China Payment Technique: చైనా టెక్నాలజీలో ఎప్పటికప్పుడు తన కొత్త ఆవిష్కరణలతో ప్రజలను ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. చైనా ఇటీవలే కొత్త పేమెంట్ టెక్నాలజీతో ప్రజలను మరోసారి ఆశ్చర్యపరిచింది. వాస్తవానికి పాకిస్తానీ క్రికెటర్ రానా హంజా సైఫ్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఇది వెంటనే చాలా వైరల్‌గా మారింది. కేవలం చేతులు ఊపుతూ చైనాలో పేమెంట్స్ ఎలా జరుగుతాయో ఈ వీడియోలో చూడొచ్చు.


అరచేతి ద్వారా చెల్లింపు...
ఈ వీడియోలో పాకిస్తాన్‌కు చెందిన కంటెంట్ క్రియేటర్ హంజా, అతని స్నేహితులు ఒక కిరాణా దుకాణానికి వెళతారు. అక్కడ వారు ‘పామ్ పేమెంట్ సిస్టం గురించి చూపించారు. ఈ వీడియోను చైనాలోని జుజౌ నగరంలో రూపొందించారు. యూజర్ అరచేయి రిజిస్టర్ అయితే చైనాలో ఎక్కడైనా సరే అరచేతిని ఊపడం ద్వారా పేమెంట్స్ చేయవచ్చని వీడియోలో చూపించారు. 







Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?


ఇంతకుముందు కూడా...
సైఫ్ వీడియో మాత్రమే కాకుండా ఇంతకు ముందు కూడా పామ్ పేమెంట్ సిస్టంకు సంబంధించిన చాలా వీడియోలు వైరల్ అయ్యాయి. ఇంతకుముందు ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా కూడా తన ఎక్స్ హ్యాండిల్‌లో ఇలాంటి వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో బీజింగ్ మెట్రోలో ఒక మహిళ తన అరచేతితో డబ్బు చెల్లించి ప్రజలను ఆశ్చర్యపరిచింది.


చైనాలో క్యాష్‌లెస్ పేమెంట్స్ చాలా వేగంగా వ్యాపించాయని ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. ఇక్కడ ప్రజలు క్యూఆర్ కోడ్, ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అదే సమయంలో ఇప్పుడు అరచేతితో చెల్లింపు పేమెంట్ చేస్తున్న వీడియోలు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో చాలా వేగంగా వైరల్ అవుతోంది.


చైనా తన కొత్త ఆవిష్కరణలతో యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. డిజిటల్ చెల్లింపుల్లో చైనా అత్యంత వేగంగా పురోగమిస్తోంది. కొత్త మార్గాల్లో చెల్లింపులు చేసే పద్ధతి చైనా నుంచి మొదలై ప్రపంచమంతటా వ్యాపించింది.


Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే