Morning Top Head lines:
ఎదుర్కొనే దమ్ములేక కుట్రలు: కేటీఆర్
జన్వాడ ఫామ్ హౌస్ కేసు ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. 14 మందిలో ఒక్కరికి పాజిటివ్ వచ్చిందని చెబుతున్నారని, అతడు ఎక్కడ డ్రగ్స్ తీసుకున్నాడో తేల్చాలన్నారు. ఉదయం మద్యం సీసాలు ఎక్కువ దొరికాయని ఎక్సైజ్ కేసు అన్నారు. అది సాయంత్రానికి డ్రగ్స్ కేసుగా మారిపోయిందని, తనను, తన పార్టీని ఎదుర్కొనే ధైర్యం లేకనే ఈ కుట్రలు చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ఫాంహౌస్ పార్టీ.. డీజీపీకి కేసీఆర్ ఫోన్
జన్వాడ ఫాంహౌస్ పార్టీపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరా తీశారు. డీజీపీ జితేందర్ కు ఫోన్ చేసి.. రాజ్ పాకాల, ఆయన సోదరుడు శైలేందర్ ఇళ్లలో తనిఖీలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులు సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా సోదాలు చేస్తారని ప్రశ్నించారు. వెంటనే తనిఖీలు ఆపాలని కేసీఆర్ డీజీపీని కోరారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
బీఆర్‌ఎస్ నేతలు అరెస్ట్
రాజ్‌పాకాల సోదరుడు రాజేంద్రప్రసాద్ విల్లాలో తనిఖీలు చేపట్టేందుకు యత్నించిన ఎక్సైజ్ పోలీసులను బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా తనిఖీ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో బీఆర్ఎస్ నేతలు వివేకానంద, బాల్క సుమన్ సహా పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఎక్సైజ్ అధికారులు.. రాజేంద్రప్రసాద్ విల్లాలో తనిఖీలు చేపట్టారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్‌లో దీపావళి పర్వదినానికి ముందు భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అబిడ్స్ పరిధిలోని బొగ్గులకుంటలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. పారాస్ బాణాసంచా దుకాణంలో పేలుడు సంభవించి పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. పక్కనే ఉన్న ఓ హోటల్‌కు మంటలు వ్యాపించడంతో జనం భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 3 ఫైరింజన్లతో మంటలు అదుపు చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
విజయసాయిరెడ్డికి షర్మిల సవాల్
వైఎస్ మృతికి కారణమైన చంద్రబాబుతో షర్మిల చేతులు కలిపారంటూ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై షర్మిల తీవ్రంగా స్పందించారు. 'సాయిరెడ్డి గారు.. మీరు చదివింది జగన్ గారి స్క్రిప్ట్ కాదని ప్రమాణం చేయగలరా? ఆస్తుల గురించి నలుగురు చిన్న బిడ్డలకు సమాన వాటా ఉంటుందన్న YSR మ్యాండేట్ అబద్ధమని మీ బిడ్డల మీద ప్రమాణం చేయగలరా ?' అంటూ ట్వీట్ చేశారు. అయితే నాలుగు రోజులుగా జరుగుతున్నఈ వివాదానికి పుల్‌స్టాప్ పెట్టేందుకు వై సీపీ నిర్ణయించింది. ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి బహిరంగ ప్రకటనలు చేయొద్దని శ్రేణులకు, పార్టీ నేతలకు పిలుపునిచ్చింది. . పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ఏపీకి వెళ్లిన ఐఏఎస్‌లకు కీలక పోస్టింగ్‌లు
ఏపీకి వెళ్లిన ఐదుగురు ఐఏఎస్‌లకు ప్రభుత్వం కీలక పోస్టింగ్‌లు కేటాయించింది. టూరిజం శాఖ ఎండీగా ఆమ్రపాలిని నియమించింది. వైద్యారోగ్య శాఖ కమిషనర్‌గా వాకాటి కరుణ, జీఏడీ ముఖ్య కార్యదర్శిగా వాణి మోహన్, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్‌కు పోస్టింగ్ ఇచ్చారు. ఈ మేరకు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఈ నలుగురు ఐఏఎస్‌లు తమ జాయినింగ్ రిపోర్ట్‌ను సీఎస్‌కు సమర్పించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
నాకు రాజకీయ అనుభవం లేకపోవచ్చు.. కానీ: విజయ్
‘‘నాకు రాజకీయ అనుభవం లేకపోవచ్చు. కానీ, నేను పాలిటిక్స్ విషయంలో భయపడడం లేదు’’ అని నటుడు విజయ్ అన్నారు. సినీ రంగంతో పోలిస్తే రాజకీయ రంగం చాలా సీరియస్ అని పేర్కొన్నారు. విల్లుపురం సమీపంలో నిర్వహించిన తమిళగ వెట్రి కళగం పార్టీ మొదటి మహానాడులో ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా పార్టీ సిద్ధాంతాలతో పాటు వివిధ అంశాలపై మాట్లాడారు. ఈ సభకు వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ఆనంద్ మహీంద్ర ఫిదా
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఆసక్తికర విషయాలు పంచుకుంటుంటారు. ప్రపంచం నలుమూలల్లో జరిగే వింతలు, వినూత్న ఆవిష్కరణలను షేర్ చేస్తుంటారు. తాజాగా ఓ హైదరాబాదీ టాలెంట్‌ను పరిచయం చేస్తూ ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేశారు. పెన్సిల్, షూ, షార్పనర్, పిజ్జా.. ఇలా రకరకాల కార్లను తయారు చేస్తున్న వ్యక్తి గురించి వివరించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
గంభీర్ కీలక నిర్ణయం
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఓటమితో టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మూడో టెస్టుకు ముందు ఈ నెల 30, 31 తేదీల్లో ఆటగాళ్లకు ట్రైనింగ్ సెషన్లు నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ ట్రైనింగ్ సెషన్‌కు కోహ్లీ, బుమ్రా, రోహిత్ వంటి సీనియర్లు కూడా హాజరు కావాల్సిందేనని మేనేజ్‌మెంట్ స్పష్టం చేసినట్లు క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
‘గేమ్ ఛేంజర్’ నుంచి అప్‌డేట్
రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. టీజర్ విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మరో 75 రోజుల్లో రిలీజ్‌కు సన్నద్ధం చేస్తున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. ప్రస్తుతం అప్‌డేట్ చేసిన పోస్టర్ నెజిటన్లను ఆకట్టుకుంటుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..