Top Headlines In Ap And Telangana:


1. ఉచితంగా గ్యాస్ సిలిండర్ పొందాలంటే?


ఏపీ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల అమలులో భాగంగా ఉచిత సిలిండర్ పథకాన్ని ఇటీవల ప్రారంభించింది. ‘దీపం 2.0’ కింద ఏడాదికి మూడు ఉచిత సిలిండర్‌లు అందించనుంది. ఫ్రీ సిలిండర్ పథకానికి ఆల్రెడీ బుకింగ్స్‌ మొదలయ్యాయి. 31వ తేదీ నుంచి ఏపీలో ఈ ఉచిత సిలిండర్ల డెలివరీ మొదలైంది. ఏపీ సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో ఉచిత సిలిండర్ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అయితే ఈ పథకానికి అర్హులు ఎవరు అనే అనుమానాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. రేషన్ కార్డుదారులతో పోల్చితే లబ్ధిదారుల సంఖ్య తక్కువగా ఉంది. ఇంకా చదవండి.


2. కర్నూలు జిల్లాలో తీవ్ర విషాద ఘటన


ఎమ్మిగనూరులో ఓ ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలింత మృతి చెందింది. ఆస్పత్రి నిర్లక్ష్యం వల్లే వైద్యం వికటించి ఆమె చనిపోయిందని బంధువులు ఆరోపించారు. ఆసుపత్రి ముందు మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. మంత్రాలయం మండలం కల్లూదేవాకుంట గ్రామానికి చెందిన సుజాత (28) గర్భం దాల్చినప్పటి నుండి ఎమ్మిగనూరులో ఉన్న ఆ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా నిన్నటి రోజు పురిటినొప్పులు రావడంతో, ఆసుపత్రిలో వైద్యులు పరీక్షించి ఆమెకు సీజరిన్ చేసి బేబీను బయటకు తీశారు. ఇంకా చదవండి.


3. గ్యాస్ సిలిండర్ లోడ్ లారీ బోల్తా


కడప జిల్లా వేంపల్లి సమీపంలోని SNR కళ్యాణ మండపం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనంతపురం నుంచి లక్కిరెడ్డిపల్లికి వెళ్తున్న హెచ్‌పీ గ్యాస్ సిలిండర్ లోడ్ తో వెళ్తున్న లారీ ఒక్కసారిగా బోల్తా పడటంతో స్థానికులందరూ భయాందోళనకు గురయ్యారు. సుమారుగా లారీలో వందల సిలిండర్లో లోడు ఉండటం ఒక్కసారిగా రోడ్డుపైన బోల్తాపడడంతో ఎక్కడ గ్యాస్ లీక్ అయి ప్రమాదం జరుగుతుందో అని భయపడ్డారు. అదృష్టవశాత్తు లారీ బోల్తా పడినప్పటికీ గ్యాస్ లీక్ అవ్వకపోవడంతో పెను ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. ఇంకా చదవండి.


4. మందకృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు


ఎస్సీ వర్గీకరణ జరిగితేనే మాదిగ దాని ఉప కులాలు బాగుపడతాయని, ఉద్యోగాల్లోనూ సముచిత స్థానం లభిస్తుందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారంలో శనివారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా ధర్మ యుద్ధ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై సభలో మాట్లాడారు. 1994లో జులై 7న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో  ఉన్న ఓ మారుమూల గ్రామంలో పుట్టిన ఎస్సీ వర్గీకరణ పోరాటం ఇప్పుడు దిల్లీ వరకు వెళ్లిందన్నారు. ఇంకా చదవండి.


5. తుస్సుమన్న తెలంగాణ కాంగ్రెస్ బాంబులు


 "దీపావళి అయిపోయింది అయినా బాంబులు పేలలేదేంటి సార్" అని జర్నలిస్టులు ప్రశ్న వేస్తే ఏంటి ర్యాగింగ్ చేస్తున్నారా అని .. చిరాకుపడి వెళ్లిపోయారు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి. సియోల్‌ పర్యటనలో ఉన్నప్పుడు హడావుడిగా అక్కడికి తీసుకెళ్లిన మీడియా ప్రతినిధులకు ఇంటర్యూ ఇచ్చి మరీ దీపావళికి బీఆర్ఎస్‌పై బాంబులు పేలుస్తామని ప్రకటించారు. దీంతో ఏదో ప్లాన్ తోనే ఆయన అన్నారని అనుకున్నారు. అందుకే బీఆర్ఎస్ అగ్రనేతల అరెస్టులు ఉంటాయి ఫిక్సపోయారు. ఇంకా చదవండి.