Tamizhaga Vettri Kazhagam First Meeting In Villupuram: తనకు రాజకీయ అనుభవం లేకపోవచ్చని.. కానీ పాలిటిక్స్ విషయంలో భయపడడం లేదని తమిళ స్టార్, దళపతి విజయ్ అన్నారు. తమిళనాడు విల్లుపురం (Villupuram) జిల్లాలోని విక్రవాండిలో తమిళగ వెట్రి కళగం (Tamizhaga Vetri Kazhagam) మొదటి మహానాడును ఏర్పాటు చేశారు. డాక్డర్ బీఆర్ అంబేడ్కర్ పెరియార్‌తో పాటు తమిళ రాజకీయ నేతల కటౌట్స్ మధ్య సభా ప్రాంగణాన్ని అలంకరించగా.. భారీ ఎత్తున అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. దాదాపు 8 లక్షల మంది సభకు హాజరైనట్లు తెలుస్తోంది. అందరినీ విజయ్ పలకరిస్తూ ముందుకు కదిలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అనంతరం సభలో విజయ్ సుదీర్ఘంగా ప్రసంగించారు. సినీ రంగంతో పోలిస్తే రాజకీయ రంగం చాలా సీరియస్ అని అన్నారు. ఈ సందర్భంగా పార్టీ సిద్ధాంతాలతో పాటు వివిధ అంశాలపై మాట్లాడారు. 














పార్టీ సిద్ధాంతాల ప్రకటన


తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడిగా విజయ్ తమ పార్టీ భావజాలాన్ని, సిద్ధాంతాలను ప్రకటించారు. 'ద్రవిడ, తమిళ జాతీయవాద సిద్ధాంతాలను అనుసరిస్తాం. తమిళనాడు గడ్డకు ఇవి రెండు కళ్లలాంటివి. లౌకిక, సామాజిక న్యాయ సిద్ధాంతాలే మా భావజాలం. వాటి ఆధారంగానే పని చేస్తాం. పెరియార్ ఈవీ రామస్వామి, కె.కామరాజ్, బాబాసాహెబ్ అంబేడ్కర్, వేలు నాచియార్, అంజలి అమ్మాళ్ ఆశయాలతో పార్టీని ముందుకు తీసుకెళ్తాం. నేను నా కెరీర్ పీక్‌లో వదిలేసి మీ అందరిపై అచంచల విశ్వాసాన్ని ఉంచి మీ విజయ్‌గా ఇక్కడ నిలబడ్డా. నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు కూడా నన్ను అవమానించారు. అయినా, కఠోర శ్రమ, ధైర్యంతో ఈ స్థాయికి చేరుకున్నా. రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని పూర్తిస్థాయి మెజార్టీతో గెలిపిస్తారని పూర్తిగా విశ్వసిస్తున్నాం. ఒకవేళ ఏవైనా పార్టీలతో పొత్తు పెట్టుకోవాలనుకుంటే వారికి అధికారంలో భాగస్వాముల్ని చేస్తాం.' అని పేర్కొన్నారు.


Also Read: Fake Bomb Threats: విమానాలకు ఫేక్ బాంబు బెదిరింపు కాల్స్ - సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లకు కేంద్రం వార్నింగ్