ఏపీ టెట్ అభ్యర్థుల భవితా తేలేది నేడే
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు నేడు ఈరోజు వెల్లడికానున్నాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈ రిజల్ట్ ఫ విడుదల చేయనున్నారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచనున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
నేడు కప్పట్రాళ్ళకు కర్నూలు జిల్లా యంత్రాంగం
రిజర్వ్ ఫారెస్ట్‌లో యురేనియం తవ్వకాలు వద్దని వ్యతిరేకిస్తున్న కప్పట్రాళ్ల గ్రామాల ప్రజలతో శాస్త్రవేత్తలు, ఫారెస్ట్, రెవెన్యూ, పోలీస్ అధికారులు నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. కప్పట్రాళ్ల సహా 12 గ్రామాల ప్రజలతో చర్చలకు శాస్త్రవేత్తలు, ఫారెస్ట్, రెవిన్యూ, పోలీస్ అధికారులు వెళ్లనున్నారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
కులగణనపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
కులగణనపై సీఎం రేవంత్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో బీసీ కులగణనకు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. కులగణనపై ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవన్న సీఎం.. స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లకు న్యాయపరమైన చిక్కులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. 6 నుంచి కులగణన ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ఈనెల 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
ఏపీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 11 నుంచి 10 రోజుల పాటు సమావేశాలు నిర్వహించనుంది. తొలి రోజు ఉదయం 11 గంటలకు వార్షిక బడ్జెట్‌ను సర్కారు సభలో ప్రవేశపెట్టనుంది. గవర్నర్ ప్రసంగం అనంతరం అదే రోజు బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టగా.. నవంబర్ 30తో గడువు ముగియనుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
నిందితుడుని 90 రోజుల్లో శిక్షిస్తాం
తిరుపతి జిల్లా వడమాలపేటలో చిన్నారిని హత్యాచారం చేసిన నిందితునికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి 3 నెలల్లోనే కఠిన శిక్ష పడేలా చేస్తామని ఏపీ హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆమె.. ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల ఆర్థికసాయాన్ని వారికి అందజేశారు. అంతకుముందు చిన్నారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. శోకసంద్రంలో మునిగిపోయిన బాలిక తల్లితండ్రులు ఓదార్చరు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
వేదికపై నుంచి అలిగి వెళ్లిపోయిన టీడీపీ ఎంపీ
నెల్లూరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా సమీక్షా మండలి సమావేశంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి అవమానం జరిగింది. రివ్యూ మీటింగ్‌లో హోస్ట్‌గా వ్యవహరించిన రూరల్ ఆర్డీవో ప్రత్యూష మంత్రులకు స్వాగతం పలికే కార్యక్రమంలో వేమిరెడ్డి పేరును విస్మరించారు. దీంతో ఆయన వేదికపై నుంచి అలిగి వెళ్లిపోయారు. మంత్రులు సముదాయించే ప్రయత్నం చేసినా పట్టించుకోకుండా వేమిరెడ్డి వెళ్లిపోయారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
తిరుచానూరులో విషాదం.. మహిళ మృతి
తిరుపతి రూరల్ మండలం తిరుచానూరులోని శిల్పారామంలో విషాదం చోటుచేసుకుంది. క్రాస్ వీల్ లో ఇద్దరు మహిళలు కూర్చొని తిరుగుతున్న సమయంలో ఒక్కసారిగా విరిగిపోయింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన మహిళను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మందకృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు
ఎస్సీ వర్గీకరణ జరిగితేనే మాదిగ దాని ఉప కులాలు బాగుపడతాయని, ఉద్యోగాల్లోనూ సముచిత స్థానం లభిస్తుందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా ధర్మ యుద్ధ సదస్సుకు ఆయన హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీలో మాలలదే పెత్తనం కొనసాగుతుందని. అందుకే ఆ పార్టీ ఎప్పుడూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ఢిల్లీలో తొలి ఆసియా బౌద్ధ శిఖరాగ్ర సదస్సు
తొలి ఆసియా బౌద్ధ శిఖరాగ్ర సమావేశానికి దేశ రాజధాని వేదిక కానుంది. ఈ నెల 5, 6 తేదీల్లో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య సహకారంతో న్యూ ఢిల్లీలో బౌద్ధ సదస్సు (ABS)ను నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము హాజరు కానున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
చరిత్రలోనే ఇంత ఘోరంగా ఓడడం తొలిసారి
స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్‌కు ఘోర పరాభవం ఎదురైంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు మ్యాచుల్లోనూ ఓడి.. రోహిత్ సేన వైట్ వాష్‌కు గురైంది. రెండు కంటే ఎక్కువ టెస్టుల్లో సొంతగడ్డపై భారత్ వైట్ వాష్ కావడం చరిత్రలోనే ఇదే తొలిసారి. ముంబై టెస్టులో 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 121 పరుగులకే కుప్పకూలింది. 3 మ్యాచుల టెస్టు సిరీస్‌ను న్యూజిలాండ్ 3-0తో సొంతం చేసుకుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
యంగ్ హీరో నిశ్చితార్థం.. హాజరైన ఎన్టీఆర్
యువ కథానాయకుడు నార్నె నితిన్ నిశ్చితార్థం తాళ్లూరి శివానితో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి జూ. ఎన్టీఆర్ హాజరయ్యారు. భార్య ప్రణతి, పిల్లలతో కలిసి వేడుకలో పాల్గొన్నారు. నితిన్.. ఎన్టీఆర్‌కు బావమరిది అవుతారనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక.. నార్నె నితిన్ మ్యాడ్, ఆయ్ సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..