MP Vemireddy Left The Stage In DRC Meeting In Nellore: ప్రభుత్వ అధికారి పొరపాటుతో ఓ ఎంపీకి అవమానం జరిగింది. దీంతో ఆయన అలిగి స్టేజీ మీద నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో ఆదివారం జరిగింది. నెల్లూరు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా సమీక్షా మండలి సమావేశానికి మంత్రులు ఆనం, నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (Vemireddy Prabhakar Reddy) సహా స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు ఆదివారం హాజరయ్యారు. అయితే, రివ్యూ మీటింగ్‌లో హోస్ట్‌గా వ్యవహరించిన నెల్లూరు రూరల్ ఆర్డీవో ప్రత్యూష మంత్రులకు స్వాగతం పలికే కార్యక్రమంలో భాగంగా వారికి బొకేలు సమర్పించారు. అయితే, ఎంపీని విస్మరించడంతో ఆయన అవమానంగా భావించి ఒక్కసారిగా వేదిక పైనుంచి అలిగి వెళ్లిపోయారు. ఇది గమనించిన మంత్రులు ఆనం, నారాయణ, కలెక్టర్, అధికారులు ఆయన వద్దకు వెళ్లి సముదాయించేందుకు యత్నించారు. అయినా, ఎంపీ వారిని పట్టించుకోకుండా జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోయారు.


'క్షమాపణలు చెబుతున్నాం'


ఇది మంచి పద్ధతి కాదంటూ, తనను అగౌరవించారంటూ ఎంపీ వేమిరెడ్డి కారు వద్ద తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికారులు క్షమాపణ చెప్పినా ఆయన వినిపించుకోలేదు. ప్రజా ప్రతినిధుల పట్ల అగౌరవంగా వ్యవహరిస్తే ఊరుకోమని మంత్రి ఆనం అన్నారు. ఎంపీ వేమిరెడ్డికి జరిగిన దానికి పశ్చాత్తాపపడుతున్నామని.. ఆయనకు అందరి తరఫున క్షమాపణలు చెబుతున్నామని తెలిపారు.


Also Read: Vangalapudi Anitha: '3 నెలల్లోనే నిందితునికి కఠిన శిక్ష పడేలా చేస్తాం' - తిరుపతి బాధిత చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి అనిత