశారు. అందుకే సనాతన ధర్మం పాటించేవారంతా ఏకం కావాలి. 


 



మన దేశంలో ఇతర మతాల వారు ఒక్కటిగా ఉంటారు. కానీ హిందువులలో అది కనిపించండం లేదు. భారతదేశం లౌకిక దేశం, లౌకిక రాజ్యం అంటారు. కానీ సనాతన ధర్మాన్ని కించపరిచి మాట్లాడుతూ లౌకిక వాదం అని ప్రసంగాలు చేస్తారు కొందరు. ఒక హిందువుగా సనాతన ధర్మాన్ని పాటిస్తాను. అదే సమయంలో ఇతర మతాల వారిని, మత పద్ధతులను గౌరవించడం నా కర్తవ్యం. రాముడి విగ్రహం తల నరికితే మౌనంగా రోదిస్తాం. కానీ ఎందుకు తిరగబడి ప్రశ్నించడం లేదో అర్థం కావడం లేదు. ఓ యువనేత సనాతన ధర్మాన్ని వైరస్ అంటాడు. అక్కడ రాముడ్ని చెప్పుతో కొట్టాలంటూ దారుణమైన కామెంట్లు చేస్తారు. వీటిపై చర్యలు తీసుకోవాలంటే మనమంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది. - తిరుపతిలో వారాహి సభలో పవన్ కళ్యాణ్ 


కులం చూడలేదు, మతం చూడలేదు..


సెక్యూలరిజం అంటే టు వే ట్రాఫిక్ లా ఉండాలి.. మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలన్నారు. గతంలో తాను కులం చూడలేదని, మతం చూడలేదని నష్టపోయిన రైతులు అందరికీ ఆర్థిక సాయం చేసి ఆదుకున్నట్లు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. హిందువులపై, హిందూ దేవుళ్లపై చేసినట్లు ఇతర మతాలపై, వారి దేవుళ్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేయాలంటే వణికిపోతుంటారు. ఎందుకంటే మనలో లేని ఐకమత్యం వారిలో ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు.


Also Read: Pawan Kalyan : తమిళనాడులోనూ పవన్ కల్యాణ్ హాట్ టాపిక్ - దక్షిణాది హిందూత్వ నేతగా మరో అడుగు ముందుకేసినట్లేనా ?