Fire Accident In Hyderabad: హైదరాబాద్ (Hyderabad) నగరంలో దీపావళి పండుగ ముందు భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అబిడ్స్ (Abids) పరిధిలోని బొగ్గులకుంటలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. పారాస్ బాణాసంచా దుకాణంలో పేలుడు సంభవించి పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. పక్కనే ఉన్న ఓ హోటల్‌కు మంటలు వ్యాపించడంతో జనం భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 3 ఫైరింజన్లతో మంటలు అదుపు చేశారు. దేవాదాయ శాఖ కార్యాలయానికి సమీపంలోనే ఈ ప్రమాదం జరగ్గా.. 10కి పైగా ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో ఓ మహిళకు గాయాలు కాగా.. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. భారీ పేలుడుతో మంటలు వ్యాపించగా స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Fire Accident: బాణాసంచా దుకాణంలో అగ్నిప్రమాదం - దీపావళి పండుగ ముందు హైదరాబాద్‌లో దుర్ఘటన
Ganesh Guptha
Updated at:
27 Oct 2024 10:59 PM (IST)
Hyderabad News: హైదరాబాద్ అబిడ్స్ పరిధిలోని బొగ్గులకుంటలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించగా మంటలు ఎగిసిపడ్డాయి.
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం