Narne Nithin Engaged Silently: జూనియర్ ఎన్టీఆర్ బావమరిది, ‘ఆయ్’, ‘మ్యాడ్’ వంటి సూపర్ హిట్ సినిమాల హీరో నార్నె నితిన్ సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఈ ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన పలు వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఈ ఎంగేజ్‌మెంట్ వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. విక్టరీ వెంకటేష్, హారిక హాసిని ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత చినబాబు, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ కూడా ఈ ఎంగేజ్‌మెంట్‌కు వచ్చారు. శివాని అనే యువతితో నార్నె నితిన్ నిశ్చితార్థం జరిగింది.






వరుసగా రెండు హిట్లు
నార్నె నితిన్ హీరోగా ఇప్పటి వరకు రెండు సినిమాల్లో నటించారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ‘మ్యాడ్’ 2023లో రిలీజ్ అయి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కొత్త దర్శకుడు కళ్యాణ్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నార్నె నితిన్‌తో పాటు రామ్ నితిన్, సంతోష్ శోభన్ కూడా హీరోలుగా నటించారు.



Also Read : ‘బాహుబలి 2‘ తర్వాత ‘RRR’.. జక్కన్న సినిమాకు అరుదైన గుర్తింపు!


నార్నె నితిన్ రెండో సినిమా ‘ఆయ్’ 2024 ఆగస్టులో విడుదల అయి మంచి విజయం సాధించింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మించారు. అంజి కె.మణిపుత్ర అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. నార్నె నితిన్ సరసన నయన్ సారిక ఇందులో హీరోయిన్‌గా నటించారు. ప్రస్తుతం ‘శ్రీశ్రీశ్రీ రాజా వారు’, ‘మ్యాడ్ స్క్వేర్’ అనే రెండు సినిమాల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల్లో ఏది ముందు విడుదల అవుతుందన్న సంగతి తెలియాల్సి ఉంది. వీటిలో ‘మ్యాడ్ స్క్వేర్’పై మంచి అంచనాలు నెలకొన్నాయి. 


వీటిలో ‘శ్రీశ్రీశ్రీ రాజా వారు’ దసరాకి రిలీజ్ అవుతుందని అనుకున్నారు. కానీ ఆ సినిమా రిలీజ్ వాయిదా పడింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఆయన అందరికీ ఎంగేజ్‌మెంట్‌తో షాక్ ఇచ్చాడు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఈ ఎంగేజ్మెంట్ కి హాజరైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో మొదట ప్రత్యక్షమైంది. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఈ వేడుకల గురించి పోస్టు కూడా పెట్టాడు. హిట్టు కొట్టి సైలెంట్ గా బావమరిది పెళ్లి చేసుకుంటున్నాడుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. 



Read Also: తెలుగు సినిమాల బాటలో ‘కంగువా’, తెల్లవారుజాము నుంచే షోలు షురూ!