Top 10 Headlines Today:


కేసీఆర్‌ టోన్ మారుతోందా!


"ఓడగొడితే రెస్ట్ తీసుకుంటాం. మాకు పోయేది ఏమీ లేదు. నష్టపోయేది ప్రజలే..."  అచ్చంపేట ఎన్నికల ప్రచారసభలో బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ నోటి వెంట వచ్చిన మాట ఇది. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా తమ పార్టీ ఓడిపోతే అన్న మాట  తమ నోటి నుంచి రానివ్వరు. ఎందుకంటే గెలుపుపై అనుమాలున్నాయని అందుకే ఇలా మాట్లాడుతున్నారని విశ్లేషణలు చేస్తారు. 2019లో ఏపీ  అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత- చంద్రబాబు ఇదే రకమైన అర్థం వచ్చేలా మాట్లాడారు. టీడీపీ ఓడిపోతే రాష్ట్రం నష్టపోతుందని.. ప్రజలు నష్టపోతారని పదేపదే చెప్పేవారు. దీంతో ఆయన ఓటమి ఖాయమయిందని అందుకే అలా మాట్లాడుతున్నారని ఎక్కువ మంది విశ్లేషించారు. దానికి తగ్గట్లే ఆయన ఓడిపోయారు.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


దివ్యాంగులకు శుభవార్త


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని దివ్యాంగులకు శుభవార్త వినిపించింది. నియామకాలు, పదోన్నతుల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అక్టోబరు 26న ఏపీపీఎస్సీ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ప్రభుత్వ ఆర్డర్ నెంబర్ 77 ప్రకారం ఇక నుండి ఏపీపీఎస్సీ ఉద్యోగాల నియామకాలు, ప్రమోషన్లకు సంబంధించి దివ్యాంగుల కోసం 4 శాతాన్ని రిజర్వేషన్‌ను ప్రవేశపెట్టింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


ఒత్తిడిలో బీజేపీ


తెలంగాణ బీజేపీ గడ్డు పరిస్థితుల్లో పడిపోయింది. కాంగ్రెస్‌కు  భవిష్యత్ లేదని నమ్మి ఆ పార్టీలో చేరిన వారంతా ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారు. ఉన్నవారి మీద అదే పనిగా పార్టీ మార్పు ప్రచారాలు జరుగుతున్నాయి. అనేక మంది ఇలా వలస వచ్చిన సీనియర్లు తాము పోటీ చేసేది లేదని చెబుతూండటంతో హైకమాండ్ కు కూడా ఏమి జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అతి కష్టం మీద  మొదటి జాబితా ప్రకటించారు. రెండో జాబితాలో ప్రకటించడానికి అభ్యర్థులు లేరు. కాంగ్రెస్ జాబితా కూడా ప్రకటించిన తర్వాత అక్కడి నుంచి వచ్చే అసంతృప్తులకు టిక్కెట్లు ఇవ్వాలని ఆలోచిస్తోంది.  బీజేపీకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది...? పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


సీఐడీ బెదిరింపులకు భయపడేది లేదు: భువనేశ్వరి


ఆంధ్రా సీఐడీ బెదిరింపులకు భయపడేది లేదని.. వారికి సవాల్ విసురుతున్నానని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తేల్చి చెప్పారు. తమపై ఎలాంటి విచారణ అయినా చేసుకోవాలని సీఐడీకి సవాలు విసిరారు. తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబును 48 రోజులుగా జైల్లో ఉంచుతున్నారని ఆవేదన చెందారు. అయినా చంద్రబాబు చాలా ధైర్యంగా ఉన్నారని, ములాఖత్‌కు వెళ్లినప్పుడు కూడా ఆయన ధైర్యం కోల్పోలేదని అన్నారు. ప్రజల నుంచి చంద్రబాబును ఎవరూ దూరం చేయలేరని అన్నారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా తిరుపతిలో నిర్వహించిన మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


అట్టహాసంగా జాతీయ క్రీడలు ప్రారంభం


గోవాలో 37వ జాతీయ క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతుల్లో.. బాణ‌సంచా వెలుగుల్లో..చూపు తిప్పుకోనివ్వని నృత్యకారుల ప్రదర్శన మధ్యలో 37వ జాతీయ క్రీడలు ఘనంగా ఆరంభమయ్యాయి. క్రీడల ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన కళాకారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. యోగా, మల్లకంబ్‌ విన్యాసాలు అబ్బురపరిచాయి. గోవా ముఖ్యమంత్రి  ప్రమోద్ సావంత్‌తో కలిసి గోల్ఫ్ జీపులో ప్రయాణిస్తూ ఫతోర్డాలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలోకి వచ్చిన ప్రధాని మోదీ 37వ జాతీయ క్రీడలను లాంఛనంగా ఆరంభించారు. భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, విండ్‌సర్ఫర్‌ కాత్యా ఇడా ఈ జ్యోతిని తీసుకువెళ్లి ప్రధానికి అందించారు. అనంతరం జాతీయ క్రీడలు ఆరంభమైనట్లు ప్రధాని అధికారికంగా ప్రకటించారు. జాతీయ క్రీడల నిర్వహణకు గోవా ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను మోదీ కొనియాడారు. ఈ క్రీడా మౌలిక సదుపాయాలు గోవా యువతకు ఉపయోగపడతాయని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో మరో నిందితుడికి శిక్ష ఖరారు


దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో ఎన్ఐఏ కోర్టు మరో నిందితుడికి శిక్ష ఖరారు చేసింది. నిందితుడు సయ్యద్ మక్బుల్ కు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఎన్ఏఐ కోర్టు గురువారం తీర్పు వెల్లడించింది.2012తో హైదరాబాద్‌లో పేలుళ్లు జరిపి విధ్వంసం సృష్టించాలని ప్రయత్నించిన ఈ 11 మందితో కూడిన గ్యాంగ్.. పాకిస్థాన్ నుంచి పేలుడు పదార్థాలు తీసుకొచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


తెలంగాణలో పొడి వాతావరణం


ఈ రోజు కింది స్థాయిలోని గాలులు ఈశాన్య దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో  పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


పాక్‌ వర్సెస్‌ దక్షిణాఫ్రికా


భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా విధ్వంసం కొనసాగుతోంది. మొదట భారీ లక్ష్యాన్ని నిర్దేశించడం... తర్వాత ప్రత్యర్థిని స్వల్ప స్కోరుకే కూల్చేసి ఘన విజయం సాధించడం ప్రొటీస్‌కు అలవాటుగా మారింది. ఇప్పటివరకు అయిదు మ్యాచ్‌లు ఆడిన ప్రొటీస్‌... నాలుగు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పుడు పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌ పాక్‌కు చావో రేవో తేల్చే మ్యాచ్‌ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు దక్షిణాఫ్రికా సారధి టెంబా బవుమా... పాకిస్థాన్‌కు హెచ్చరికలు పంపి సంచలనం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో తాము తొలుత బ్యాటింగ్‌కు దిగితే ఊచకోత తప్పదని పాక్‌ జట్టును హెచ్చరించాడు. తమకు తొలుత బ్యాటింగ్ చేసే అవకాశం వస్తే 350కుపైగా పరుగులు చేస్తామని బవుమా తేల్చి చెప్పాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


విదేశాలకు వెళ్లిన వరుణ్ లావణ్య 


కొణిదెల వారి కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. త్వరలో పెళ్లి భాజాలు మోగనున్నాయి. మెగాస్టార్ చిరంజీవి సోదరుడు, నటుడు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్, 'అందాల రాక్షసి' చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయమైన లావణ్యా త్రిపాఠి చేతిలో చెయ్యి వేసి ఏడు అడుగులు వేసే సమయం దగ్గరకు వచ్చింది. నవంబర్ 1న ఈ హీరో హీరోయిన్లు ఇద్దరూ పెళ్లి చేసుకొనున్నారు. అందుకోసం విదేశాలకు వెళ్లారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


పెళ్లిపై కంగనా కామెంట్‌


బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్ ఎలాంటి కామెంట్ చేసినా అది కాస్త సెన్సేషన్ అవుతుంటుంది. సినిమాలపరంగా, వ్యక్తిగతంగా ఆమె ఏది మాట్లాడినా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. తాజాగా తన పెళ్లి పై కంగనా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. పెళ్లితోపాటు తన బ్రేకప్స్ గురించి కూడా మాట్లాడింది కంగనా. ఇంతకీ పెళ్లి, బ్రేకప్స్ గురించి కంగనా ఏం చెప్పింది? డీటెయిల్స్ లోకి వెళ్తే.. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం 'తేజస్'(Tejas). సర్వేష్ మేవారా దర్శకత్వం వహించిన ఈ మూవీ అక్టోబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి